Toyota Car Offers: టయోటా కార్లపై పండగ ధమాకా...రూ.13.38 లక్షల వరకు మెగా ఆఫర్!

Published : Oct 14, 2026, 08:43 AM IST

Toyota Car Offers: ఈ విజయదశమికి బడ్జెట్ లో కొత్తకారు కొనాలనుకునేవారికి ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ లో ఎంపిక చేసిన కార్లపై భారీ డిస్కౌంట్లు, ఇతర బెనిఫిట్స్ అందిస్తోంది. గ్లాంజా మొదలుకొని క్యామ్రీ వరకు ఏ మోడల్ పై ఎంత ఆదా చేసుకోవచ్చో తెలుసుకుందాం.

PREV
15
టయోటా కార్లపై భారీ ఆఫర్లు

ఈ విజయదశమికి బడ్జెట్ లో కొత్తకారు కొనాలనుకునేవారికి ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 2026లో టయోటా కారు కొనాలనుకునే వారికి కంపెనీ అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. గ్లాంజా, అర్బన్ క్రూయిజర్ టైజర్, హైరైడర్, రుమియాన్, హైలక్స్, క్యామ్రీ, ఫార్చ్యూనర్, లెజెండర్, ల్యాండ్ క్రూయిజర్ 300 వంటి మోడళ్లపై రకరకాల డిస్కౌంట్లు ఇస్తోంది.

కారు మోడల్, తయారైన సంవత్సరం, వేరియంట్, కస్టమర్ అర్హత, పాత కారు ఎక్స్ఛేంజ్, లోన్ ద్వారా కొనుగోలు చేయడం వంటి వాటి ఆధారంగా ఈ లాభాలు మారుతాయి. ఈ నెలలో ల్యాండ్ క్రూయిజర్ 300 కారు 2025 మోడల్ ఇయర్ స్టాక్‌పై గరిష్ఠంగా రూ.13,37,980 వరకు ఆఫర్లు ఇస్తున్నారు. అలాగే క్యామ్రీ కారులోని కొన్ని ఎడిషన్లపై రూ.3.27 లక్షల వరకు, హైరైడర్ కారుపై రూ.1.25 లక్షల వరకు మొత్తం బెనిఫిట్స్ పొందొచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే..ప్రకటించిన మొత్తం ఆఫర్‌లో కేవలం క్యాష్ డిస్కౌంట్ మాత్రమే కాదు, లోన్ ఆఫర్, పాత కారు ఎక్స్ఛేంజ్ బోనస్, అదనపు వారంటీ ప్యాకేజీలు, యాక్సెసరీల విలువ కూడా కలిసి ఉండొచ్చు. కాబట్టి ప్రకటనల్లో చూపే గరిష్ఠ మొత్తాన్ని నేరుగా ధర తగ్గింపుగా భావించకూడదు.

