నిస్సాన్ హైపర్ పంక్ స్టైలిష్ బాడీ స్టైల్‌తో వస్తుంది. కంటెంట్ క్రియేటర్‌లు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, ఆర్టిస్టులు అండ్ స్టైల్ అలాగే ఇన్నోవేషన్‌ను కోరుకునే వారి కోసం రూపొందించబడిన ఆల్-ఎలక్ట్రిక్ కాంపాక్ట్ క్రాస్‌ఓవర్. వాహన V2X సిస్టమ్ యూజర్లు వీటిని ఎప్పుడైనా, ఎక్కడైనా ఆపరేట్ చేయగలరని ఇంకా ఛార్జ్ చేయగలరని వెల్లడిస్తుంది.
నిస్సాన్ హైపర్ పంక్ కాన్సెప్ట్ డ్యాష్‌బోర్డ్ చుట్టూ డిజిటల్ క్లస్టర్‌తో ఫ్యూచర్ ఇంటీరియర్ ఉంటుంది. ఆన్‌బోర్డ్ కెమెరాలు కారు చుట్టూ ఉన్న దృశ్యాలను క్యాప్చర్ చేయగలవు ఇంకా ఓనర్ ప్రాధాన్యతలను బట్టి దానిని మాంగా-స్టయిల్ దృశ్యాలు లేదా గ్రాఫిక్ ప్యాట్రన్ గా మార్చడానికి AIని ఉపయోగించుకుంటుంది. కాక్‌పిట్‌లో డ్రైవర్ చుట్టూ ఏర్పాటు చేయబడిన మూడు-స్క్రీన్ డిస్‌ప్లేలో ఇమేజరీని ప్రొజెక్ట్ చేయవచ్చు.