క్రెటా, కియా సెల్టోస్‌లకు పోటీగా వోక్స్‌వ్యాగన్ సరికొత్త ఎస్‌యూవీ.. దీని స్పెషల్, హై-లెట్ ఫీచర్స్ ఇవే..

First Published | Aug 25, 2021, 3:50 PM IST

 జర్మన్ ఆటోమొబైల్ కంపెనీ వోక్స్‌వ్యాగన్ ఇండియా  కొత్త ఎస్‌యువి కారు వోక్స్‌వ్యాగన్ టైగన్  లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. వోక్స్వ్యాగన్ టైగన్ సెప్టెంబర్ 23న భారతదేశంలో లాంచ్ కానుంది. టైగన్ ఎస్‌యూవీకి సంబంధించిన బుకింగ్‌లను కంపెనీ ఈ నెల ప్రారంభంలో ప్రారంభించింది. 

 ఈ కారు భారతీయ కార్ల మార్కెట్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న కాంపాక్ట్ ఎస్‌యూ‌వి విభాగంలోకి వస్తోంది. ఈ కారు హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టాటా హారియర్, ఎంజి హెక్టర్ ప్లస్ అలాగే ఇటీవల లాంచ్ చేసిన స్కోడా కుషాక్ వంటి ఎస్‌యూవీలతో పోటీపడుతుంది. . 

మహారాష్ట్రలోని పూణే సమీపంలోని చకన్ ప్లాంట్‌లో కంపెనీ టైగున్ ఎస్‌యూవీని తయారు చేస్తున్నారు. వోక్స్వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీ డెలివరీలు ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభమవుతాయి. వోక్స్‌వ్యాగన్ డీలర్‌షిప్‌లలో టైగన్ ఎస్‌యూ‌విని బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. దీనితో పాటు కంపెనీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా  కూడా బుక్ చేసుకోవచ్చు. 

 జర్మన్ కార్ల తయారీ సంస్థ  ప్రతిష్టాత్మక భారత్ 2.0 ప్రణాళికతో భాగంగా వస్తోంది. దీంతో వోక్స్వ్యాగన్ దేశంలో ప్రముఖ బడ్జెట్ ప్రీమియం కార్ బ్రాండ్‌గా అవతరించింది. వోక్స్వ్యాగన్  కొత్త ఎస్‌యూవీ టైగన్ ప్రొడక్షన్ వెర్షన్‌ని ఈ ఏడాది మార్చి చివరిలో అధికారికంగా ఆవిష్కరించింది. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఈ కారును పరిచయం చేసింది.  వోక్స్వ్యాగన్ టైగన్‌తో మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలోకి ప్రవేశించింది. వోక్స్‌వ్యాగన్ టైగన్‌ను భారతీయ కార్ల మార్కెట్‌లో అత్యంత పోటీతత్వ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో విడుదల చేస్తోంది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్  వంటి ఎస్‌యూవీలు ఇప్పటికే ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయించాయి. హ్యుందాయ్‌లో అత్యధికంగా అమ్ముడైన కార్లలో క్రెటా ఒకటి.


కాన్సెప్ట్ మోడల్

2020 ఫిబ్రవరిలో గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ప్రవేశపెట్టిన టైగన్ ఎస్‌యూ‌వి కాన్సెప్ట్‌ని పోలి ఉంటుంది. అంటే ఇటీవల ప్రవేశపెట్టిన ప్రొడక్షన్ వెర్షన్ దాదాపు ఒకేలా ఉంటుంది. వోక్స్వ్యాగన్  కొత్త డిజైన్ ఫీచర్స్ టైగన్‌లో చూడవచ్చు, కంపెనీ T-Roc అండ్ రాబోయే అన్ని వాహనాలపై కనిపిస్తుంది. టైగన్ ఎస్‌యూ‌వి రెండు ట్రిమ్‌లలో అందించనున్నారు, జి‌టి లైన్ ట్రిమ్  టాప్ ఎండ్. ఇందులో జి‌టి బ్యాడ్జింగ్, రెడ్ బ్రేక్ కాలిపర్స్ వంటి కొన్ని ప్రత్యేక ఫీచర్స్  ఉంటాయి. 
 

