హాట్ సమ్మర్ లో కూల్ ఆఫర్.. మే 2021లో అత్యధిక డిస్కౌంట్ అందిస్తున్న టాప్ 7 కార్లు ఇవే

First Published | May 24, 2021, 1:30 PM IST

కొత్త  కస్టమర్లను ఆకర్షించెందుకు వాహన తయారీ సంస్థలు సెలెక్టెడ్ మోడళ్లపై  డిస్కౌంట్లను  అందిస్తున్నాయి. మే 2021 కోసం మారుతి సుజుకి, టాటా మోటార్స్, హ్యుందాయ్ ఇండియా, మహీంద్రా, నిస్సాన్ వంటి కార్ల తయారీ సంస్థలు  ఎంపిక చేసిన మోడళ్లపై  రూ.3.01 లక్షల వరకు భారీ ప్రయోజనాలను ప్రకటించాయి.

వీటిలో క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్ ఉన్నాయి. వీటిని మే 31 వరకు పొందవచ్చు. ఈ నెలలో గరిష్ట తగ్గింపుతో లభించే మొదటి ఏడు కార్ల జాబితా మీకోసం..
1. మహీంద్రా అల్టురాస్ జి4 ఎస్‌యూవీమహీంద్రా ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ అల్టురాస్ జి4 అధికారిక వెబ్‌సైట్‌లో గరిష్టంగా రూ.3.01 లక్షల వరకు తగ్గింపుతో జాబితా చేశారు. ఆసక్తిగల కొనుగోలుదారులు అల్టురాస్ జి4 ఎస్‌యూవీని 2.2 లక్షల వరకు క్యాష్ డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు. అంతే కాకుండా 11,500 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఈ నెలలో మహీంద్రా ఎస్‌యూవీపై 20,000 వరకు ఇతర బెనెఫిట్స్ కూడా సంస్థ అందిస్తోంది. ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.28.74 లక్షల నుండి. 31.74 లక్షలు (ఎక్స్‌షోరూమ్) ఉంటుంది.

2. హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్హ్యుందాయ్ కూడా ఎంపిక చేసిన మోడళ్లపై డిస్కౌంట్లను అందిస్తోంది. వీటిలో సాంట్రో, ఐ 20, ఆరా, గ్రాండ్ ఐ 10 ఉన్నాయి. ఈ కార్లలో కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీపై గరిష్టంగా రూ.1.5 లక్షల తగ్గింపు ఆఫర్ చేస్తుంది. కోన ఈ‌విపై ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ వంటివి అందించట్లేదు. దీని ధర ప్రారంభ ధర రూ.23.77 లక్షలు కాగా, డ్యూయల్ టోన్ మోడల్ ధర.23.96 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢీల్లీ).
3. మహీంద్రా ఎక్స్‌యూవీ 500కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ 500ని భారతదేశంలో త్వరలోనే ప్రవేశపెట్టనుంది. డిస్కౌంట్లను అందించడం ద్వారా ప్రస్తుత స్టాక్లను క్లియర్ చేయడమే సంస్థ లక్ష్యం. ఈ ఎక్స్‌యూవీ 500 కొనుగోలు చేయడానికి ఆసక్తిగల కొనుగోలుదారులు మొత్తం రూ.98,100 తగ్గింపును పొందవచ్చు. ఇందులో 51,600 నగదు ఆఫర్, ఎక్స్ఛేంజ్ బోనస్ 25వేలు, కార్పొరేట్ బోనస్ 6,500 ఉన్నాయి. ఎక్స్‌యూవీ 500 ధర రూ.15.53 లక్షల నుండి ప్రారంభమై రూ. 20.04 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
4. రెనాల్ట్ డస్టర్ (1.3-లీటర్)ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ రెనాల్ట్ డస్టర్ ఎస్‌యూవీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ కారు పై గరిష్టంగా 75,000 వరకు బెనెఫిట్స్ తో జాబితా చేసింది. ఇందులో రూ.30,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు రూ.15,000 వరకు లాయల్టీ ప్రయోజనం కూడా ఉంది. అలాగే ఎస్‌యూవీపై రూ.30,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది. రెగ్యులర్ 1.5-లీటర్ వేరియంట్ పై రూ.45,000 వరకు ప్రత్యేక ప్రయోజనాలతో వస్తుంది.
5. నిస్సాన్ కిక్స్జపనీస్ కార్ల తయారీ సంస్థ నిసాన్ ప్రస్తుతం నిస్సాన్ కిక్స్ ఈ నెలలో ఆకర్షణీయమైన బెనెఫిట్స్ అందిస్తుంది. ఇందులో రూ.20,000 నగదు తగ్గింపు, 50,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, 5,000 వరకు అదనపు తగ్గింపు ఉన్నాయి. భారతదేశంలో నిసాన్ కిక్స్ ధర రూ.9.50 లక్షలు నుండి రూ.14.65 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) వరకు ఉంటుంది. దీనిని మొత్తం నాలుగు ప్రధాన ట్రిమ్లలో ఎనిమిది వేరియంట్లలో లభిస్తుంది.
6. టాటా హారియర్దేశీయ వాహన తయారీ సంస్థ టాటా ఈ నెలలో టాటా హారియర్ ఎస్‌యూవీపై రూ.65,000 వరకు ప్రయోజనాలను అందిస్తుంది. ఈ 5 సీట్ల ఎస్‌యూవీపై 25వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్, 40,000 కార్పొరేట్ ఆఫర్ తో లభిస్తుంది. ఈ ప్రయోజనాలు డార్క్ ఎడిషన్,ఎక్స్‌జెడ్, ఎక్స్‌జెడ్‌ఏపి‌ఎల్‌పి‌ఎ ప్లస్ వేరియంట్‌లకు వర్తించవు. ఈ ఎస్‌యూవీ ధర ప్రస్తుతం రూ. 14.29 లక్షల నుంచి రూ.20.81 లక్షల (ఎక్స్‌షోరూమ్) పరిధిలో ఉంది.
7. రెనాల్ట్ ట్రైబర్రెనాల్ట్ ట్రైబర్ ఎం‌పి‌విపై గరిష్టంగా 55వేల వరకు తగ్గింపుతో లభిస్తుంది. ఇందులో 25వేల వరకు క్యాష్ బెనెఫిట్స్, 20వేల వరకు ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలు, సెలెక్ట్ వేరియంట్ల పై 10,000 వరకు లాయల్టీ ప్రయోజనాలు ఉంటాయి. ఆర్థిక సహాయం కోసం చూస్తున్న కొత్త కొనుగోలుదారులు ట్రైబర్‌పై ప్రత్యేక వడ్డీ రేటును 6.99 శాతం పొందవచ్చు. ప్రస్తుతం, ట్రైబర్ ఎంపివి ధర దేశంలో రూ.5.30 లక్షలు నుండి రూ.7.82 లక్షలు (ఎక్స్-షోరూమ్ ) వరకు ఉంటుంది.

Latest Videos

click me!