అల్ న్యూ మారుతి సుజుకి కొత్త జనరేషన్ ఆల్టో 800.. ఈ కొత్త ఫీచర్లతో సిఎన్‌జి ఆప్షన్ కూడా..

First Published | Jun 19, 2021, 11:14 AM IST

దేశంలోని అతిపెద్ద వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి ఒక సరికొత్త మోడల్‌ తీసురబోతుంది. అయితే దీనిని ప్రస్తుత మారుతి సుజుకి ఆల్టో లైనప్ తో  భర్తీ చేయనున్నారు. కొద్దిరోజులుగా ఈ కారును భారతీయ రోడ్లపై పరీక్షిస్తోంది. సంస్థ దీనికి Y0M అనే కోడ్ నేం కూడా చేసింది. 

అయితే కారు టెస్టింగ్ అధునాతన దశలో ఉన్నట్లు తెలుస్తుంది. మారుతి సుజుకి ఈ ఏడాది చివరిలో సరికొత్త ఆల్టోను భారత మార్కెట్లో విడుదల చేయవచ్చు. కాని వచ్చే ఏడాది లాంచ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మీడియా నివేదికల ప్రకారం మారుతి సుజుకి కొత్త మోడల్ లాంచ్ వచ్చే ఏడాదికి వాయిదా వేసింది. అయితే లాంచ్ ఆలస్యంగల కారణాలను కంపెనీ ప్రస్తావించలేదు. ఒక విధంగా లాంచ్ ఆలస్యం ప్రధాన కారణం ఈ సంవత్సరం విస్తృతంగా వ్యాపిస్తున్న కోవిడ్-19 కేసులు కావొచ్చు. కోవిడ్-19 సెకండ్ వేవ్ కారణంగా భారతదేశం అంతటా అనేక రాష్ట్రాలలో, కేంద్రపాలిత ప్రాంతాలలో స్థానిక లాక్ డౌన్, పరిమితులు విధించారు. కరోనా మహమ్మారి కారణంగా మారుతి సుజుకి షెడ్యూల్ చేసిన సమయానికి ముందే ప్లాంట్‌ను మూసివేసింది. ఇతర తయారీ సంస్థలు కూడా ఉత్పత్తి కర్మాగారాలను మూసివేయవలసి వచ్చింది.

సరికొత్త మారుతి సుజుకి 800మారుతి సుజుకి సరికొత్త 800ని హార్ట్ టెక్ట్ ప్లాట్‌ఫామ్ పై నిర్మించారు. ప్రస్తుతం మారుతి సుజుకి చాలా నమూనాలు ఈ ప్లాట్‌ఫామ్ పైనే ఆధారపడి ఉన్నాయి. అయితే మారుతి సుజుకి రాబోయే మోడల్ గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కానీ కారు కొత్త మోడల్ ఫోటోలు ప్రస్తుత వెర్షన్ లాగానే ఉండనున్నట్లు చూపిస్తుంది. కానీ సైజ్ లో కాస్త పెద్దగా ఉంటుంది.
లుక్ అండ్ డిజైన్త్వరలో లాంచ్ కానున్న కారు గురించి ఎక్కువ సమాచారం అందుబాటులో లేనప్పటికీ కొత్త ఆల్టోకు కొత్త జనరేషన్ డిజైన్ లభిస్తుందని భావిస్తున్నారు. దీనితో వాహనం ముందు, వెనుక భాగంలో కొత్త హెడ్‌ల్యాంప్‌లు, కొత్త బంపర్లు, కొత్త టెయిల్ లాంప్‌లతో పూర్తిగా కొత్త షేప్ పొందుతుంది.
కొత్త ఫీచర్లుకొత్త కారు క్యాబిన్ అండ్ ఇంటీరియర్ కూడా ప్రస్తుత మోడల్‌కు భిన్నంగా ఉంటుందని భావిస్తున్నారు. కొత్త ఆల్టోలో కొత్త వాగన్ఆర్ నుండి ప్రేరణ పొందిన డిజైన్‌ను చూడవచ్చు. ఫీచర్స్ గురించి మాట్లాడితే పాత మోడల్ ఫీచర్స్ ఉంటాయి. కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అండ్ డిజిటల్ ఎంఐడితో రిడిజైన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్స్ ఆశించవచ్చు.
సిఎన్‌జి ఆప్షన్ కొత్త మారుతి సుజుకి 800 పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే లభిస్తుంది. ప్రస్తుత జనరేషన్ ఆల్టోకు 796 సిసి, మూడు సిలిండర్ల ఇంజన్ అందించారు. ఈ ఇంజన్ గరిష్ట శక్తిని 47 బిహెచ్‌పి అండ్ పీక్ టార్క్ 69 ఎన్‌ఎమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఐదు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ను గేర్ పొందుతుంది. రాబోయే ఆల్టోను సంస్థ ఎస్-సిఎన్‌జి ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌తో అందించే అవకాశం కూడా ఉంది. గేర్‌బాక్స్‌లో మాన్యువల్ అండ్ ఎఎమ్‌టి ఆప్షన్ అందించనున్నరు.

Latest Videos

click me!