బైక్ కొనేవారికి గుడ్ న్యూస్.. భారీగా యమహా బైక్స్ ధరల తగ్గింపు..

First Published | Jun 2, 2021, 11:21 AM IST

న్యూ ఢీల్లీ: ద్విచక్ర వాహనా సంస్థ యమహా మోటార్ ఇండియా మంగళవారం యమాహా ఎఫ్‌జెడ్ఎస్ 25, ఎఫ్‌జెడ్ 25 బైక్‌ల ఎక్స్‌షోరూమ్ ధరలను తగ్గింస్తునట్లు ప్రకటించింది. యమహా  ఎఫ్‌జెడ్ఎస్ 25పై రూ.19,300, ఎఫ్‌జెడ్ 25 పై రూ.18,800  తగ్గించినట్లు తెలిపింది (ఎక్స్-షోరూమ్ ఢీల్లీ).
 

ఇప్పుడు తగ్గింపు ధరతో యమహా ఎఫ్‌జెడ్ఎస్ 25 ధర రూ.1,39,300, ఎఫ్‌జెడ్ 25 ధర రూ.1,34,800గా నిర్ణయించినట్లు యమహా మోటార్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
వీటి ధరలు గతంలో యమహా ఎఫ్‌జెడ్ఎస్ 25 ధర రూ.1,58,600, ఎఫ్‌జెడ్ 25 ధర రూ.1,53,600గా ఉంది.

"ఈ మధ్యకాలంలో, ఇన్పుట్ ఖర్చులు పెరిగాయి, దీంతో మా ఉత్పత్తుల ఎక్స్-షోరూమ్ ధరల పెరుగుదలకు దారితీసింది, ముఖ్యంగా ఎఫ్‌జెడ్ 25 సిరీస్ లో. మా బృందం చివరకు ఈ ఇన్పుట్ ఖర్చులను తగ్గించగలిగింది. మేము మా వినియోగదారులకు ఈ ప్రయోజనాన్ని అందించాలనుకుంటున్నాము "అని జపనీస్ ద్విచక్ర వాహన సంస్థ తెలిపింది. తగ్గించిన బైక్ ధరలు నేటి నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న అన్నీ షో రూమ్ లకు వర్తిస్తాయని పేర్కొంది. ధ‌ర త‌గ్గించినా బైకులోని ఫీచర్లు, స్పెసిఫికేష‌న్లు అవే ఉంటాయ‌ని స్ప‌ష్టం చేసింది.

Latest Videos

click me!