2000 Rupees Notes: 2000 రూపాయల నోట్లు ఇంకా చెల్లుతాయా? కోట్ల విలువైన నోట్లు ఇంకా జనాల దగ్గరే..

Published : Sep 03, 2025, 02:17 PM IST

2000 రూపాయల నోట్లను ఎప్పుడో ఆర్బీఐ డిమోనిటైజ్ చేసింది. అవి చెల్లవని 2023 మే 19నే చెప్పింది. కానీ ఇప్పటికీ అవి కొందరు దగ్గర ఉన్నాయి. ఆ నోట్లు ఇంకా ప్రజల దగ్గర ఎందుకు ఉన్నాయి? 

PREV
15
2000 నోట్లు చలామణిలో

2016లో డిమానిటైజేషన్ చేసిన తర్వాత వెయ్యి రూపాయల నోట్లు పూర్తిగా కనుమరుగైపోయాయి. 500 రూపాయల నోట్లు కూడా కొత్త సిరీస్ ను దించారు. ఆ తర్వాత 2000 రూపాయల నోట్లు చలామణిలోకి వచ్చాయి. అవి వచ్చి ఎక్కువ కాలం పాటు చెల్లుబాటు కాలేదు. రిజర్వ్ బ్యాంకు 2023 మే 19ని వాటిని డిమోనిటైజ్ చేస్తున్నట్టు ప్రకటించుకుంది. అంటే తిరిగి ఉపసంహరించుకుంది. కాబట్టి 2000 రూపాయల నోట్లు చట్టబద్ధంగా చలామణిలో లేవు.

25
రెండు వేల రూపాయల నోట్లు తిరిగి ఇచ్చేయమన్నా కూడా..

ఎవరి దగ్గర అయితే 2,000 రూపాయల నోట్లు ఉంటాయో వాటిని బ్యాంకుకు తిరిగి తెచ్చి ఇవ్వమని చెప్పింది ఆర్బిఐ. ఆ 2000 నోట్లకు బదులు చలామణిలో ఉన్న 500 రూపాయల నోట్లను తీసుకోమని వివరించింది. చాలా మంది అదే పని చేశారు. కానీ ఎందుకో తెలియదు ఇప్పటికీ కోట్ల విలువైన 2,000 రూపాయల నోట్లు ఇంకా ప్రజల దగ్గరే ఉన్నాయి. అవి చట్టబద్ధంగా చలామణిలో లేకపోయినా ఎందుకలా ప్రజలు తమ దగ్గరే ఉంచుకున్నారు.

35
ఎంత డబ్బు బయటే ఉంది?

ఆర్బీఐ ప్రకటించిన ప్రకారం ఏకంగా 5,956 కోట్ల రూపాయలకు విలువైన ₹2000 నోట్లు ఇంకా ప్రజల దగ్గరే ఉన్నాయని తెలుస్తోంది. అంతకుముందు ఇంకా ఎక్కువే ఉండేవి. ఇప్పుడు చాలామంది తీసుకొచ్చి బ్యాంకుల్లో ఆ నోట్లను తిరిగి ఇచ్చేశారు. దీంతో కొంతవరకు తగ్గింది. కానీ ఇప్పటికీ అధిక స్థాయిలోనే ప్రజల దగ్గర 2000 రూపాయల నోట్లు ఉన్నాయి.

మే 19, 2023న అంటే 2000 నోట్ల రూపాయలను ఉపసంహరించుకున్న రోజు 3.56 లక్షల కోట్ల విలువైన 2000 రూపాయల నోట్లు ప్రజల దగ్గర ఉండేవి. అయితే వాటిని తిరిగి బ్యాంకులకు ఇచ్చేయడంతో ప్రస్తుతం ఇంకా 5956 కోట్ల విలువైన రెండువేల రూపాయల నోట్లు ప్రజల చేతుల్లో ఉన్నాయి. వాటిని వారు ఎందుకు ఉంచుకున్నారో మాత్రం అర్థం కావడం లేదు. దాదాపు 2000 రూపాయల నోట్లో 98.33 శాతం తిరిగి బ్యాంకులకు చేరాయి. కానీ మిగతా శాతం మాత్రం జనాల దగ్గరే ఉండిపోయాయి.

45
నల్ల ధనం వల్ల దాచుకున్నారా?

2,000 రూపాయల నోట్లు చలామణిలో లేవని తెలిసినా కూడా కొంతమంది వాటిని ఎందుకు దాచుకున్నారు? అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. మరి కొంతమంది గ్రామీణ ప్రజలు తెలియక అవి చలామణిలో ఉన్నాయని దాచుకొని ఉండొచ్చు అని కూడా భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలు ఎక్కువ మొత్తాన్ని దాయలేరు కాబట్టి ఈ ₹2000 నోట్లు కొంతమంది కోటీశ్వరుల దగ్గర కూడా పేరుకుపోయి ఉండవచ్చని అది నల్లధనం కావచ్చు అని కూడా అనుమానిస్తున్నారు.

55
ఆర్బీఐ కార్యాయాలు ఇవే

మీ దగ్గర ₹2,000 నోట్లు ఉంటే వెంటనే అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, బేలాపూర్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, లక్నో, జమ్ము, కాన్పూర్, జైపూర్, కోల్కతా, ముంబై, నాగపూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురం వంటి నగరాల్లో ఉన్న ఆర్బిఐ కార్యాలయాలకు వెళ్లి వాటిని మార్చుకోవచ్చు. మీరు ఇచ్చిన మొత్తానికి సరిపడా డబ్బును తిరిగి పొందవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories