108MP కెమెరా, 6600mAh బ్యాటరీతో తక్కువ ధరలో జియో 5G ఫోన్

First Published | Nov 6, 2024, 10:46 PM IST

Jio’s 108MP Camera Phone : టెలికాం సంచ‌లనం త‌క్కువ ధ‌ర‌లోనే అంద‌రికీ బడ్జెట్ అనుకూలమైన ధరలో 108MP కెమెరా, 6600mAh బ్యాటరీతో 5G ఫోన్ ను తీసుకువ‌స్తోంది.
 

Jio’s 108MP Camera Phone : త‌క్కువ ధ‌ర‌లోనే అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌తో రిలయన్స్ జియో మ‌రో కొత్త 5జీ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకురాబోతోంది. ప‌లు మీడియా టెక్ నివేదిక‌ల ప్ర‌కారం.. జియో త‌న‌ రాబోయే Jio LYF 5G స్మార్ట్ ఫోన్ తో భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో మ‌రో సంచ‌ల‌నానికి సిద్ధ‌మ‌వుతోంది. ఈ కొత్త ఫోన్ లో హై-ఎండ్ ఫీచర్లతో త‌క్కువ ధ‌ర‌లోనే అంద‌రికీ అందుబాటు ధ‌ర‌లో తీసుకువ‌స్తుంద‌ని స‌మాచారం. 

జియో త‌న కొత్త ఫోన్ 5జీ టెక్నాల‌జీతో పాటు నెక్స్ట్-జెన్ కనెక్టివిటీని తీసుకురానుంది. ఈ ఫోన్ భార‌తీయ మార్కెట్ లో మ‌రో సంచ‌ల‌నం కానుంది. ప‌లు టెక్ నివేదిక‌ల ప్ర‌కారం.. జియో కొత్త ఫోన్ వివ‌రాలు ఇలా ఉన్నాయి..

కాంపాక్ట్ డిస్‌ప్లే & ప‌వ‌ర్ ఫుల్ ప్రాసెసింగ్ ప‌వ‌ర్

Jio LYF 5G కాంపాక్ట్ 5.4-అంగుళాల పంచ్-హోల్ డిస్‌ప్లేతో రానుంది. ఒక చేతిలో ప‌ట్టుకుని సౌకర్యవంతంగా ఉపయోగించే ఆప్టిమైజ్ తో ఉంటుంది.  90Hz రిఫ్రెష్ రేట్ తో 720×1920 పిక్సెల్ రిజల్యూషన్ డిస్ ప్లే ఉంటుంది. ఫోన్ సున్నితమైన స్క్రోలింగ్, మెరుగైన పిక్చ‌ర్ క్వాలిటీతో మంచి అనుభ‌వాన్ని అందించే విధంగా ఉంటుంది. మెరుగైన భద్రత కోసం ఇన్ డిస్ ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ను కూడా కలిగి ఉంటుంది. ఇది వినియోగదారులు త‌మ ఫోన్ ను సులభంగా యాక్సెస్ చేయ‌డంలో ఉప‌యోగ‌ప‌డుతుంది. 

ఈ ఫోన్ MediaTek Dimensity 5200 ప్రాసెసర్‌తో పని చేస్తుందని భావిస్తున్నారు. ఇంటరప్షన్‌ లేని 5G కనెక్టివిటీతో రోజువారీ పనితీరును బ్యాలెన్స్ చేస్తుంది. ఈ చిప్‌సెట్ ఎంపిక ఖర్చులను పెంచకుండా విశ్వసనీయ పనితీరును తీసుకురావడానికి జియో నిబద్ధతను హైలైట్ చేస్తుంది. మంచి ప్రాసెసింగ్ తో పాటు యూజ‌ర్స్ కు మంచి అనుభ‌వాన్ని అందిస్తుంది.


నాలుగు కెమెరాల‌తో జియో 5జీ ఫోన్ 

Jio LYF 5G కెమెరా సిస్టమ్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లకు గేమ్ ఛేంజర్‌గా ఉంటుందని భావిస్తున్నారు. ఆకట్టుకునే కెమెరా సెటప్ తో రాబోతోంది. మొత్తం నాలుగు కెమెరాల సెట‌ప్ ను క‌లిగి ఉంటుంద‌ని మీడియా నివేదిక‌లు పేర్కొంటున్నాయి. 

108MP ప్రధాన కెమెరా : శక్తివంతమైన, వివరణాత్మక ఫోటోల కోసం అధిక రిజల్యూషన్
13MP అల్ట్రా-వైడ్ లెన్స్ : పెద్ద దృశ్యాలను క్యాప్చర్ చేయడానికి అనువైనది
5MP పోర్ట్రెయిట్ కెమెరా : పోర్ట్రెయిట్‌ల కోసం ప్రొఫెషనల్-గ్రేడ్ డెప్త్ కెమెరా ఇది
16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా : అధిక-నాణ్యత సెల్ఫీలకు పర్ఫెక్ట్ కెమెరా

హెచ్ డీ వీడియో రికార్డింగ్, 10 ఎక్స్ జూమ్

HD వీడియో రికార్డింగ్, 10X జూమ్‌ని కలిగి ఉన్న కెమెరా సిస్టమ్, ప్రీమియం పరికరాలలో కనిపించే వాటికి పోటీగా ఉంటుంది. యూజ‌ర్స్ కు గొప్ప వీడియో అనుభ‌వాన్ని అందిస్తుంది. 

లాంగ్ లాస్ట్ బ్యాటరీ & ఫాస్ట్ ఛార్జింగ్

బ్యాటరీ లైఫ్ Jio LYF 5G లో గొప్ప‌ హైలైట్ గా ఉంటుంది. బలమైన 6600mAh బ్యాటరీతో వ‌స్తున్న ఈ ఫోన్ రోజంతా వినియోగించ‌డానికి అనుకూలంగా ఉంటుంది.  44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఈ ఫోన్ ను కేవలం ఒక గంటలో పూర్తి ఛార్జ్ చేయ‌వ‌చ్చు. 

బిగ్ స్టోరేజీతో మూడు వేరియంట్లు  

Jio LYF 5G ఫోన్ బిగ్ స్టోరేజీతో మూడు కాన్ఫిగరేషన్‌లతో విభిన్న అవసరాలను తీర్చగలదని భావిస్తున్నారు.

6GB RAM + 64GB స్టోరేజీ
6GB RAM + 128GB 
8GB RAM + 256GB

త‌క్కువ ధ‌ర‌లోనే జీయో 5జీ ఫోన్ 

Jio LYF 5G చాలా త‌క్కువ ధ‌ర‌లోనే అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌తో రానుంది. ఈ ఫోన్ ₹5,999 నుంచి ₹6,999 ధ‌ర‌ మధ్య ప్రారంభమవుతుందని అంచనా. అయితే, వెల్ క‌మ్ ఆఫర్‌లతో ఈ ఫోన్ మీకు ₹3,999–₹4,999 ను కోనుగోలు చేయ‌వ‌చ్చు. అలాగే,  EMI ఎంపికలు గ‌మ‌నిస్తే నెలకు ₹999 నుండి ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. 

Latest Videos

click me!