జనరల్ కోచ్‌లు లేదా కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణికులు ఈ ఇన్సూరెన్స్ పరిధిలోకి లేరు. రైల్వే చట్టం, 1989లోని సెక్షన్లు 124, 124 A ప్రకారం పరిహారం మొత్తం నిర్ణయించబడింది. ఎవరైనా రైలు ప్రమాదంలో మరణిస్తే రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడితే రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడితే రూ.50 వేలు పరిహారం అందజేస్తారు.