ఇంజిన్ అండ్ పవర్

టైగన్ కాంపాక్ట్ ఎస్‌యూ‌వి రెండు టి‌ఎస్‌ఐ ఇంజిన్ ఆప్షన్ తో అందించనున్నారు. ఫస్ట్ ఇంజన్ ఆప్షన్ 1.0-లీటర్ 3-సిలిండర్ టర్బోచార్జ్డ్ టి‌ఎస్‌ఐ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ 115పి‌ఎస్ గరిష్ట శక్తిని, 175ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరో ఇంజిన్ ఆప్షన్స్ 1.5 లీటర్ 4-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఈ ఇంజన్ గరిష్టంగా 150పి‌ఎస్ శక్తిని, 250ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారుతో కంపెనీ మూడు ట్రాన్స్మిషన్ ఆప్షన్ అందిస్తుంది. కంపెనీ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ని స్టాండర్డ్ ఇస్తుంది. 1.0-లీటర్ ఇంజిన్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ అండ్ 1.5-లీటర్ ఇంజన్ 7-స్పీడ్ డి‌ఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ లభిస్తుంది.

లూక్స్ అండ్ డిజైన్

టైగన్‌  డిజైన్ చాలా T-Roc- ని పోలి ఉంటుంది. కారు ముందు భాగంలో గ్రిల్‌పై  వి‌డబల్యూ బ్యాడ్జింగ్  హై లెట్ గా కనిపిస్తుంది. స్లిక్ ఎల్‌ఈ‌డి హెడ్‌లైట్లు, ఎల్‌ఈ‌డి  డి‌ఆర్‌ఎల్, ఈ ఎస్‌యూ‌విలో  17-అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, ఎల్‌ఈ‌డి లైట్ స్ట్రిప్ కారు వెనుక వైపున రెండు వైపులా ఎల్‌ఈ‌డి టెయిల్ లైట్‌లకు కనెక్ట్ అవుతుంది. క్రోమ్ డోర్ హ్యాండిల్స్, సిల్వర్ రూఫ్ ట్రాక్స్ లభిస్తాయి.
 

ఇంటీరియర్ అండ్ ఫీచర్లు

టైగన్ ఎస్‌యూ‌వి లోపలి భాగం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎస్‌యూ‌వి లోపల డ్యూయల్ టోన్ ఇంటీరియర్ డిజిటల్ కాక్‌పిట్‌తో ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. దీనిలో 10.1-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్‌, ఆపిల్ కార్‌ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్, 10.2-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైట్, ముందు  వెంటిలేటెడ్ సీట్లు, విశాలమైన సన్‌రూఫ్ వంటి ఎన్నో హై లెట్ ఫీచర్లు ఈ ఎస్‌యూవీలో ఇచ్చారు.
 

భద్రతా ఫీచర్లు

అదనంగా, వోక్స్వ్యాగన్ ఎస్‌యూ‌విలో ఎక్కువ భద్రతా ఫీచర్లను ఇచ్చింది. ఈ‌బి‌డి, ఈ‌ఎస్‌సి, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లతో ఏ‌బి‌ఎస్ వంటి సేఫ్టీ ఫీచర్లను  అందించింది.

 టైగన్ ఎస్‌యూవీని  ప్రీమియం అండ్ లేటెస్ట్ ఉత్పత్తిగా పిలువవచ్చు. ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన తర్వాత  ఈ కారు ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తుంది. అయితే, ఈ కారు ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. కానీ  "పోటీ ధర" ఉంటుందని వోక్స్వ్యాగన్ తెలిపింది. వోక్స్వ్యాగన్ టైగన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10 లక్షల నుంచి రూ .17 లక్షల మధ్య ఉండవచ్చని మీడియా నివేదిక పేర్కొంది.

Latest Videos

click me!