3 రోజుల్లో PF డబ్బు ..! అత్యవసర అవసరాల కోసం EPFO ​​కొత్త సర్వీస్ !

First Published | May 20, 2024, 12:40 PM IST

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) ద్వారా పీఎఫ్ అకౌంట్ ఉన్న ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగుల భవిష్య నిధిని EPFO ​​అని పిలిచే ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ నిర్వహిస్తుంది. దీని ప్రకారం పీఎఫ్ అకౌంట్కు మీ జీతం  నుండి ప్రతినెలా  కొంత డబ్బు జమ అవుతుంటుంది. కాబట్టి ఈపీఎఫ్‌ పొందే ఉద్యోగులకు సంతోషకరమైన వార్త.
 

ఒక ఉద్యోగి అనిరుధ్ ప్రసాద్ తన వైద్య ఖర్చుల కోసం ఈపీఎఫ్‌ఓ నుండి  క్లెయిమ్ చేసుకున్న మొత్తాన్ని 3 రోజుల్లోనే పొందాడు. అనిరుధ్‌ ప్రసాద్‌ తన చికిత్సకు డబ్బు అవసరం కావడంతో  మే 9న ఈపీఎఫ్‌వోకు అప్లయ్ చేసుకున్నాడు. అయితే రెండు రోజుల్లో అంటే మే 11వ తేదీన అతను కోరిన అడ్వాన్స్ మొత్తం అతని బ్యాంకు ఖాతాలో జమ అయ్యింది.
 

EPFOలో ఆటో మోడ్ సెటిల్‌మెంట్ సదుపాయంతో అనిరుధ్  క్లెయిమ్ చేసుకున్న డబ్బు త్వరగా వచ్చింది. దీని ప్రకారం, మెడికల్, వివాహం, ఇంటి కొనుగోలు కోసం అడ్వాన్స్ అభ్యర్థిస్తే డబ్బు ఆటోమేటిక్‌గా విడుదల అవుతుంది.
 

Latest Videos


ప్రస్తుత సంవత్సరంలో 2.25 కోట్ల మంది ఈ సదుపాయాన్ని వినియోగించుకోనున్నారు. EPFO మే 6న దేశవ్యాప్తంగా ఈ సేవను ప్రారంభించింది. ఇప్పటి వరకు 13,011 మందికి రూ.45.95 కోట్లు అందజేశామన్నారు.
 

2023-24 ఆర్థిక సంవత్సరంలో, EPFO 4.45 కోట్ల క్లెయిమ్‌లను పరిష్కరించింది. అందులో 2.84 కోట్ల క్లెయిమ్‌లు అడ్వాన్స్‌ పేమెంట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆటో-మోడ్ ద్వారా 89.52 లక్షల నగదు విడుదలైంది. ఆటో క్లెయిమ్ పథకం కింద విడుదలయ్యే మొత్తం పరిమితి రూ.50,000 నుండి రూ. 1 లక్ష పెరిగింది. దీని వల్ల  EPFO ​​మెంబర్స్ గా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
 

ppo epfo 3.jpg

ఈ ఆటో-సెటిల్‌మెంట్ మోడ్‌లో ఉద్యోగుల దరఖాస్తులు IT సిస్టమ్ ద్వారా వెరిఫై చేయబడతాయి. డబ్బు విడుదలకు ఆటోమేటిక్  ఆమోదం ఇవ్వబడుతుంది. డబ్బు అకౌంట్లో వేయడానికి  పట్టే సమయాన్ని కూడా 10 రోజుల నుంచి 3 నుంచి 4 రోజులకు తగ్గించారు.
 

click me!