దేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్-12 ద్విచక్ర వాహన సంస్థల లిస్ట్ ఇదే..

First Published Dec 15, 2020, 7:30 PM IST

 భారతదేశంలో దసరా, దీపావళి పండుగ సీజన్ ముగిసింది. కరోనా కాలంలో ఆటోమొబైల్ రంగం ఈ పండుగ సీజన్‌లో ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఒడుదొడుకులు మధ్య జరిగాయి. అయితే నవంబర్ 2020లో 16,00,379 ద్విచక్ర వాహనాలను భారత మార్కెట్లో విక్రయించిన ద్విచక్ర వాహన తయారీ సంస్థలు, అదే 2019 నవంబర్‌లో 14,10,939 ద్విచక్ర వాహనాలు అమ్మకాలను నమోదు చేసింది. మొత్తం మీద గతేడాదితో పోలిస్తే ఈ నవంబర్‌లో ద్విచక్ర వాహనాల అమ్మకాలు 13.4 శాతం పెరిగాయి. 

1- హీరో మోటోకార్ప్: హీరో మోటోకార్ప్ సంస్థ నవంబర్ 2020లో 5,75,957 ద్విచక్ర వాహనాలను భారత మార్కెట్లో విక్రయించగా గతఏడాది నవంబర్ 2019లో 5,05,994 యూనిట్లను విక్రయించింది.మొత్తం మీద 13.8 శాతం సేల్స్ పెరిగాయి.2 - హోండా : నవంబర్ 2020లో దేశీయ మార్కెట్లో 4,12,642 యూనిట్లను కొనుగోలు చేశారు. అదే నవంబర్ 2019లో హోండా 3,73,283 యూనిట్లను భారతీయ వినియోగదారులు కొనుగోలు చేశారు. సేల్స్ 10.5 శాతం పెరిగాయి.3- టీవీఎస్ : నవంబర్ 2020లో టీవీఎస్ 2,47,789 ద్విచక్ర వాహనాలను భారతీయ మార్కెట్లో విక్రయించగనవంబర్ 2019లో 1,91,222 యూనిట్లను విక్రయించింది.అంటే అమ్మకాలు 29.6 శాతం పెరిగాయి.
undefined
4- బజాజ్ ఆటో: నవంబర్ 2020లో బజాజ్ ఆటో 1,18,196 ద్విచక్ర వాహనాలను భారత మార్కెట్లో విక్రయించింది.అదే నవంబర్ 2019లో 1,76,337 యూనిట్లను వినియోగదారులు కొనుగోలు చేశారు. మొత్తం అమ్మకాలు 6.7 శాతం పెరిగాయి.5- రాయల్ ఎన్ఫీల్డ్: నవంబర్ 2020లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను 59,084 మంది భారతీయ వినియోగదారులు కొనుగోలు చేయగా నవంబర్ 2019లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌ 58,292 యూనిట్లను వినియోగదారులు కొనుగోలు చేశారు. సేల్స్ 1.4 శాతం పెరిగాయి.
undefined
6- సుజుకి: నవంబర్ 2020లో 57,429 యూనిట్ల సుజుకి బైకులను వినియోగదారులు కొనుగోలు చేశారు. నవంబర్ 2019లో సుజుకి భారత మార్కెట్లో 60,855 యూనిట్లను విక్రయించింది.మొత్తం అమ్మకాలు 5.6 శాతం తగ్గాయి.7- యమహా: నవంబర్ 2020లో యమహా 53,208 యూనిట్లను విక్రయించింది.అదే నవంబర్ 2019లో 39,406 యూనిట్లను వినియోగదారులు కొనుగోలు చేశారు. సేల్స్ మొత్తం35 శాతం పెరిగాయి.
undefined
8- పియాజియో: నవంబర్ 2020లో పియాజియో 5,798 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది నవంబర్ 2019లో 5,026 పియాజియో యూనిట్లు అమ్ముడయ్యాయి. సేల్స్ 15.4 శాతం పెరిగాయి.9 - కవాసకి: నవంబర్ 2020లో కవాసకి 145 యూనిట్లును విక్రయించింది. అదే నవంబర్ 2019లో 244 కవాసకి యూనిట్లు అమ్ముడుపోయాయి. సేల్స్ మొత్తం 40.6 శాతం తగ్గాయి.
undefined
10 - ట్రయంఫ్ : నవంబర్ 2020లో ట్రయంఫ్ 92 యూనిట్లు అమ్ముడుపోయాయి. నవంబర్ 2019లో ట్రయంఫ్ 55 యూనిట్లు మాత్రమే దేశీయ మార్కెట్లో విక్రయించింది.సేల్స్ 67.3 శాతం పెరిగాయి.11- మహీంద్రా అండ్ మహీంద్రా: నవంబర్ 2020లో మహీంద్రా 34 యూనిట్లు విక్రయించింది. నవంబర్ 2019లో మహీంద్రా 1 యూనిట్ మాత్రమే దేశీయ మార్కెట్లో విక్రయించింది.సేల్స్ 300 శాతం పెరిగాయి12- హార్లే డేవిడ్సన్: నవంబర్ 2020లో హార్లే డేవిడ్సన్ 5 యూనిట్లును విక్రయించగా,నవంబర్ 2019లో హార్లే డేవిడ్సన్ 224 యూనిట్లను దేశీయ మార్కెట్లో విక్రయించాయి.అమ్మకాలు 97.8 శాతం తగ్గాయి.
undefined
click me!