Yamaha RX 100 : స్పోర్టీ లుక్, సరికొత్త ఫీచర్లతో న్యూ యమహా ఆర్ఎక్స్ 100 : ధర ఎంతో తెలుసా?

First Published | Sep 9, 2024, 11:20 PM IST

RX 100 పేరుతో ఓ సినిమా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయ్యిందంటేనే ఆ పేరుకు ఎంత క్రేజ్ వుందో అర్థమవుతుంది. అలాంటి Yamaha RX 100 బైక్ సరికొత్త లుక్ లో యువత మనసు దోచేందుకు సిద్దమైంది. ఈ బైక్ కు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి... 

Yamaha RX 100

Yamaha RX 100... ఒకప్పుడు భారతీయ యువతరం రయ్ రయ్ మంటూ దూసుకెళ్ళిన బైక్. అప్పట్లో ఈ బైక్ ను ఇష్టపడని వారులేరు. ఇప్పటి మాదిరిగా దేశ విదేశాలకు చెందిన స్పోర్ట్స్ బైక్స్ ఆనాడు ఎక్కువగా వుండేవికావు... కాబట్టి మంచి స్పోర్టీ లుక్ తో, డిఫరెంట్ సౌండ్ తో కూడిన యమహా ఆర్ఎక్స్ 100 కు మామూలు క్రేజ్ వుండేది కాదు. కాలేజీ యువత ఈ బైక్ అంటే పడిచచ్చేవారు. ఇలా భారతీయ యువత ఇష్టపడే బైకుల్లో ఇది ఒకటిగా నిలిచింది. 

ఈ యమహా ఆర్ఎక్స్ 100 భారతీయ బైకింగ్ చరిత్రలోనే చెరగని ముద్ర వేసింది. 1980 దశకంలో RX 100 ని యమహా కంపనీ భారతీయ మార్కెట్ లోకి తీసుకువచ్చింది... ఇలా వచ్చిందో అలా మంచి క్రేజ్ సంపాదించింది.దేశంలోని యువతరానికి తొలిచూపులోనే తెగ నచ్చేసిన ఈ బైక్ కు అమాంతం డిమాండ్ పెరిగింది. 
 

Yamaha RX 100

ఆ కాలంలోనే అత్యధికంగా అమ్ముడుపోయిన వాహనాల్లో యమహా ఆర్ఎక్స్ 100 ఒకటి. దీని అదిరిపోయే లుక్, లైట్ వెయిట్, వేగం ఎంతగానో నచ్చాయి... మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువగా వుండేది. ఇలా దీని పనితీరు బాగుండి ప్రయాణం సాఫీగా సాగడంతో ఇది చాలామందికి ఇష్టమైన బైక్ గా మారిపోయింది. 
ఆనాటి యువతరానికి ఇది మరచిపోలేని అనుభవాన్ని అందించింది.

Yamaha RX 100 ఆనాడే 98cc టూ-స్ట్రోక్ ఇంజిన్ కలిగివుండేది. నమ్మలేని వేగంతో, తేలికపాటి డిజైన్‌తో RX 100 యువరక్తాన్ని ఆకర్షించింది. అయితే ఈ బైక్ ను ఆ తరానికి కూడా పరిచయం చేయాలన్న భావనలో యమహా కంపనీ వుంది.  అందువల్లే సరికొత్త ఫీచర్లు, మరింత స్పోర్టీ లుక్ తో ఆర్ఎస్ 100 ను మార్కెట్ లోకి తీసుకువచ్చేందుకు యమహా సిద్దమయ్యింది. 
 


Yamaha RX 100

 కొత్త యమహా ఆర్ఎక్స్ 100 లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, LED హెడ్‌లైట్, టర్న్ బై ఇండికేటర్, రెండు టైర్లలో డిస్క్ బ్రేకులు, అల్లాయ్ వీల్స్, USB పోర్ట్, చార్జింగ్ పోర్ట్, వైర్‌లెస్ చార్జింగ్ వంటి ఆధునిక ఫీచర్లను చూడవచ్చు. ఈ ఫీచర్లన్ని నేటి యువతను ఆకట్టుకునే ఉద్దేశంతోనే సరికొత్త ఆర్ఎక్స్ 100 కు చేర్చినవే. ఇలా ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేసి సరికొత్త అనుభూతిని కలిగించేలా ఈ బైక్ ను రూపొందించినట్లు తెలుస్తోంది.ఈ వాహనం మునుపటి RX 100 కంటే ఇంకా స్పోర్టీ లుక్‌తో మార్కెట్లోకి విడుదల కానుంది.

Yamaha RX 100

న్యూ ఆర్ఎక్స్ 100 వాహనంలో 98cc సామర్థ్యంతో కూడిన ఇంజిన్ కలిగివుంటుందని... ఇది 18 bhp పవర్, 22 Nm టార్క్ ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుంది. మైలేజ్ విషయానికి వస్తే సులభంగా 35 నుండి 40 కిలోమీటర్ల అందిస్తుందనేది ఆటో వర్గాల టాక్. 

Yamaha RX 100

ఇక ప్రస్తుతం మార్కెట్ లోకి తీసుకువచ్చే న్యూ ఆర్ఎక్స్ 100 వాహనం రూ. 1.40 లక్షల నుండి రూ. 1.50 లక్షల వరకు ప్రారంభ ధర ఉండొచ్చని అంచనా. 2024 చివరినాటికి ఈ వాహనాన్ని భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ఆటో వర్గాల్లో టాక్ నడుస్తోంది.   

Latest Videos

click me!