హీరో మోటోకార్ప్‌ను బీట్ చేసిన బజాజ్.. ఇండియా టాప్ బైక్ బ్రాండ్‌గా రికార్డు..

First Published | Dec 7, 2021, 3:17 PM IST

ఇండియన్ మల్టీనేషనల్ టు వీలర్ అండ్ త్రీవీలర్ తయారీ సంస్థ  బజాజ్ ఆటోమొబైల్(bajaj automobile) నవంబర్‌లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన బైక్ బ్రాండ్‌గా అవతరించింది. ఇందులో దేశీయ విక్రయాలు, ఎగుమతుల గణాంకాలు రెండూ ఉన్నాయి. 

 పూణెకు చెందిన ప్రముఖ వాహనాల తయారీ సంస్థ గత నెలలో 3,38,473 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. నవంబర్ 2020లో 3,84,993 యూనిట్లను విక్రయించిన  స్వంత అమ్మకాల పర్ఫర్మేన్స్  కంటే 12 శాతం తక్కువ.  

 నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న హీరో మోటోకార్ప్
దేశీయ అండ్ ఎగుమతి గణాంకాలు కలిపి గత నెలలో 3,29,185 బైకులను విక్రయించింది. నవంబర్ 2021లో హీరో మోటోకార్ప్ మొత్తం బైక్ అమ్మకాల్లో 39 శాతం క్షీణతను నమోదు చేసింది. గత ఏడాది   నవంబర్‌ నెలలో కంపెనీ 5,41,437 యూనిట్లను విక్రయించింది.

 అయితే బజాజ్ ఆటో మొత్తం బైక్ విక్రయాలలో హీరో మోటోకార్ప్‌ను ఓడించగలిగిన అరుదైన సందర్భాలలో నవంబర్ 2021 ఒకటి. అయినప్పటికీ  హీరో మోటోకార్ప్ బైక్ అండ్ స్కూటర్ అమ్మకాలతో సహా ద్విచక్ర వాహన విక్రయాల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగింది. బజాజ్ ఆటో దేశీయ అండ్ అంతర్జాతీయ మార్కెట్లలో 3,38,473 యూనిట్లను విక్రయించగా, హీరో మోటోకార్ప్ దేశీయ అండ్ అంతర్జాతీయ మార్కెట్లలో మొత్తం 3,49,393 ద్విచక్ర వాహనాలను విక్రయించింది.


బజాజ్ ఆటో ఎగుమతి గణాంకాలు రెండు శాతం క్షీణతను నమోదు చేసినప్పటికీ బైక్ విక్రయాలలో సగానికి పైగా అంతర్జాతీయ మార్కెట్‌లలో ఉన్నాయి. అంటే విదేశీ మార్కెట్‌లకు 1,93,520 బైకులను రవాణా చేసింది అండ్  దేశీయ మార్కెట్లో 1,44,953 యూనిట్లను విక్రయించింది.

లాటిన్ అమెరికా అండ్ ఆఫ్రికాలోని అంతర్జాతీయ మార్కెట్లలో దేశీయ బైక్ తయారీ సంస్థ అధిక అమ్మకాలను నమోదు చేసింది. బజాజ్ ఆటో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల్లో  కంపెనీ బైకులను విక్రయిస్తోంది. 

 మరోవైపు హీరో మోటోకార్ప్ తక్కువ సిసి బైక్ విభాగంలో ప్రత్యేకతను సంతరించుకుంది. దేశీయ ద్విచక్ర వాహన బ్రాండ్ ప్యాసెంజర్ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తోంది. 
 

కంపెనీకి బలమైన కస్టమర్ బేస్ ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో హీరో మోటోకార్ప్ అమ్మకాలపై ప్రభావం పడింది ఎంట్రీ-లెవల్ కమ్యూటర్ బైక్ సెగ్మెంట్‌లో మందగమనం, హై-లెవెల్  మోడల్‌ల పట్ల వినియోగదారుల ప్రాధాన్యత పెరగడం కూడా హీరో మోటోకార్ప్ అమ్మకాలు క్షీణించడం వెనుక కీలకమైన అంశం.

Latest Videos

click me!