కొత్త స్కూటర్ కొనాలని చూస్తున్నారా..? అతి తక్కువ ఈ‌ఎం‌ఐతో ఈ స్కూటర్ మీ సొంతం చేసుకోండీ..

First Published | Jan 22, 2021, 11:23 AM IST

దసరా, దీపావలితో తో పాటు సంక్రాంతి పండగ సందర్భంగా ద్విచక్ర వాహన తయారీ సంస్థలు వాహన కొనుగోలుదారులను ఆకర్షించడానికి రకరకాల ఆఫర్లను ప్రవేశపెట్టాయి. కానీ ఆ సమయంలో  వాహనం కొనుగోలు చేయాలని భావించి కొనలేని వారికోసం ఇప్పుడు మరో అద్భుత అవకాశం టి‌వి‌ఎస్ మోటర్స్ కల్పిస్తుంది. 

మీరు స్కూటర్ కొనాలని భావిస్తుంటే ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అదేంటంటే అతితక్కువ డౌన్ పేమెంట్, ఈ‌ఎం‌ఐ సౌకర్యంతో మీరు టి‌వి‌ఎస్ స్కూటర్ ని ఇంటికి తీసుకేల్లోచ్చు.. అవును నిజమే.. ఇందుకు మీ కోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది.
టీవీఎస్ మోటార్స్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావించే వారి కోసం ఈ ఆఫర్ అందిస్తోంది. అతితక్కువ డౌన్ పేమెంట్ బెనిఫిట్ కూడా ఉన్నాయి. టీవీఎస్ జుపిటర్ స్కూటర్‌ను తక్కువ బడ్జెట్‌లోనే ఇంటికి తీసుకెళ్లొచ్చు.

రూ.10,999 డౌన్ పేమెంట్‌తో ఈ స్కూటర్ కొనుగోలు చేయడంతో పాటు ఆకర్షణీయ ఈఎంఐ ఫైనాన్స్ సదుపాయం కూడా లభిస్తోంది. నెలకు రూ.2,222 ఈఎంఐతో ఈ స్కూటర్ మీ సొంతం చేసుకోవచ్చు.
అయితే ఈ ఆఫర్ వివరాలు ప్రతి షోరూమ్ కి మారుతూ ఉండొచ్చు. అందువల్ల మీరు మీ దగ్గరిలోని టీవీఎస్ షోరూమ్‌కు వెళ్లి ఆఫర్ వివరాలను అడిగి తెలుసుకోవచ్చు. టీవీఎస్ జుపిటర్ స్కూటర్ ఎక్స్‌షోరూమ్ ధర (ఢిల్లీ) రూ.63,497గా ఉంది. ఇది 110 సీసీ ఇంజన్తో వస్తుంది.
టీవీఎస్ జుపిటర్ ఫీచర్స్సింగల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్, టాప్ స్పీడ్ 85కే‌ఎం గంటకు, మైలేజ్ 56 లీటర్, అలయ్ విల్స్, డ్రమ్ బ్రేక్స్, ఎల్‌ఈ‌డి టైల్ లంప్స్, స్పోర్టీ లుక్, ట్యూబ్ లెస్ టైర్స్ ఉన్నాయి.

Latest Videos

click me!