ఒక్కసారి ఛార్జ్ చేస్తే 280 కి.మీ ప్రయాణించవచ్చు.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని లక్ష కంటే తక్కువకే కొనొచ్చు..

First Published Oct 25, 2023, 9:38 PM IST

Ola, TVS Motor అండ్ Aether Energy వంటి కంపెనీలు మంచి  అమ్మకాల వృద్ధిని సాధించడంతో ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాలు పెరుగుతున్నాయి.2023లో ఇప్పటివరకు 6.6 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. రివోట్ మోటార్స్‌ను గతంలో సాఫ్ట్‌వేర్ పరిశ్రమలో పనిచేసిన అజిత్ పాటిల్ స్థాపించారు. 
 

2009లో తిరిగి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌ని ప్రవేశపెట్టారు. కానీ దీనికి నిరంతరం మార్పులు అవసరం అయ్యాయి, దింతో  అతనికి స్వయంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని తయారు చేయాలనే ఆలోచన  ఇచ్చింది. "నేను తీసుకొచ్చిన ఇ-స్కూటర్‌లో అనేక సమస్యలు ఉన్నాయి, వాటిని మళ్ళీ మళ్ళీ  సరిదిద్దాల్సి వచ్చింది. నాలుగైదేళ్లుగా  దానిని పక్కకి వదిలేశాను. 2016లో నేను EVల చుట్టూ చాలా బజ్ చూడటం ప్రారంభించాను అని అజిత్ పాటిల్  అన్నారు. 

సుమారు రెండు సంవత్సరాల పరిశోధన తర్వాత, నేను 2018లో కంపెనీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాను అని పాటిల్ చెప్పారు. దాని ఫలితమే ఈ కొత్త స్కూటర్ Rivot NX100. పాత స్కూటర్‌తో తాను ఎదుర్కొన్న సమస్యలే ఈ స్కూటర్‌ను అభివృద్ధి చేయడానికి దోహదపడ్డాయని అతను చెప్పాడు. ఈ స్కూటర్ ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది. బేస్ వేరియంట్ 1,920Wh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది.
 

ఇంకా 100 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇతర వేరియంట్‌లలో ఒకటి 3,840Wh అండ్ మరొకటి 5,760Wh పెద్ద బ్యాటరీ ప్యాక్‌ని  పొందుతాయి. మొదటిది 200 కి.మీ, రెండవది  280 కి.మీ  ప్రయాణిస్తుంది. Ola S1 Pro సెకండ్ జనరేషన్ సర్టిఫైడ్ పరిధి 195 కి.మీ. 3.7 kWh బ్యాటరీ ప్యాక్‌తో Ather 450X సుమారు 150కి.మీల సర్టిఫైడ్ పరిధిని పొందుతుంది. TVS IQube 100-145km పరిధి ప్రయాణిస్తుంది.

NX100 అనేది అప్‌గ్రేడబుల్ రేంజ్ తో మార్కెట్లో మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ లో-వేరియంట్‌లో కస్టమర్లు టాప్ వేరియంట్ స్కూటర్‌ను సెలెక్ట్ చేసుకోకుండా బ్యాటరీ ప్యాక్‌ను అప్‌గ్రేడ్ చేయవచ్చు. NX100 స్కూటర్‌ను ఈ వారంలో లాంచ్  చేశారు. ఆసక్తి గల కస్టమర్లు  రూ.499 టోకెన్ మొత్తంతో స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు.

స్కూటర్ డెలివరీలు 2024 మధ్య నాటికి ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.  బేస్ వేరియంట్ ధర రూ. 89,000 వరకు ఉంటుంది. టాప్ స్పెక్ వేరియంట్ 1.59 లక్షలు ఉండవచ్చు. భారతదేశంలోని 30 నగరాలను కంపెనీ గుర్తించి అక్కడ డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయనుంది.

ఈ స్కూటర్‌ను స్థానికంగా అభివృద్ధి చేస్తామని, బెలగావిలోని ఫెసిలిటీలో తయారు చేస్తామని పాటిల్ చెప్పారు. మొదటి పూర్తి సంవత్సరంలో 10,000 స్కూటర్లను ఉత్పత్తి చేయాలని కంపెనీ భావిస్తోందని ఆయన చెప్పారు.

click me!