Ducati Scrambler 800 Urban Motard: స్పోర్ట్స్ బైక్ కొనాలని ఉందా..అయితే డుకాటి నుంచి కొత్త బైక్..ధర ఎంతంటే..

Published : Jun 29, 2022, 02:01 PM IST

మన దేశంలో బైక్స్ అంటే యువత చాలా ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా స్పోర్ట్స్ బైక్స్ అంటే తెగ క్రేజ్ ఉంది. అయితే ప్రముఖ స్పోర్ట్స్ బైక్స్ తయారీ దారు అయిన డుకాటీ, తన బైక్ ప్రియుల కోసం డుకాటీ స్క్రాంబ్లర్ బైక్ ను ప్రవేశ పెట్టింది. ఈ బైక్స్ త్వరలోనే మన దేశీయ రోడ్లపై రై రై మంటూ  దూసుకు వెళ్లనున్నాయి. 

PREV
15
Ducati Scrambler 800 Urban Motard: స్పోర్ట్స్ బైక్ కొనాలని ఉందా..అయితే డుకాటి నుంచి కొత్త బైక్..ధర ఎంతంటే..

డుకాటి (Ducati) తన కొత్త బైక్ డుకాటి స్క్రాంబ్లర్ అర్బన్ మోటార్డ్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త డుకాటి స్క్రాంబ్లర్ అర్బన్ మోటొర్డ్ ( Ducati Scrambler Urban Motard) దేశీయ మార్కెట్లో రూ. 11.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో పరిచయం అయ్యింది. 

25

ఈ బైక్ ఐకాన్, ఐకాన్ డార్క్, నైట్‌షిఫ్ట్ మరియు డెసర్ట్ స్లెడ్ ​​వెర్షన్‌లలో 800cc స్క్రాంబ్లర్ లైనప్‌లో చేరింది. ఈ బైక్ నేటి నుండి అమ్మకానికి అందుబాటులో ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డుకాటీ డీలర్‌షిప్‌లలో కొనుగోలు చేయవచ్చు.

35

కొత్త డుకాటి స్క్రాంబ్లర్ అర్బన్ మోటారుడ్ 'స్టార్ వైట్ సిల్క్ ,  రెడ్ GP'19 అనే ప్రత్యేకమైన కలర్ స్కీమ్‌లో అందుబాటులో ఉంది. ఇది బ్లాక్ ఫ్రేమ్ మరియు రెడ్ ట్యాగ్‌తో ప్రత్యేక బ్లాక్ సీటును పొందుతుంది. ఈ బైక్ 803cc L-ట్విన్ ఇంజన్‌తో పనిచేస్తుంది, ఇది 8,250 RPM వద్ద 72 bhp శక్తిని, 5,750 RPM వద్ద 66 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
 

45

ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. డుకాటి స్క్రాంబ్లర్ మోటార్‌సైకిల్ బరువు 180 కిలోలు. సస్పెన్షన్ డ్యూటీల కోసం, ఇది ముందువైపు 41mm USD ఫోర్క్స్ వెనుక వైపున మోనో-షాక్ అబ్జార్బర్‌ని పొందుతుంది. బ్రేకింగ్ విధుల కోసం, రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు ఇవ్వబడ్డాయి. ఇది Bosch నుండి ABSని కూడా పొందుతుంది. ఇది పిరెల్లీ డయాబ్లో రోస్సో III టైర్‌లపై నడుస్తుంది. 17-అంగుళాల స్పోక్డ్ వీల్స్‌ను పొందుతుంది.

55

స్క్రాంబ్లర్ అర్బన్ మోటార్ లాంచ్ గురించి డుకాటి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ బిపుల్ చంద్ర మాట్లాడుతూ, “స్క్రాంబ్లర్ అర్బన్ మోటర్డ్ అనేది పట్టణ పరిసరాలలో అద్భుతమైన అనుభవంగా రూపొందించబడిన బైక్. స్క్రాంబ్లర్ అర్బన్ మోటర్డ్ స్క్రాంబ్లర్ లైనప్‌లో ఒక విలక్షణమైన యంత్రం. దానిని మా రైడింగ్ కమ్యూనిటీకి పరిచయం చేయడం మాకు సంతోషంగా ఉంది! అని పేర్కొన్నారు. 

click me!

Recommended Stories