దబంగ్ గర్ల్ సోనాక్షికి లగ్జరీ కారును గిఫ్ట్ ఇచ్చిన జహీర్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

First Published | Jul 2, 2024, 10:03 AM IST

ముంబై: బాలీవుడ్ దబంగ్ గర్ల్ సోనాక్షి సిన్హా (sonakshi sinha) ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ని తాజాగా వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వీరిద్దరి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే జహీర్ ఇక్బాల్ తన భార్య సోనాక్షి సిన్హాకు రూ.2 కోట్ల విలువైన కారును గిఫ్ట్ గా ఇచ్చారు. అదే  BMW EV i7 కారు. దీనిని సోనాక్షి, జహీర్ కూడా స్వయంగా నడిపారు. 
 

Sonakshi and Zahir come to the hospital

బ్యాటరీతో నడిచే ఈ  ఐ7 సెడాన్ కార్ ప్రారంభ ధర రూ.2.3 కోట్లతో మొదలవుతుంది. ఈ కారు కంపెనీకి చెందిన టాప్ మోడల్. ఇంకా దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.2.50 కోట్ల వరకు ఉంటుంది. అయితే, జహీర్ ఇక్బాల్ తన భార్య సోనాక్షి సిన్హాకు ఏ మోడల్ కారు ఇచ్చాడు అనేదానిపై ఖచ్చితమైన సమాచారం లేదు. కానీ, ఈ జంట కొత్త కారులో కూర్చుని తిరుగుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. 

స్టైల్ అండ్ డిజైన్
కారు లోపల, బయట చాలా ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు లోపలి భాగాన్ని కార్ లవర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఆకర్షణీయంగా రూపొందించిన ఈ కారు ముందు భాగంలో పెద్ద గ్రిల్ ఉంది. LED హెడ్‌లైట్‌, DRL సెటప్‌ కూడా ఉంది. 


ఈ BMW కారు బ్లూ & వైట్ కలర్లలో మార్కెట్లో లభ్యమవుతోంది. ఇందులో ఇంటర్నల్  కంబషన్ ఇంజిన్ (ICE) ఉంది. G70 జనరేషన్ 7 సిరీస్ మోడల్ కార్లు ప్రస్తుతం సేల్‌లో ఉన్నాయి. ఈ కారు 740 xDrive60, M70 xDrive అనే రెండు మోడళ్లలో లభిస్తుంది. గతంలో 536 బిహెచ్‌పి పవర్, 745 ఎన్ఎమ్ టార్క్ ఉండేది. 

ఇప్పుడు 641 bhp, 1015Nm గరిష్ట టార్క్‌ ఇస్తుంది. రెండు మోడల్స్‌లో ఒకటి 625 కి.మీ. ఇంకా  560 కి.మీ. రేంజ్ అందిస్తాయి. ఇంకా 4.7 సెకన్లలో 0 నుండి 100 kmph స్పీడ్ అందుకోగలదు. M ట్రిమ్ 3.7 సెకన్లలో 100 స్పీడ్  అందుకోలేదు.

Latest Videos

click me!