జీప్, హ్యుందాయ్ కి పోటీగా వోక్స్‌వ్యాగన్ సరికొత్త ఎస్‌యూ‌వి.. లేటెస్ట్ అప్ డేట్, ధర, ఫీచర్లు తెలుసుకోండి..

First Published | Dec 7, 2021, 6:20 PM IST

వోక్స్‌వ్యాగన్ ఇండియా (volkswagen india) అప్ డెటెడ్ టిగువాన్ (tiguan) ఎస్‌యూ‌వి పరిచయం చేస్తూ ధరను నేడు ప్రకటించింది. కంపెనీకి చెందిన ఔరంగాబాద్ ప్లాంట్‌లో ఈ కొత్త మోడల్ ఉత్పత్తి జరుగుతోంది. కొత్త 2021 వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఫేస్‌లిఫ్ట్ "షార్ప్ డిజైన్, గొప్ప పర్ఫర్మెన్స్ , సేఫ్టీ అండ్ కొత్త ఆసిస్టన్స్ ఫీచర్ల"తో వస్తుందని  తెలిపింది. 

ఈ బ్రాండ్  ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన MQB ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించిన కొత్త 2021 వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఫేస్‌లిఫ్ట్ కొన్ని కాస్మెటిక్ మార్పులు అండ్ ఫీచర్ అప్‌గ్రేడ్‌లను అందుకుంది.

మిడ్-లైఫ్ అప్‌డేట్‌తో డీజిల్ ఇంజన్ ఆప్షన్ ఇప్పుడు ఈ ఎస్‌యూ‌విలో నిలిపివేసింది. అయితే టిగువాన్ ఫేస్‌లిఫ్ట్ అనేది  5-సీటర్ ఎస్‌యూ‌వి అండ్ కంపెనీ ఇండియా 2.0 వ్యూహంలో భాగంగా వస్తోంది. కంపెనీ భారతదేశంలో విడుదల చేయనున్నట్టు ప్రకటించిన నాలుగు ఎస్‌యూ‌విలలో ఈ కార్ ఒకటి. 
 

ఇంజన్ అండ్ పవర్
టిగువాన్ ఫేస్‌లిఫ్ట్ కొత్త 2.0-లీటర్ 4-సిలిండర్ టర్బో-ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 190 PS శక్తిని, 320 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్‌లో ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ కూడా ఇవ్వవచ్చు. ఈ ఎస్‌యూ‌వి  ఎంట్రీ-లెవల్ వేరియంట్ 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో అందించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ 147 బిహెచ్‌పి పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు స్టాండర్డ్ గా 7-స్పీడ్ డి‌ఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను పొందుతుంది. 1.5L పెట్రోల్ ఇంజన్‌తో 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఇవ్వనుంది. 


లుక్ అండ్ డిజైన్
ఈ అప్‌డేట్‌ మోడల్‌కి రీడిజైన్ చేసిన కొత్త ఫ్రంట్ గ్రిల్, ఎల్‌ఈ‌డి హెడ్‌ల్యాంప్స్, కొత్త ఫ్రంట్ బంపర్ వంటి ఫీచర్లు అందించారు. కారు వెనుక భాగంలో వి‌డబల్యూ (VW)బ్యాడ్జింగ్ కింద 'TIGUAN' అని ఉంటుంది. ఎస్‌యూ‌వి పవర్ లిఫ్ట్‌గేట్ కోసం అప్‌డేట్ చేసిన హ్యాండ్స్ ఫ్రీ ఈజీ ఓపెన్ అండ్ క్లోజ్ ఫీచర్‌ను కూడా పొందుతుంది. 

అధునాతన ఫీచర్లు
2021 వోక్స్‌వ్యాగన్ టిగువాన్‌కి చాలా ప్రీమియం ఫీచర్లు అందించారు. దీనికి కొత్త స్టీరింగ్ వీల్ అంతేకాకుండా క్లైమేట్రానిక్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఫంక్షన్‌ల కోసం టచ్ మాడ్యూల్‌తో వస్తుంది అలాగే ఏ‌సి మెనూని ఓపెన్ చేయడానికి ముందు సీట్లను వేడి చేయడం, వెనుక విండో డీఫ్రాస్ట్ అండ్ టచ్ బటన్ వంటి ఫంక్షన్‌లు. ఈ ఎస్‌యూ‌వి కొత్త మాడ్యులర్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది అంటే వాయిస్ కంట్రోల్, మల్టీ-ఫోన్ పెరింగ్,  వైర్‌లెస్ యాప్-కనెక్ట్‌ను అందిస్తుంది. ఇంకా వోక్స్‌వ్యాగన్ డిజిటల్ కాక్‌పిట్ అండ్ 15-కలర్ యాంబియంట్ లైటింగ్ సిస్టమ్‌ను కూడా పొందుతుంది. ఈ ఎస్‌యూ‌వి కనెక్ట్ చేసిన కార్ టెక్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ సిస్టమ్‌ను పొందే అవకాశం ఉంది. 
 

ధర అండ్ పోటీ
అప్‌డేట్ చేసిన టిగువాన్ 2020 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ప్రవేశించింది. ఇప్పుడు ఈ ఎస్‌యూ‌వి కొత్త అప్ డేట్ లతో భారతీయ షోరూమ్‌లలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. కొత్త టిగువాన్‌ ఫేస్‌లిఫ్ట్ అధికారిక ధరలు నేడు వెల్లడయ్యయి. నివేదిక ప్రకారం, కొత్త 2022 వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఫేస్‌లిఫ్ట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 28 లక్షల నుండి రూ. 32 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. భారతదేశంలో లాంచ్ తర్వాత ప్రీమియం ఎస్‌యూ‌వి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ జీప్ కంపాస్ (jeep compass), హ్యుందాయ్ టక్సన్ (hyundai tucson), సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ (citreon C5 ఎయిర్‌క్రాస్) వంటి కార్లతో పోటీపడుతుంది. 

Latest Videos

click me!