Harley-Davidson: ప్రపంచ స్థాయి సంస్థ హార్లీ డేవిడ్‌సన్ నుంచి సామాన్యులు కొనుగోలు చేసే బైక్...

First Published | Mar 26, 2022, 7:33 PM IST

ప్రపంచ స్థాయి బైక్స్ కంపెనీ హార్లీ డేవిడ్‌సన్ సంస్థ నుంచి సామాన్యులు సైతం కొనుగోలు చేసే బైక్ విడుదల కానుంది. ఈ మేరకు కంపెనీ భారత్, చైనా మార్కెట్లే లక్ష్యంగా డిజైన్ చేసిన ట్లు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.  
 

ప్రీమియం బైక్‌ల తయారీ సంస్థ హార్లే-డేవిడ్‌సన్ త్వరలో బడ్జెట్ ధరలో క్రూయిజర్ బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేయనుంది. హార్లే-డేవిడ్సన్ బెనెల్లీ మాతృ సంస్థ కియాన్‌జియాంగ్ గ్రూప్‌తో భాగస్వామ్యంతో ఎంట్రీ-లెవల్ మోడల్‌లపై పని చేస్తోందిజ  ఈ బైక్స్ ను చైనా, భారతదేశంతో సహా అనేక అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లలో అమ్మడానికి ప్రారంభించనుంది. 

చైనా ఆటో దిగ్గజంతో దాని భాగస్వామ్యంలో కంపెనీ రెండవ మోడల్ (Harley-Davidson 338R)గా ఉండే అవకాశం ఉన్న కొత్త మేడ్-ఇన్-చైనా హార్లే-డేవిడ్‌సన్ ఇటీవల గుర్తించింది.


Harley-Davidson 338R ఇప్పుడు అధికారికంగా గ్లోబల్ మార్కెట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇప్పటి వరకూ అందిని రిపోర్ట్స్ ప్రకారం మేడ్-ఇన్-చైనా HD 338R US నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌లో రిజిస్టర్ అయ్యింది. దీని అధికారిక లాంచ్ త్వరలోనే ఉండవచ్చని భావిస్తున్నారు.
 

Harley Davidson 300 cc Roadster

Fatboy-తయారీదారు రోడ్‌స్టర్ బాడీవర్క్‌ తో భిన్నమైన 500cc ట్విన్ ఇంజిన్ బైక్‌పై పనిని ప్రారంభించినట్లు సూచిస్తున్నాయి. కొత్త మోటార్‌సైకిల్ బెనెల్లీ లియోన్సినో 500 మాదిరిగానే కనిపించే అవకాశం ఉంది.  ఎందుకంటే ఇది లియోన్సినో 500 ఫ్రేమ్, ఫ్రంట్ సస్పెన్షన్, రేడియల్ బ్రేక్ కాలిపర్‌లు  స్వింగ్‌ఆర్మ్ వంటి కొన్ని అంశాలను పంచుకుంటుంది. ఇది కాకుండా, కాస్ట్ అల్లాయ్ వీల్ టైర్లు, హ్యాండిల్‌బార్లు మ ఫుట్‌పెగ్ హ్యాంగర్‌తో సహా ఇతర భాగాలను కూడా తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది.

లియోన్సినో 500 ఇంజిన్ 549 సిసిగా అంచనా వేస్తున్నారు. ఈ ఇంజన్ కూడా బైక్  క్యారెక్టర్‌తో సరిపోలడానికి మరియు bhp tp 50 bhp శ్రేణిలో సర్దుబాటు చేయబడుతుందని భావిస్తున్నారు. ఇది 2024 నాటికి ప్రపంచ మార్కెట్‌లో ప్రవేశపెట్టబడుతుందని భావిస్తున్నారు.

Latest Videos

click me!