ఆటో లాంటి బైక్.. కారు లాంటి ఫీచర్స్.. లాంచ్ చేయనున్న యమహా కంపెనీ..

First Published May 24, 2024, 11:58 PM IST

జపనీస్ కంపెనీ యమహా ఇండియన్  ఆటోమొబైల్ పరిశ్రమను చాలా కాలంగా పరిపాలిస్తోంది. ఈ కంపెనీకి చెందిన బైక్‌లను కొనేందుకు ప్రజలు ఎక్కువ  ఆసక్తి చూపుతుంటారు. ఎందుకంటే కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త మోడళ్ల బైక్‌లను పరిచయం చేస్తూనే ఉంటుంది.
 

ప్రస్తుతం యమహా త్రీవీలర్ మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. యమహా అందించే మొదటి త్రీ-వీలర్‌తో పోల్చితే బుల్లెట్ కూడా చిన్నబోవాల్సిందే. యమహా ట్రైసెరా తొలిసారిగా జపాన్‌లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో విడుదలైంది.
 

ఈ బైక్‌ను డెలివరీ చేయడానికి ముందు ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. డ్రైవింగ్‌లో రైడర్ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని కంపెనీ తెలిపింది. యమహా ట్రైసెరా హైలైట్‌లను పరిశీలిస్తే, ఈ బైక్‌లో రియర్ వీల్ స్టీరింగ్ ఉంది.
 

ఈ సిస్టం బైక్‌ను కారులా నడుపుతుంది. బ్యాక్  వీల్  తిప్పడానికి వీలుంటుందని, దీని వల్ల  మలుపులలో బైక్‌ను సులభంగా తిప్పడానికి సహాయపడుతుందని కూడా నివేదించబడింది. అయితే ఈ బైక్ మరిన్ని వివరాలు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది.
 

click me!