నానో ఎలక్ట్రిక్ సూపర్ కార్.. ఎవరి సహాయం లేకుండా ఈజీగా డ్రైవ్ చెయోచ్చు..

First Published | Mar 27, 2024, 12:31 PM IST

ఈ చిట్టి  ఎలక్ట్రిక్ కారును వికలంకంగుల  వారి కోసం ప్రత్యేకంగా  రూపొందించబడింది. ఈ కారు వీల్ చైర్ కి అంకితమైన వారికీ  సురక్షితమైన ఇంకా  సౌకర్యవంతమైన ప్రయాణం కోసం డిజైన్ చేసారు. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 96 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది. దీని ధర ఇంకా   ఫీచర్ల సమాచారం మీకోసం... 
 

ఎలక్ట్రిక్ కార్లలో నానో కార్లకు డిమాండ్ పెరుగుతోంది.  తక్కువ ధర, నగరంలో సులభంగా ప్రయాణం, ఈజీ  ఛార్జింగ్ వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ నానో కారు ప్రత్యేకంగా శారీరకంగా నడవలేని(physically handicapped ) వారి కోసం రూపొందించారు.
 

ప్రత్యేక మైండ్స్ కోసం ప్రయాణించే సౌకర్యంతో వచ్చిన ఈ నానో ఎలక్ట్రిక్ కారుకు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ఎందుకంటే ఈ కారు వీల్ చైర్ వ్యక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
 

Latest Videos


Zev ఆటోమోటివ్ ఈ కారును అభివృద్ధి చేసింది. వీల్‌చైర్ వినియోగదారుల కోసం జస్ట్  కారు కీని నొక్కితే బ్యాక్ డోర్ తెరుచుకుంటుంది. 
 

బ్యాక్ డోర్ తో పాటు వీల్ చైర్  ఎక్కడానికి  కింద  ఒక బ్రిడ్జ్ మ్యాట్ ఓపెన్ అవుతుంది. దీని సహాయంతో వీల్ చైర్ ద్వారా నేరుగా కారులోకి    ఎక్కవచ్చు.
 

ఈ కారును నడపాలంటే వీల్‌చైర్‌లోంచి దిగాల్సిన అవసరం లేదు. వీల్ చైర్ ని  తప్పనిసరిగా బెల్ట్ ద్వారా సేఫ్ గా లాక్  చేయాలి.  కారు దిగాలనుకున్నప్పుడు మీరు బూట్ బటన్‌ను నొక్కితే, వెనుక బ్రిడ్జ్ మ్యాట్ అండ్  డోర్ ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది.
 

ఈ కారు  స్టీరింగ్ కారు కాదు. దీనికి స్కూటీ లాంటి హ్యాండిల్ ఉంటుంది. స్కూటీ లాగా స్టార్ట్ చేసి డ్రైవ్ చేసే కారు. మీరు సులభంగా కారు ఎక్కి డ్రైవ్ చేయవచ్చు.
 

ముఖ్యంగా వీల్‌చైర్‌లలో ఉన్న మీరు ఎవరి సహాయం లేకుండానే ప్రయాణించవచ్చు. వీల్‌చైర్‌లోంచి దిగాల్సిన అవసరం లేదు, కారు ఎక్కేందుకు కష్టపడాల్సిన అవసరం లేదు. 
 

దీనిని ఫ్రాన్స్‌కు చెందిన జెవ్ కంపెనీ అభివృద్ధి చేసిన కారు. ఫ్రాన్స్‌లో దీని ధర 9,900 US డాలర్లు. అయితే  భారతదేశంలో కొంచెం ఎక్కువ ఖరీదైనది.
 

click me!