ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల లాంచ్ పై యమాహా ఫోకస్.. 125 సిసి ఇంజన్ తో హైబ్రిడ్ టెక్నాలజీ బైక్స్..

Ashok Kumar   | Asianet News
Published : Jun 21, 2021, 03:43 PM IST

భారతదేశం కోసం ప్రత్యేకంగా ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అభివృద్ధి చేసేందుకు యమహా ఇండియా  కృషి చేస్తోంది. ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని భారత మార్కెట్‌తో పాటు ఇతర ప్రపంచ మార్కెట్లను  లక్ష్యంగా చేసుకొని తీసుకురాబోతున్నారు. 

PREV
14
ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల లాంచ్ పై యమాహా ఫోకస్.. 125 సిసి ఇంజన్ తో హైబ్రిడ్ టెక్నాలజీ బైక్స్..

యమహా త్వరలో విడుదల చేయనున్న 125 సిసి స్కూటర్లు, యమహా ఫాసినో 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్, రే-జెడ్ఆర్ హైబ్రిడ్ వాటిలో హైబ్రిడ్ టెక్నాలజీని అందించాయి.
 
24

యమహా ఇండియా మోటార్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ, "ఫాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్ యమహా ఈ‌విలోకి ప్రవేశించే మొదటి అడుగు. విద్యుత్ శక్తి సహాయంతో ఫేసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో మేము సాధించిన అనేక సాంకేతిక పురోగతులలో ఒకటి. కాబట్టి, మా బృందం ఇప్పటికే భారతదేశం, ఇతర ప్రపంచ మార్కెట్ల కోసం సరికొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన వేదికపై పనిచేస్తోంది. తైవాన్‌లో గత రెండేళ్లుగా యమహా ఈవీలను విక్రయిస్తోంది. "

34

"అయితే ఈ‌వి రంగానికి ధర, పనితీరు వంటి అనేక అంశాలు ముఖ్యమైనవి, కానీ చాలా ముఖ్యమైనది ఏంటంటే మౌలిక సదుపాయాలు. ఇందులో ఛార్జింగ్ సౌకర్యం, బ్యాటరీ ఉత్పత్తి, బ్యాటరీ మార్పిడి సౌకర్యలు ఉన్నాయి. ఈ సమయంలో వాటిని సరిగ్గా పరిష్కరించకపోతే, కస్టమర్‌కు మంచి అనుభవం ఇవ్వలేము. కాబట్టి మేము భారత ప్రభుత్వం నుండి ఈ‌వి పాలసీ కోసం స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను చూస్తున్నాము, తరువాత ఖచ్చితంగా మేము భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలని ప్రవేశపెడతాము, ”అని అన్నారు.

44

టోక్యో మోటార్ షోలో యమహా ఈ‌ 01 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించింది. యమహా ఈ‌సి-05 ఎలక్ట్రిక్ స్కూటర్ తైవాన్‌లోని గొగోరోతో యమహా సహకారంతో తీసుకొచ్చింది. యమహా ఇసి -05లో  సులభంగా రీ-ఛార్జింగ్ కోసం తొలగించగల బ్యాటరీలు ఇచ్చారు. 90 కిలోమీటర్ల టాప్  స్పీడ్ తో 100 కిలోమీటర్ల పరిధి ప్రయాణించగలదు. ఎలక్ట్రిక్ వాహనాలు కచ్చితంగా భవిష్యత్తుగా కనిపిస్తాయి, యమహాకు ఇప్పటికే ఎలక్ట్రిక్ టెక్నాలజీలో బాగా ప్రావీణ్యం ఉంది.

click me!

Recommended Stories