ధర తక్కువ, మైలేజ్ ఎక్కువ ... టాప్ 5 చీపెస్ట్ బైక్స్

First Published | Sep 11, 2024, 8:56 PM IST

బడ్జెట్ ప్రెండ్లీ బైక్స్ కోసం చూస్తున్నారా? తక్కువ ధరలో ఎక్కువ మైలేజి, తక్కువ మెయింటెన్స్ ఖర్చు వుండే టాప్ 5 ఇండియన్ బైక్స్ ఇవే...

Cheapest Bikes in 2024

Cheapest Bikes in 2024 :పేద, మద్యతరగతి ప్రజల బ్రతుకు బండిని నడిపేవే ద్విచక్ర వాహనాలు. ఉద్యోగుల నుండి వ్యాపారుల వరకు... కాలేజీ స్టూడెంట్స్ నుండి ఖాళీగా తిరిగేవారివరకు ప్రతిఒక్కరూ టూవీలర్ ను ఉపయోగిస్తుంటారు. మార్కెటింగ్ జాబ్ చేసేవారికి, కొందరు చిరు వ్యాపారులకు ఈ టూవీలర్స్ జీవనాదారం. ఇటీవల కాలంలో రైతులు కూడా బైక్స్ ను ఎక్కువగా వాడుతున్నారు.

అయితే కొన్నేళ్ళుగా ద్విచక్రవాహనాలు ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్ లోని అత్యధిక బైక్స్ ధర లక్ష రూపాయల పైనే. అలాగని మైలేజ్ ఎక్కువగా వుంటుందా అంటే అదీ లేదు. మెయింటెనెన్స్ కూడా అధికంగా వుంటున్నారు. ఇలా అధికధరలు కలిగిన బైక్స్ నే తయారీ కంపనీలు ఎక్కువగా రూపొందిస్తున్నాయి. దీంతో పేద, మద్యతరగతి ప్రజలు బైక్స్ కు దూరం అవుతున్నారు. 

కొన్ని కంపనీలు మాత్రం ఇప్పటికీ సరసమైన ధరలతో,మంచి మైలేజ్ కలిగిన బైక్స్ ను అందిస్తున్నాయి. అప్ డేట్ ఫీచర్లతో, తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడిన బైక్స్ మార్కెట్ లో వున్నాయి. ఇలాంటి బడ్జెట్ ప్రెండ్లీ బైక్స్ గురించి తెలుసుకుందాం. 

Hero HF Delux

హీరో హెచ్ఎఫ్ డీలక్స్ : 

అతి తక్కువ ధరలో అధిక మైలేజ్ ఇచ్చే బైక్స్ లో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ టాప్ లో వుంటుంది. ఈ బైక్ చాలా బడ్జెట్ ప్రెండ్లీ... ధర మాత్రమే కాదు మెయింటెనెన్స్ ఖర్చు కూడా చాలా తక్కువ. మద్యతరగతి ప్రజలను దృష్టిలో వుంచుకునే ఈ బైక్ ను హీరో కంపనీ  రూపొందించి వుంటుంది. 

ఈ బైక్ ధర కేవలం రూ.57,238 మాత్రమే (ప్రాంతాన్ని బట్టి ధరలో మార్పు వుంటుంది). 97.2 సిసి ఇంజన్ తో, నాలుగు గేర్లతో, ఐదు రంగుల్లో వస్తుంది. ఈ బైక్ లీటర్ పెట్రోల్ కు70 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. 
 


Honda CD 110 Dream

2. హోండా సిడి 110 డ్రీమ్ : 

రోజువారి కార్యకలాపాల కోసం ఉపయోగించేందుకు ఈ హోండా సిటీ 100 డ్రీమ్ బైక్ సరిగ్గా సరిపోతుంది. 112 కిలోల బరువు, 8.67bhp, 9.30Nm టార్క్ తో కూడిన 109సిసి ఇంజన్ కలిగివుంది. ఈ  బైక్ ఇండియన్ రోడ్లకు తగినట్లుగా రూపొందించారు. 

హోండా సిడి 110 డ్రీమ్ బైక్ ధర రూ.71,133(ప్రాంతాన్ని బట్టి మారుతుంది). ఇది లీటర్ పెట్రోల్ కు 65 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.  నాలుగు రంగుల్లో లభిస్తుంది. పెట్రోల్ ట్యాంక్ సామర్ధ్యం 9 లీటర్లు.
 

TVS Sport

టివిఎస్ స్పోర్ట్ : 

టివిఎస్ స్పోర్ట్ మంచి స్టైలిష్ లుక్ కలిగివుంటుంది. ఈ బైక్ 110సిసి ఇంజన్ ను కలిగివుంటుంది... ఇది  8.29PS పవర్, 8.7Nm టార్క్ ఉత్పత్తిచేస్తుంది. ఈ బైక్ కు నాలుగు గేర్లు వుంటాయి. ఇది రూ.59.881 ధర (ప్రాంతాన్ని బట్టి మారుతుంది) కలిగివుంది. 

ఇది రెండు వెరియంట్లలో అందుబాటులో వుంది... ఒకటి ఎలక్ట్రిక్ స్టార్ట్ కాగా మరొకటి కిక్ స్టార్ట్. ఇది 10 లీటర్ల పెట్రోల్ ట్యాంక్, గ్రౌండ్ క్లియరెన్సక్ 175mm కలిగివుంటుంది. ఇది అన్ని పనులకు ఉపయోగించేలా వుంటుంది. 
 

Hero Splendor Plus

హీరో స్ప్లెండర్ ప్లస్ : 
 
స్ప్లెండర్... ఒకప్పుడు ఇండియాను ఓ ఊపు ఊపిన బైక్. దీనికి కొనసాగింపుగానే  హీరో మోటోకార్ప్ స్ప్లెండర్ ప్లస్ ను తీసుకువచ్చింది. దీని ధర రూ.73.481 గా వుంది. లీటర్ పెట్రోల్ కు 80 కిలో మీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.

ఇది 97.2 సిసి ఇంజన్, 8.05Nm టార్క్, 8.02PS పవర్ కలిగివుంటుంది. ఈ బైక్ ఫ్రంట్ ఆండ్ బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ ని కలిగివుంటుంది. పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ 9.8 లీటర్లు. నాలుగు గేర్లను కలిగివుంటుంది. 

Honda Shine

హోండా షైన్ : 

హోండా షైన్ 124సిసి ఇంజన్ కలిగివుంటుంది. దీని ధర రూ.78,687( ప్రాంతాన్నిబట్టి మారుతుంది). ఐదు రంగుల్లో లభిస్తుంది.  ఫ్రంట్ లో డిస్క్ బ్రేస్, వెనకాల డ్రమ్ బ్రేక్ కలిగివుంటుంది. పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ 10.5 లీటర్లు. 

Latest Videos

click me!