యమహా మోటార్స్ తమ ప్రీమియం 'గ్రాండ్ ఫిలానో 125cc హైబ్రిడ్' స్కూటర్‌ను ఇంటర్నేషనల్ మార్కెట్లో లాంచ్ చేసింది. కొత్త కలర్స్, లగ్జరీ ఫీచర్లతో ఈ స్కూటర్ అదరగొడుతోంది.
యమహా మోటార్ కంపెనీ తమ వరల్డ్ క్లాస్ ప్రీమియం 125cc హైబ్రిడ్ స్కూటర్ 'యమహా గ్రాండ్ ఫిలానో హైబ్రిడ్' ను ఇంటర్నేషనల్ మార్కెట్లో అఫీషియల్‌గా లాంచ్ చేసింది. కొత్త కలర్స్, అదిరిపోయే లగ్జరీ ఫీచర్లతో దీన్ని తీసుకొచ్చింది. వియత్నాం, థాయ్‌లాండ్ మార్కెట్లలో హోండా ఎస్‌హెచ్ మోడ్ (Honda SH Mode) స్కూటర్‌కు ఇది గట్టి పోటీ ఇస్తోంది. వియత్నాంలో దీని ప్రారంభ ధర సుమారు 50 మిలియన్ విఎన్డి (VND)గా ఉంది.
ఇండియాలో జరిగే ఆటో ఎక్స్‌పోలలో దీన్ని 'యమహా గ్రాండే' (Yamaha Grande) పేరుతో ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు ఈ స్కూటర్ వేరియంట్లు, ధర, ఇంజిన్ ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
24
మోడల్స్, ధరల వివరాలు
యమహా గ్రాండ్ ఫిలానో హైబ్రిడ్ ఏబీఎస్ (ABS) వెర్షన్ : ఈ టాప్ ఎండ్ మోడల్ 'డీప్ నేవీ బ్లూ'తో పాటు మొత్తం ఐదు కలర్స్‌లో దొరుకుతుంది. థాయ్‌లాండ్‌లో దీని ధర 69,200 బాట్ (మన కరెన్సీలో సుమారు రూ.1.66 లక్షలు / 54 మిలియన్ VND).
యమహా గ్రాండ్ ఫిలానో హైబ్రిడ్ స్టాండర్డ్ మోడల్ : ఈ బేస్ వేరియంట్ 'లైట్ పాస్టెల్ బ్లూ', మచ్చా లాటే, అబ్సిడియన్ బ్లాక్ సహా ఐదు రంగుల్లో లభిస్తుంది. థాయ్‌లాండ్‌లో దీని ప్రారంభ ధర 64,700 బాట్ (మన కరెన్సీలో సుమారు రూ.1.55 లక్షలు / 50 మిలియన్ VND).
34
అద్భుతమైన మైలేజ్
ఈ స్కూటర్లో యమహాకు చెందిన పాపులర్ 125cc బ్లూ కోర్ హైబ్రిడ్ ఇంజిన్‌ను అమర్చారు. మనం బండిని స్టార్ట్ చేసి యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు, ఇందులోని ఎలక్ట్రిక్ హైబ్రిడ్ సిస్టమ్ ఇంజిన్‌కు అదనపు పవర్ ఇస్తుంది. దీనివల్ల ట్రాఫిక్‌లో ఎలాంటి సౌండ్ లేకుండా బండి చాలా స్మూత్‌గా, వేగంగా దూసుకెళ్తుంది. ఇంజిన్ వేడిని వెంటనే తగ్గించి, బండి లైఫ్ పెంచేందుకు ఇందులో ప్రత్యేకమైన 'డయాసిల్' (DiASiL) టెక్నాలజీని వాడారు.
హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల ఈ ఫిలానో స్కూటర్ లీటర్ పెట్రోల్‌కు ఏకంగా 62.5 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీంతో కస్టమర్లకు చాలా డబ్బు ఆదా అవుతుంది.
సిగ్నల్స్ దగ్గర బండి ఆపినప్పుడు పెట్రోల్ ఆదా చేసేందుకు 'స్టాప్ అండ్ స్టార్ట్' సిస్టమ్ ఇందులో ఉంది. అలాగే సింగిల్ ప్రెస్‌తో బండిని స్టార్ట్ చేసే 'వన్ పుష్ స్టార్ట్' ఫీచర్‌ను కూడా స్టాండర్డ్‌గా అందించారు. ఇలా అద్భుతమైన ఫీచర్లు కలిగిన యమహా ఫిలానో 125cc హైబ్రిడ్ విదేశాల్లో అందుబాటులో ఉంది… మనదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందో చూడాలి.