3 సెకన్లలో 100 స్పీడ్‌తో రయ్.. రయ్.. కొత్త బైక్ లాంచ్ చేసిన బిఎండబ్ల్యు..

First Published | May 22, 2024, 5:01 PM IST

కొత్త బిఎండబ్ల్యు ఎస్1000 XR (BMW S 1000 XR) బైక్‌ను త్వరలో ఇండియాలో విడుదల చేయనున్నట్లు BMW కంపెనీ ప్రకటించింది. BMW M 1000 XR బైక్‌ను విడుదల చేసిన కొన్ని రోజుల తర్వాత ఈ ప్రకటన వచ్చింది.
 

కొత్త S 1000 XR ధర రూ. 22.5 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఆసక్తిగల కస్టమర్లు ఈ రోజు నుండి ఆథరైజేడ్  BMW డీలర్ల వద్ద బైక్‌ బుక్ చేసుకోవచ్చు.

BMW S 1000 XR బ్లాక్‌స్టార్మ్ మెటాలిక్, గ్రావిటీ బ్లూ మెటాలిక్ (స్టైల్ స్పోర్ట్స్‌తో) అండ్  వైట్ సాలిడ్ (M ప్యాకేజీతో) అందుబాటులో ఉంటుంది.
 

ఈ బైక్ టూరింగ్ అండ్  డైనమిక్ ప్యాకేజీతో వస్తుంది. రైడర్ మోడ్స్ ప్రో, హీటెడ్ గ్రిప్స్,  హెడ్‌లైట్ ప్రో అడాప్టివ్ టర్నింగ్ లైట్, క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ రైడ్, TPMS, USB ఛార్జర్ ఫీచర్స్ కూడా  ఉన్నాయి.

సైడ్ ప్యానెల్లు ఇంకా ఫ్రంట్ ఫెండర్ మార్చేసింది. ఎక్కువ  ప్లేస్ అందించడానికి సీటు కూడా అప్ డేట్ చేసింది.
 


ఈ బైక్ 168 బిహెచ్‌పి పవర్, 114 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 999 cc, ఇన్‌లైన్-ఫోర్ సిలిండర్ ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ క్విక్-షిఫ్టర్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అందించారు. నాలుగు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి: రెయిన్, రోడ్, డైనమిక్ అండ్  డైనమిక్ ప్రో.

ఈ బైక్ 250 kmph టాప్ స్పీడ్  తో కేవలం 3.25 సెకన్లలో 0-100 kmph  అందుకోగల శక్తి  ఉంది. ముందువైపు 320mm ట్విన్ డిస్క్ బ్రేక్,  వెనుక 220mm సింగిల్ డిస్క్ బ్రేక్ ఉంది.

Latest Videos

click me!