ఆఫీస్‌కి త్వరగా వెళ్లేందుకు బెస్ట్ టూ వీలర్.. పెట్రోలు కూడా ఎక్కువ తాగని స్కూటర్లు ఇదిగో..

First Published | Mar 20, 2024, 7:27 PM IST

ఆఫీసులకి టైంకి వెళ్లడం అందులో ట్రాఫిక్ దాటుకుంటు అంటే ఓపికతో కూడుకున్న పనే అని చెప్పాలి. ఆఫీసుకి ఎంత త్వరగా వెళ్లాలనుకున్న  ఒకోసారి టైంకి చేరుకోలేకపోతుంటాం. గేర్ బైక్స్ కన్నా గేర్ లెస్ వాహనాలు అంటే స్కూటర్లు  ట్రాఫిక్ లో చాల అనువైనదిగా ఉంటాయి. 
 

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఈ 5 పెట్రోల్ స్కూటర్‌ల గురించి తెలుసుకోండి, ఎందుకంటే అవి అన్ని వయసుల  వారు పురుషులు ఇంకా మహిళలు కోసం అందుబాటులో ఉన్నాయి.

వీటిలో హీరో డెస్టినీ ప్రైమ్ భారతదేశపు చౌకైన 125సీసీ స్కూటర్. ఈ స్క్యూటర్  రూ.71,499 ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉంది.    లాంగ్  ఫీచర్ లిస్ట్‌లో భాగంగా ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్, USB ఛార్జింగ్ పోర్ట్ ఇంకా  మరిన్ని ఫీచర్స్ అందిస్తుంది.

హోండా డ్యుయో యువతలో మంచి ఆదరణ పొందింది. ఈ స్కూటర్స్   కాలేజీ  పార్కింగ్ లొకేషన్స్ లో ఎక్కువ  సంఖ్యలో కనిపిస్తున్నాయి. తక్కువ ధరలో నాణ్యమైన స్కూటర్ కోసం చూస్తున్న వారు ఈ స్కూటర్ ఎంచుకోవచ్చు.


హీరో నుండి మరో బడ్జెట్-ఫ్రెండ్లీ స్కూటర్ 110cc ఇంజిన్‌తో వస్తున్న ప్లెజర్ ప్లస్. ప్లెజర్+   బేస్ వేరియంట్ రూ. 70,338 నుండి ప్రారంభమవుతుంది, అయితే టాప్-ఎండ్ Xtec వేరియంట్ ధర రూ. 82,238.   LED హెడ్‌ల్యాంప్ అండ్ జియో-ఫెన్సింగ్ అలాగే  లొకేషన్ ట్రాకింగ్ వంటి ఫీచర్లతో వస్తుంది.

హీరో జూమ్ 110.9సీసీ ఇంజన్‌  పొందుతుంది.  స్పోర్టి స్టైలింగ్ ఇంకా  గొప్ప ఫీచర్ల లిస్ట్  తో  వస్తుంది. వీటిలో ప్రత్యేకమైన కార్నరింగ్ లైట్లు, బ్లూటూత్ కనెక్టివిటీ,  టాప్ వేరియంట్ కోసం డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వీటి ధరలు రూ.70,184 నుంచి రూ.78,517 వరకు ఉన్నాయి.

TVS స్కూటీ పెప్ భారతదేశంలో అత్యంత బడ్జెట్  స్కూటర్. ప్రస్తుతం దేశంలో అమ్మకానికి  అందుబాటులో ఉన్న ఏకైక సబ్-100సీసీ స్కూటర్ ఇదే. 87.8 cc ఇంజన్ స్కూటీ పెప్‌లో అందించారు. పవర్ మిల్ 5.4 PS ఇంకా  6.5 Nm లను విడుదల చేయగలదు.
 

పైన పేర్కొన్న స్కూటర్ల లిస్ట్ కాకుండా హోండా యాక్టివా, సుజుకి యాక్సెస్ ఇంకా TVS జూపిటర్ స్కూటర్లు  కూడా మంచి ధరలతో వస్తున్నాయి. యాక్టివా ధర రూ.76,234 - రూ.82,234, టీవీఎస్ జూపిటర్ ధర రూ.73,340 నుండి, సుజుకి యాక్సెస్ ధర రూ. 80,000 ధర ట్యాగ్‌తో  ఉన్నాయి. 
 

Latest Videos

click me!