ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ తో పాటు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ - ఐడియా వంటి ప్రైవేట్ కంపెనీలు భారతదేశంలో టెలికాం సేవలందిస్తున్నాయి. జియో, ఎయిర్‌టెల్ లు 5జీ సేవలను అందిస్తున్నాయి. వొడాఫోన్ ఐడియా కూడా 5జీ సేవలను త్వరలోనే ప్రారంభించనుంది. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇంకా 3జీ సేవలనే అందిస్తోంది. అయితే ప్రైవేట్ కంపెనీలు ధరలు పెంచుతుండటంతో చాలా మంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. బీఎస్ఎన్ఎల్ ఎప్పుడు 4జీ సేవలను ప్రారంభిస్తుందని ఎదురుచూస్తున్న వారికి ఇది శుభవార్త.
4జీ సేవలు ఎప్పుడు?
బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు మార్చి నాటికి అందుబాటులోకి వస్తాయని సంస్థ ప్రకటించింది. 2025 చివరి నాటికి దేశవ్యాప్తంగా 4జీ సేవలు విస్తరిస్తామని వెల్లడించింది. 4జీ సేవలు ప్రారంభమైన తర్వాత 3జీ నెట్‌వర్క్‌ను నిలిపివేస్తారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో 3జీ నెట్‌వర్క్‌ను నిలిపివేశారు. 4జీ సేవలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో 3జీ సిమ్ కార్డు ఉన్నవారు కాల్స్ మాత్రమే చేసుకోగలరు. డేటా సేవలు వినియోగించలేరు.
4జీ సిమ్ కార్డ్ ఎలా పొందాలి?
బీఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఆర్.కె. చౌదరి మాట్లాడుతూ, "చాలా జిల్లాల్లో 4జీ నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేశాం. చాలా జిల్లాల్లో 3జీ నెట్‌వర్క్‌ను నిలిపివేశాం. జనవరి 15 నుంచి మిగిలిన ప్రాంతాల్లో కూడా 3జీ సేవలను నిలిపివేస్తాం" అని చెప్పారు. 4జీ సేవలు పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు సమీప కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా బీఎస్ఎన్ఎల్ కార్యాలయానికి వెళ్లి పాత 3జీ సిమ్ కార్డును ఇచ్చి కొత్త 4జీ సిమ్ కార్డును పొందవచ్చని తెలిపారు.
4జీ సిమ్ పొందాలంటే వినియోగదారులు తమ ఫోటో ఐడెంటిటీ కార్డును తీసుకెళ్లాలి. ముఖ్యంగా 2017కి ముందు జారీ చేసిన సిమ్‌లను మాత్రమే మారుస్తున్నారు. దీనికి ఎలాంటి ఛార్జీలు ఉండవని, ఉచితంగానే ఇస్తామని బీఎస్ఎన్ఎల్ అధికారులు తెలిపారు. బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు పూర్తిగా అందుబాటులోకి వస్తే జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ - ఐడియా వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతారని అధికారులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: మీ ఫోన్ స్లో అయ్యిందా? వాట్సాప్‌లో ఈ సెట్టింగ్స్ మారిస్తే స్పీడ్ అవుతుంది
BSNL ప్రీపెయిడ్ యూజర్ల కోసం ప్రస్తుతం వివిధ రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రముఖ ప్లాన్లు ఇక్కడ ఉన్నాయి.
రూ. 249 ప్రీపెయిడ్ ప్లాన్
45 రోజుల చెల్లుబాటుతో ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తాయి. అంతేకాకుండా రోజుకు 100 SMSలు కూడా మీరు పంపొచ్చు.
రూ. 108 ప్రీపెయిడ్ ప్లాన్
28 రోజుల చెల్లుబాటుతో ప్రతిరోజూ 1GB డేటా లభిస్తుంది. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు మీరు పంపొచ్చు.
రూ. 2,399 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్
425 రోజుల చెల్లుబాటుతో ప్రతిరోజూ 2GB డేటా లభిస్తుంది. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు పొందొచ్చు.
రూ. 1,198 ప్రీపెయిడ్ ప్లాన్
365 రోజుల చెల్లుబాటుతో ప్రతి నెల 300 నిమిషాల వాయిస్ కాల్స్, ప్రతి నెల 3 GB డేటా, ప్రతి నెల 30 SMSలు లభిస్తాయి.
రూ. 397 ప్రీపెయిడ్ ప్లాన్
150 రోజుల చెల్లుబాటుతో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, ప్రతిరోజూ 2GB డేటా, రోజుకు 100 SMSలు ఈ రీఛార్జ్ లో మీరు పొందొచ్చు. ఇలాంటి అనేక సదుపాయాలు కల్పించే రీఛార్జ్ కూపన్లు బీఎస్ఎన్ఎల్ లో ఉన్నాయి.