అద్భుతమైన ఫీచర్లు.. మంచి మైలేజీ.. ఇండియాలో టాప్ 5 ఎస్‌యూవీ కార్స్ ఇవే..

First Published Jun 21, 2024, 6:23 PM IST

ప్రత్యేకమైన ఫీచర్లతో పాటు అద్భుతమైన పర్ఫార్మెన్స్, సేఫ్టీలో టాప్ ఉండే ఫ్యామిలీ SUV కార్ కోసం చూస్తున్నారా..? అయితే ఈ  వార్త మీకోసమే. స్పోర్టీ లుక్స్, పవర్ ఫుల్ ఇంజన్, ఎన్నో సేఫ్టీ ఫీచర్లతో అందుబాటులో ఉన్న 5 కార్ల లిస్ట్ ఇదిగో....
 

టాటా హారియర్

టాటా హారియర్‌ను రూ. 15.49 లక్షల ప్రారంభ ధర నుండి కోనవచ్చు. ఈ టాటా SUV గ్లోబల్ NCAPలో 5-స్టార్ రేటింగ్ పొందింది. ఈ మిడ్-సైజ్ SUV 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్‌తో వస్తుంది. హారియర్ పాత  జనరేషన్ క్రియోటెక్ 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌, 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అప్షన్స్ లో లభిస్తుంది.  

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ అండ్  స్కోడా ఆక్టావియా

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ప్రారంభ ధర రూ. 11.70 లక్షలు ఇంకా  స్కోడా కుషాక్ ప్రారంభ ధర రూ. 10.89 లక్షలు. ఈ SUVలు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, మల్టీ-కొలిజన్ బ్రేక్స్  వంటి సేఫ్టీ  ఫీచర్స్ పొందుతాయి. అలాగే  రెండు ఇంజన్ అప్షన్స్  లో లభిస్తాయి. ఇందులోని పవర్ ఫుల్ 1.5-లీటర్ TSI ఇంజన్ 148 bhp, 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టైగన్ అండ్ కుషాక్ గ్లోబల్ NCAP నుండి 5-స్టార్ రేటింగ్ పొందింది.

Latest Videos


హ్యుందాయ్ క్రెటా N లైన్

హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ ప్రారంభ ధర రూ. 16.82 లక్షలు. ఈ మిడ్-సైజ్SUVకి ఎన్నో కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లు ఇచ్చారు.  దీని  సస్పెన్షన్ & స్టీరింగ్‌లో చిన్న మార్పులను చేసింది అలాగే  ఎక్స్టీరియర్  అండ్  లోపలి భాగంలో కూడా  మార్పులు చేసింది. క్రెటా ఎన్ లైన్ కొత్త 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ గేర్ ట్రాన్స్‌మిషన్‌తో  ఈ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో వచ్చిన ఏకైక క్రెటా N లైన్. క్రెటా N లైన్‌లో హ్యుందాయ్ స్మార్ట్‌సెన్స్-లెవల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్-అసిస్టెన్స్ సిస్టమ్ (ATAS) అమర్చారు.  
 

టాటా నెక్సాన్

టాటా నెక్సాన్  ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 8 లక్షలు. ఈ SUV గ్లోబల్ NCAPలో 5-స్టార్ రేటింగ్‌ను పొందింది. 2023 టాటా నెక్సాన్ 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ అలాగే  1.5-లీటర్ డీజిల్ యూనిట్‌తో అందిస్తున్నారు, రెండింటి మధ్య గేర్ ట్రాన్స్‌మిషన్ అప్షన్స్  ఉన్నాయి. ఈ SUV 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, హిల్-అసిస్ట్, 360-డిగ్రీ కెమెరాతో స్టాండర్డ్ గా వస్తుంది.

click me!