మహీంద్రా తన ప్రముఖ XUV700ని కొత్త ఫీచర్లతో అప్ డేట్ చేసింది. ఈ మోడల్‌కు 2026లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకురానుంది. ఇందులో చాలా ఫీచర్లు ఉండే అవకాశం ఉందని ఆటోమొబైల్ రంగ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వాటి గురించిన లేటెస్ట్ సమాచారం తెలుసుకుందామా?
మహీంద్రా సంస్థ తన పాపులర్ SUV XUV700 మోడల్‌కు 2026లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకురానుంది. ఈ కొత్త వెర్షన్‌లో విప్లవాత్మకమైన మార్పులు జరిగే అవకాశం ఉందని ఆటోమొబైల్ రంగ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ కలిగిన వేరియంట్ ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
మహీంద్రా XUV700 2021లో లాంచ్ అయినప్పటి నుంచి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ కాంటెక్స్ట్‌లో 2026 ఫేస్‌లిఫ్ట్ మోడల్ మరింత ఆధునిక టెక్నాలజీ, సోఫిస్టికేటెడ్ డిజైన్, మెరుగైన ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, భద్రతా ఫీచర్లతో రాబోతుందని అంచనా.
25
XUV700 2026 ఫీచర్స్
కొత్త డిజైన్‌లో రివైజ్ చేసిన ఫ్రంట్ గ్రిల్, అప్డేటెడ్ హెడ్‌ల్యాంప్స్, కొత్త అలాయ్ వీల్స్ కనిపించే అవకాశం ఉంది. అంతేకాకుండా కార్‌లో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ (ADAS), 360 డిగ్రీ కెమెరా, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త ఇంటీరియర్ ఫినిషింగ్ వంటివి కూడా ఉండవచ్చని సమాచారం.
35
మహీంద్రా XUV700 కొత్త మోడల్
ఇక పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్‌లతో పాటు, ఒక హైబ్రిడ్ వేరియంట్ కూడా లైనప్‌లో చేరే అవకాశం ఉంది. ఇది ఫ్యూయల్ ఎఫిషియెన్సీ, పర్ఫార్మెన్స్ పరంగా మెరుగైన అనుభవాన్ని అందించనుంది.
XUV.e9 మోడల్ ఫీచర్లు ఉండొచ్చని సమాచారం. కొత్త డాష్‌బోర్డ్, ఇన్‌ఫోటైన్‌మెంట్, వెంటిలేషన్ సీట్లు ఉంటాయి. హర్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ కూడా ఉండొచ్చు.
2026లో మార్కెట్లోకి విడుదలయ్యే ఈ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ పైన ఇంకా అధికారికంగా కంపెనీ ప్రకటించలేదు. టెస్టింగ్ దశలో ఉన్న కారును మహీంద్రా ఇటీవల రహస్యంగా రోడ్డుపై పరీక్షించినట్లు స్పై ఇమేజ్‌లు సూచిస్తున్నాయి.
ఈ SUV భారత మార్కెట్‌లో టయోటా హైరిడర్, హోండా ఎలివేట్ హైబ్రిడ్, హ్యూండాయ్ టసాన్ వంటి కార్లతో పోటీ పడే అవకాశం ఉంది.
ఇప్పటి ఇంజిన్లే కొత్త ఫేస్ లిఫ్ట్ కారులో ఉండే అవకాశం ఉంది. 2.0 లీటర్ పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్లు ఉంటాయి. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెర్షన్ కూడా రావొచ్చు.
55
XUV700 హైబ్రిడ్ విడుదల
మహీంద్రా నుంచి ఈ కొత్త వేరియంట్‌పై పూర్తి సమాచారం కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 2026లో అధికారిక లాంచ్ తేదీకి ముందే, కంపెనీ మరిన్ని డిటైల్స్ విడుదల చేసే అవకాశం ఉంది.
2025 చివరిలో లేదా 2026 ప్రారంభంలో విడుదల కావొచ్చని పలు వెబ్ సైట్లలో రాశారు. ఈ కార్ లాంచ్ అయినా కొత్త ఫీచర్లు, హైబ్రిడ్ వెర్షన్ తో కొనుగోలుదారులను ఆకర్షిస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.