113 రూపాయ‌ల‌కే 11.66 గ్రాముల బంగారం !

First Published | Jan 5, 2025, 6:51 PM IST

Gold: దేశంలో బంగారం ధ‌ర‌లు భ‌గ్గుమంటున్నాయి. ప్ర‌స్తుతం భార‌త్ లో 10 గ్రాముల‌ బంగారం ధర దాదాపు 78,000కు చేరుకుంది. కిలో వెండి ధర 91 వేలకు చేరువైంది. మీరు న‌మ్మ‌రేమో కానీ,  113 రూపాయ‌ల‌కే 11.66 గ్రాముల బంగారం వ‌చ్చింది.. !
 

Gold

Gold: బంగారానికి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మ‌న దేశంలోనే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌సిడి లేక్క ప్ర‌త్యేకం. ప్ర‌స్తుతం  భార‌త దేశంలో బంగారం ధ‌ర‌లు భ‌గ్గుమంటున్నాయి. ఇప్పుడు భార‌త్ లో 10 గ్రాముల‌ బంగారం ధర దాదాపు 78,000కు చేరుకుంది. కిలో వెండి ధర 91 వేలకు చేరువైంది. అయితే, మీరు న‌మ్మ‌రేమో కానీ, 113 రూపాయ‌ల‌కే 11.66 గ్రాముల బంగారం వ‌చ్చింది.. ! వివ‌రాల్లోకెళ్తే..

ఒకప్పుడు రూపాయి విలువ చాలా తక్కువగా ఉండేది. ప్రజలు తక్కువ ధరకు ఏదైనా పొందవచ్చు. ఒక్క రూపాయికే చాలా బంగారం వ‌చ్చేద‌ని మ‌న ఇంట్లో ఉంటే అమ్మ‌మ్మ‌లు, నాన్న‌మ్మ‌లు త‌ర‌చూ చెబుతుండ‌టం మీరే వినే ఉంటారు. అవునూ నిజ‌మే వాళ్లు యంగ్ ఏజ్ లో ఉన్న స‌మ‌యంలో బంగారం ధ‌ర‌లు మ‌న దేశంలో చాలా త‌క్కువ ఉండేవి. 


ఇప్ప‌టి ధ‌ర‌లు చూసి అప్పుడు మా ద‌గ్గ‌ర డ‌బ్బులు ఉంటే మ‌స్తుగా బంగారం కొని పెట్టుకునే వాళ్ల‌మ‌ని చెబుతుంటారు. ప్ర‌స్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దాదాపు 75-72 వేలుగా ఉంది. అయితే, 1959 నాటి బంగారు రసీదు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ రశీదులో బంగారం ధర చూసి ప్రజలంద‌రూ ఆశ్చర్యపోతున్నారు.

1959 నుండి బంగారం కొనుగోలు చేసిన రసీదు @upscworldofficial అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. బిల్లులో 1959 తేదీ రాసి ఉంది. అంతేకాకుండా 1 గ్రాము బంగారం ధర కూడా రాశారు. ఇప్పుడున్న‌ చాక్లెట్ ధర కంటే త‌క్కువ‌కే తులం బంగారం వ‌చ్చేది. 

వైరల్ అవుతున్న ఫోటో ప్రకారం.. 1959లో 1 తులం (11.66 గ్రాములు) బంగారం ధర రూ.113 మాత్రమే. ఇది మహారాష్ట్రకు చెందిన వామన్ నింబాజీ అనే దుకాణం బిల్లు, మరాఠీలో రాసి ఉంది. 3 తులాల బంగారం, వెండి కొనుగోలు చేసి మొత్తం రూ.909 చెల్లించిన శివలింగ్ ఆత్మారామ్ పేరిట ఈ రశీదు ఉంది. ఈ పోస్ట్‌కు 38 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి.

ప్ర‌స్తుతం బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే? 

జనవరి మొదటి వారంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ఆదివారం బులియన్ మార్కెట్ విడుదల చేసిన బంగారం, వెండి కొత్త ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల‌ బంగారం ధర 72,300గా ఉంది. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 78,860గా ఉంది. అలాగే, 1 కిలో వెండి ధర రూ.91,500గా ఉంది. 

వివిధ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల‌ బంగారం ధర

భోపాల్, ఇండోర్ - రూ.72,200/-
జైపూర్, లక్నో, ఢిల్లీ - రూ. 72, 300/-
హైదరాబాద్, కేరళ, కోల్‌కతా, ముంబై- రూ.72,150/-

వివిధ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల‌ బంగారం ధర

భోపాల్, ఇండోర్ - రూ.78,760
ఢిల్లీ, జైపూర్, లక్నో, చండీగఢ్ - రూ.78,860/-
హైదరాబాద్, కేరళ, బెంగళూరు - రూ.78,710/-
చెన్నై- రూ.78,710/- 

Latest Videos

click me!