డ్రైవింగ్ చేసి చేసి అలసిపోతున్నారా.. అయితే ఒత్తిడి లేని డ్రైవింగ్ కోసం కొన్ని చిట్కాలు మీకోసం..

First Published Jun 21, 2021, 3:07 PM IST

కార్ డ్రైవింగ్ చేయటాన్ని ఆనందించే వారు ఉంటారు అలాగే కొందరు ఆనందించని వారు కూడా ఉంటారు. భారతదేశం వంటి దేశంలోని ప్రముఖ మెట్రో  నగరాలలో ట్రాఫిక్ గందరగోళం, ట్రాఫిక్ నియమాలు ఇంకా నిబంధనల గురించి గౌరవం లేని వారు, కొన్ని కొని చోట్ల పాడైన రోడ్లు ఇంకా అనేక సందర్భాల్లో కారు నడపడం చాలా  కష్టమైన అనుభవం. 

ఏదేమైనా డ్రైవింగ్ ఒకోసారి మిమ్మల్ని ఒత్తిడికి గురిచేయవచ్చు అయితే అలాంటి సందర్భాల్లో మిమ్మల్ని మీరు ఒత్తిడికి గురుకాకుండా కూల్ కావొచ్చు. ప్రపంచ యోగా దినోత్సవం 2021న డ్రైవింగ్ సామ్యంలో ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు మీకోసం. దీని ద్వారా మీ శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది.
undefined
మీరు ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు కొంచెం స్ట్రెచింగ్ ఎక్ష్సర్సైజ్ ప్రయత్నించవచ్చు. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే లేదా రెడ్ లైట్ ఎక్కువసేపు ఉంటే మీరు కారు నుండి బయటకి దిగి మీ చేతులు, కాళ్ళను స్ట్రెచింగ్ చేయవచ్చు. ఒకవేళ ఇలా సాధ్యం కాకపోతే మీరు మీ చేతులను స్టీరింగ్ వీల్స్ మీద ఉంచి శ్వాస తీసుకునేటప్పుడు మీ వెన్నెముకను స్ట్రెచ్ చేయండి.
undefined
లాంగ్ టూర్ బయలుదేరే ముందు లేదా కొంత సమయం విశ్రాంతి తీసుకోవడానికి ఆగినప్పుడు మీరు చేయవలసిన వ్యాయామం మేడిటేషన్. ధ్యానం మిమ్మల్ని శాంతింపచేయడానికి సహాయపడుతుంది ఇంకా మీ దృష్టిని మెరుగుపరుస్తుంది.
undefined
ఒకే విధంగా ఎక్కువసేపు కూర్చోవడం అలసిపోయినట్టు చేస్తుంది, ముఖ్యంగా మెట్రో నగరాల్లో కొన్ని సార్లు ట్రాఫిక్ తలనొప్పి తెస్తుంది. దీనికి ఉత్తమ మార్గం ఏమిటంటే మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవడం. మీరు రెడ్ సిగ్నల్ వద్ద ఆగినప్పుడు మీ భుజం వైపు చూస్తూ దీర్ఘ శ్వాస తీసుకోండి తరువాత మరొక భుజం వైపు అలానే చేయండి చేయండి. మీరు చాలా ఒత్తిడికి గురవుతున్నట్లయితే పుల్ఓవర్ చేయడం మంచిది. అంతేకాదు మంచి రక్త ప్రసరణ, ఆక్సిజన్ ప్రవాహానికి సహాయపడే అనులోమ్ విలోమ్ చేయడం ప్రయత్నించండి.
undefined
ఇది బహుశా కారు లోపల చేయగలిగే సులభమైన వ్యాయామం. మీరు మీ రెండు చేతులను స్టీరింగ్ వీల్‌పై ఉంచి, మీ భుజాలను మొదట గుండ్రంగా తిప్పండి తరువాత రివర్స్ లో తిప్పాలి. ఇది రక్త ప్రసరణను పెంచడంతో పాటు మీ భుజాలు, మోచేతులను రిలాక్స్ చేయడంలో సహాయపడుతుంది.
undefined
మీరు ఎక్కువసేపు ముఖ్యంగా ట్రాఫిక్‌లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీ పై శరీరం అలసిపోతుంది. అలాంటి సందర్భాల్లో చేయవలసిన పని ఏమిటంటే మే శరీరాన్ని ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయడం. మీరు మీ ఎడమ చేతిని కుడి వైపుకు చాచి, మీ కుడి చేతితో లాక్ చేయాలి. తరువాత ఇంకో వైపు అలనే చేయాలి. మీ చేతులను రిలాక్స్ చేయడం మాత్రమే కాకుండా, మొత్తం శరీరానికి కూడా సహాయపడుతుంది.
undefined
click me!