న్యూ ఇయర్ కి కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

First Published Dec 6, 2021, 1:30 PM IST

మీరు న్యూ ఇయర్(new year) సందర్భంగా కొత్త కారు(new car) కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఇందుకు మీరు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 2022 జనవరిలో చాలావరకు   వాహన తయారీ సంస్థలు వాటి మోడల్‌ల ధరల పెంపును ధృవీకరించాయి. కొద్దిరోజుల క్రితం ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతీ(maruti) ఆటోమోబైల్ మార్కెట్లో  మాస్ సెల్లింగ్ మోడల్స్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. 

 మరోవైపు  మెర్సిడెస్ (mercedes), ఆడి (audi) వంటి లగ్జరీ సెగ్మెంట్‌లోని ప్రధాన కంపెనీలు కూడా ఇదే బాటలో ఉన్నాయి.

మారుతీ, ఆడి దేశంలో అందించే అన్ని మోడళ్ల ధరలను పెంచనుంది.  ఒక నివేదిక ప్రకారం మెర్సిడెస్ ఎంపిక చేసిన మోడళ్ల ధరలను మాత్రమే పెంచుతుందని పేర్కొంది. అయితే, సాధారణ విషయం ఏమిటంటే ఈ కంపెనీలన్నీ ధరల పెంపు అవసరమని భావించడానికి ప్రధాన కారణంగా పెరుగుతున్న ఖర్చులు అని పేర్కొన్నాయి. 

ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ, “పెరుగుతున్న ధరలు, నిర్వహణ వ్యయాన్ని భర్తీ చేయడానికి ధరల సవరణ అవసరం. మేము ఎంచుకున్న వాహనాల  కొత్త ధరల శ్రేణి బ్రాండ్  ప్రీమియం ప్రైస్ స్థానాన్ని నిర్ధారిస్తుంది, తద్వారా బ్రాండ్ అండ్ మా డీలర్ భాగస్వాములు రెండింటికీ గొప్ప వాల్యు అందిస్తుంది.  అని అన్నారు.
 

మారుతీ కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ధరలను ఎందుకు పెంచాల్సి వచ్చిందో వివరంగా వివరించింది. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా పేరుగాంచిన  మారుతీ సుజుకి మాట్లాడుతూ, "గత ఒక సంవత్సరంలో వివిధ ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం వల్ల కంపెనీ వాహనాల ధరలు ప్రతికూలంగా ప్రభావితమైంది. అందువల్ల ఈ అదనపు ఖర్చులను క్లియర్ చేయడం కంపెనీకి అత్యవసరంగా మారింది." అని తెలిపారు.

ఈ మూడు కంపెనీల కార్ల ధర పెంపు నిర్ణయం వాటికే పరిమితం కానుందని అంచనా. సెమీకండక్టర్ చిప్‌లలో గ్లోబల్ కొరత సవాలుగా కొనసాగే అవకాశం ఉన్నందున దాదాపు ప్రతి ఒక్క ఆటోమేకర్‌ను సప్లయ్ వైపు సమస్యలు వేధిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఇతర కార్ల తయారీదారులు కూడా ఈ మార్గాన్ని అనుసరించడం ద్వారా  వాహనాలను ఖరీదైనదిగా మార్చవచ్చనే భయం ఉంది. 

కానీ ధరల పెంపు నిర్ణయాలు బహుశా అత్యంత క్లిష్ట సమయంలోనే వచ్చాయి. జనవరి నుంచి త్వరలో పెరగనున్న పెంపు డిసెంబర్ విక్రయాలకు ఊతం ఇవ్వవచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ కోవిడ్-19  ఓమిక్రాన్ వేరియంట్ కారణంగా భారతీయ ఆటోమోటివ్ రంగంలో డిమాండ్ పునరుద్ధరణ సంభావ్య అనిశ్చితి చీకటితో మరోసారి మేఘావృతం కావచ్చు. 
 

వివిధ దేశాలు ఈ కొత్త, మరింత ఇన్ఫెక్షియస్ వేరియంట్‌ను ఎలా ఎదుర్కోవాలి అనేది కారు వీడిభాగాల సరఫరా అండ్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. చిప్ కొరత కారణంగా గతంలో చాలా కంపెనీలు  ఉత్పత్తిని తగ్గించుకోవలసి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ ప్రకటిస్తే వాహన తయారీదారులకు మరో ఎదురుదెబ్బ తప్పదు.

click me!