25
గ్లాంజా, టైజర్‌పై డిస్కౌంట్లు
తక్కువ బడ్జెట్‌లో కారు వెతుకుతున్న వారికి టయోటా గ్లాంజా, అర్బన్ క్రూయిజర్ టైజర్ ఆఫర్లు బాగా ఉపయోగపడతాయి. గ్లాంజా కారుపై రూ.25,000 క్యాష్ డిస్కౌంట్‌తో పాటు, అర్హత ఉన్న పాత టయోటా కారును ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.40,000 వరకు ఆఫర్ పొందొచ్చు. ఎంపిక చేసిన ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామీణ కస్టమర్లు, టీ-స్పర్శ్ కస్టమర్లకు అదనంగా రూ.5,000 లాభం దక్కే అవకాశం ఉంది. అర్హతలను బట్టి మొత్తం బెనిఫిట్ రూ.70,000 వరకు వెళ్లొచ్చు. టైజర్ కారులోని కొన్ని సాధారణ వేరియంట్లపై రూ.25,000 క్యాష్ బెనిఫిట్, రూ.20,000 వరకు పాత టయోటా కారు ఎక్స్ఛేంజ్ ఆఫర్.. ఇలా మొత్తం రూ.45,000 వరకు పొందొచ్చు. నాన్-టర్బో, సీఎన్‌జీ వేరియంట్లపై రూ.20,000 క్యాష్ బెనిఫిట్, రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కలిపి మొత్తం రూ.40,000 వరకు ఇస్తున్నారు. ఫ్యామిలీ కారు హైరైడర్‌లోని స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ ఉన్న వేరియంట్లపై రూ.25,000 క్యాష్ డిస్కౌంట్, రూ.50,000 వరకు లోన్ ఆఫర్, పాత కారు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ లభిస్తాయి. పాత టయోటా కారును ఇచ్చే వారికి, వేరే కంపెనీ కారును ఇచ్చే వారికి ఇచ్చే ఎక్స్ఛేంజ్ అమౌంట్ మారొచ్చు. కార్పొరేట్ కస్టమర్లకు కూడా ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. ఇవన్నీ కలిపితే హైరైడర్‌పై రూ.1.25 లక్షల వరకు మొత్తం లాభం పొందొచ్చు. నియో-డ్రైవ్, సీఎన్‌జీ వేరియంట్లకు కూడా వేర్వేరు కండిషన్లతో ఆఫర్లు ప్రకటించారు.
35
టయోటా అక్టోబర్ ఆఫర్లు
టయోటా రుమియాన్, హైలక్స్ మోడళ్లపై కూడా ఈ నెలలో ఆఫర్లు ప్రకటించారు. రుమియాన్ నియో-డ్రైవ్ వేరియంట్‌పై రూ.15,000, సీఎన్‌జీ వేరియంట్‌పై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. హైలక్స్ వాహనంపై ఆఫర్లు వేరియంట్‌ను బట్టి మారుతాయి. వీఎక్స్ 4x4 ఆటోమేటిక్ వేరియంట్‌పై రూ.39,000, జీఎక్స్ 4x2 ఆటోమేటిక్ వేరియంట్‌పై రూ.37,000, జీఎక్స్ 4x4 ఆటోమేటిక్ వేరియంట్‌పై రూ.10,700 వరకు బెనిఫిట్స్ ఇస్తున్నారు. వీటిలో అదనపు యాక్సెసరీల ఆఫర్లు కూడా కలిసి ఉంటాయి. మరోవైపు, టయోటా క్యామ్రీ కారు ఎలిగెంట్ ఎడిషన్‌పై రూ.1.75 లక్షల క్యాష్ డిస్కౌంట్ పొందొచ్చు. పాత కారు ఎక్స్ఛేంజ్ ఆఫర్, టీ-సెక్యూర్ ప్రొటెక్షన్ లేదా మెయింటెనెన్స్ ప్యాకేజీ, అదనపు యాక్సెసరీలను కూడా లెక్కలోకి తీసుకుంటే మొత్తం లాభం రూ.3,27,416 వరకు వెళ్లొచ్చు. స్ప్రింట్ ఎడిషన్‌పై రూ.1.25 లక్షల క్యాష్ డిస్కౌంట్ ప్రకటించారు, దీనిపై మొత్తం లాభం రూ.2,77,416 వరకు ఉండొచ్చు. కొన్ని అర్హత ఉన్న కొనుగోలు పద్ధతులకు లోన్ సంబంధిత ఆఫర్లు కూడా ఉన్నాయి. అయితే, అన్ని ఆఫర్లను ఒకేసారి పొందగలమా లేదా అనేది కొనుగోలు చేసే పద్ధతి, ఆయా షోరూమ్‌ల నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, కారు ధర వివరాలతో పాటు ప్రతి ఆఫర్‌ను ఎలా లెక్కిస్తున్నారో రాతపూర్వకంగా తీసుకోవడం మంచిది.
45
టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఆఫర్
ఈ నెలలో అతిపెద్ద ఆఫర్ టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 కారు 2025 మోడల్ ఇయర్ స్టాక్‌పై ఇస్తున్నారు. దీనిపై మొత్తం లాభం రూ.13,37,980 వరకు ఉండొచ్చు. ఇందులో రూ.7 లక్షల క్యాష్ డిస్కౌంట్, రూ.7.30 లక్షల వరకు లోన్ ఆఫర్, పాత టయోటా కారును ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.50,000 లాభం, రూ.5,37,980 విలువైన టీ-సెక్యూర్ ప్యాకేజీ, రూ.50,000 విలువైన అదనపు యాక్సెసరీలు లేదా ఎక్స్‌టీరియర్ డెకరేషన్ ప్యాకేజీ వంటివి ఉన్నాయి. అయితే, ఇవన్నీ కలిపితే వచ్చే మొత్తమే ఈ గరిష్ట లాభం. ముఖ్యంగా, లోన్ ఆఫర్ అంటే నేరుగా చేతికి వచ్చే డబ్బు కాదు; మొత్తం డబ్బును ఒకేసారి చెల్లించే వారికి ఇదే లాభం వస్తుందని అనుకోకూడదు. అంతేకాకుండా, ఈ ఆఫర్ కేవలం 2025 మోడల్ ఇయర్ స్టాక్‌కు మాత్రమే వర్తిస్తుంది కాబట్టి, తయారైన సంవత్సరం, వాహన స్టాక్‌ను చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఫార్చ్యూనర్ నియో-డ్రైవ్ మోడల్‌పై రూ.59,000 వరకు, లెజెండర్ నియో-డ్రైవ్ మోడల్‌పై రూ.47,000 వరకు లాభాలు ఇస్తున్నారు. ఈ ఆఫర్లు కూడా వేరియంట్, ఆఫర్ స్కీమ్‌ను బట్టి మారొచ్చు.
55
టయోటా హైరైడర్ డిస్కౌంట్

టయోటా అక్టోబర్ నెల ఆఫర్లు చిన్న కారు కొనేవారి నుంచి ఖరీదైన లగ్జరీ కారు కొనేవారి వరకు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. గ్లాంజాపై రూ.70,000, టైజర్‌పై రూ.45,000, హైరైడర్‌పై రూ.1.25 లక్షలు, క్యామ్రీపై రూ.3.27 లక్షలు, ల్యాండ్ క్రూయిజర్ 300 కారుపై రూ.13.38 లక్షల వరకు మొత్తం లాభాలు ఇస్తున్నారు. అయితే, ఈ ఆఫర్లన్నీ నేరుగా ఇచ్చే క్యాష్ డిస్కౌంట్లు కావనే విషయాన్ని కొనుగోలుదారులు గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా, స్టేట్, నగరం, షోరూమ్, వాహన స్టాక్, వేరియంట్, లోన్ సదుపాయం, పాత కారు ఎక్స్ఛేంజ్ నిబంధనల ఆధారంగా ఫైనల్ ఆఫర్ మారొచ్చు. కారు కొనాలని నిర్ణయించుకునే ముందు దగ్గర్లోని ఆథరైజ్డ్ టయోటా షోరూమ్‌లో ధరల పట్టిక, క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్, ఇతర లాభాలను విడివిడిగా అడిగి తెలుసుకోండి. అడ్వాన్స్ చెల్లించే ముందు, మీ కారుకు నిజంగా ఏయే ఆఫర్లు వస్తాయి, వాటన్నింటినీ ఒకేసారి పొందగలరా లేదా అనే విషయాలను రాతపూర్వకంగా చెక్ చేసుకోవడం ఉత్తమం.

Read more Photos on
click me!

Recommended Stories