పెట్రోల్ ధరతో ఇబ్బందిగా ఉందా.. ఇండియాలోని బెస్ట్ బడ్జెట్ బైక్స్ ఇవే.. లీటరుకు 90కి.మీ. వరకు మైలేజ్..

First Published | Aug 23, 2021, 1:56 PM IST

కరోనా మహమ్మారితో పాటు ద్రవ్యోల్బణం కూడా సామాన్యులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒక వైపు పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోని చాలా ప్రాంతాల్లో  ఇప్పటికే లీటరుకు రూ .100 దాటింది. పెట్రోల్ ధరలు పెంపు ద్విచక్ర వాహన చోదకుల కష్టాలను మరింత పెంచింది. 

 ఇలాంటి పరిస్థితిలో అధిక మైలేజ్ ఉన్న కమ్యూటర్ బైక్స్ డిమాండ్  పెరిగింది. అంటే మీరు బైక్  పై ప్రయాణిస్తుంటే రన్నింగ్ ఖర్చు తక్కువగా ఉండే విధంగా ఉండాలి. ఆర్థికంగా ఉండటమే కాకుండా వాటి నిర్వహణ ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు కొత్త టూ వీలర్ కొనాలని ఆలోచిస్తుంటే మార్కెట్‌లో మీ బడ్జెట్‌కు సరిపోయే బెస్ట్ ఆప్షన్ బైక్స్ ఉన్నాయి ఇంకా అధిక మైలేజీని కూడా ఇస్తాయి. దేశంలో అత్యధిక మైలేజ్ ఇచ్చే 5 బైక్స్ గురించి మీకోసం..

హీరో స్ప్లెండర్ ప్లస్

ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్  హీరో స్ప్లెండర్ ప్లస్  అత్యధికంగా అమ్ముడవుతున్న అలాగే ఎక్కువ మైలేజీకి ప్రసిద్ధి చెందింది. హీరో స్ప్లెండర్ ప్లస్ ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) 80 kmpl సర్టిఫైడ్ మైలేజ్ ఇస్తుంది. ఈ బైక్ 97.2 సిసి ఇంజిన్, 8.01 పిఎస్ పవర్, 8.05 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంకా ఎలక్ట్రిక్ అండ్ కిక్ స్టార్ట్ అనే రెండు వేరియంట్లలో వస్తుంది. కంపెనీ ఈ ప్రముఖ బైక్‌ను 4 కలర్ స్కీమ్‌లతో అందిస్తుంది. హీరో స్ప్లెండర్ ప్లస్  కిక్ స్టార్ట్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ ఢిల్లీ  ఎక్స్-షోరూమ్ ధర రూ .63,750.


హీరో సూపర్ స్ప్లెండర్

హీరో మోటోకార్ప్ నుండి మరో బైక్ హీరో సూపర్ స్ప్లెండర్  టాప్ 5 మైలేజ్ బైక్స్ లిస్ట్ లో నిలిచింది. ఈ బైక్ 125 సిసి బైక్. హీరో సూపర్ స్ప్లెండర్ బైక్ ఏఆర్ఏఐ సర్టిఫైడ్ మైలేజ్ 83 kmpl. 125 సిసి బైక్ కోసం ఈ మైలేజ్ ఫిగర్ చాలా అద్భుతంగా పరిగణించబడుతుంది. ఢిల్లీ ఎక్స్-షోరూమ్‌లో హీరో సూపర్ స్ప్లెండర్ బైక్ ధర రూ .72,600.  ప్రీమియం డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ .75,900. 

టి‌వి‌ఎస్ స్టార్ సిటీ ప్లస్

టి‌వి‌ఎస్ స్టార్ సిటీ ప్లస్ కూడా టాప్ 5 మైలేజ్ బైక్‌లలో బెస్ట్  ఆప్షన్. ఈ బైక్ ఏ‌ఆర్‌ఏ‌ఐ సర్టిఫైడ్ మైలేజ్ 86 kmpl. ఈ‌ 110సి‌సి టి‌వి‌ఎస్ స్టార్ సిటీ ప్లస్ బైక్ 8 bhp శక్తిని ఇస్తుంది. బైక్ కిక్ స్టార్ట్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ ఆప్షన్‌లతో పాటు సింగిల్ టోన్ అండ్ డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్‌లతో అందుబాటులో ఉంది. ఢిల్లీలో టి‌వి‌ఎస్ స్టార్ సిటీ ప్లస్ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ .68,242. 

బజాజ్ ప్లాటినా 110

బజాజ్ ప్లాటినా  తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మైలేజీని అందించడంలో ప్రసిద్ధి చెందింది. ఈ బైక్ 100సి‌సి బైక్ ఇంకా ఏ‌ఆర్‌ఏ‌ఐ సర్టిఫైడ్ మైలేజ్ 84 kmpl. బజాజ్ ప్లాటినాలో 102 సి‌సి ఇంజిన్ అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ 7.9 పిఎస్ పవర్, 8.3 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. బజాజ్ ప్రకారం ప్లాటినా డిస్క్ బ్రేక్ పొందిన ఏకైక 100 సిసి మోటార్‌సైకిల్.  ఈ‌ బైక్ కి ఎల్‌ఈ‌డి డి‌ఆర్‌ఎల్ (డేటైమ్ రన్నింగ్ లైట్స్) ఇచ్చారు. ఢిల్లీలో బజాజ్ ప్లాటినా ఎక్స్-షోరూమ్  ప్రారంభ ధర రూ. 66,739, 

బజాజ్ సి‌టి 100

దేశంలో చౌకైన 100సి‌సి బైక్ బజాజ్ సి‌టి 100 కూడా అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన బైక్. బజాజ్ నుండి ఈ ఎంట్రీ లెవల్ కమ్యూటర్ బైక్ 90 kmpl మైలేజ్ ఇస్తుంది. ఈ బైక్ లో 102 సిసి ఇంజన్ అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ 7.9 పిఎస్ పవర్, 8.34 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బడ్జెట్ బైక్‌ను కంపెనీ మూడు రంగులలో అందుబాటులో ఉంచింది. ఇందులో నలుపు, ఆకుపచ్చ మరియు ఎరుపు రంగులు చేర్చబడ్డాయి. బజాజ్ సి‌టి 100 బైక్ అల్లాయ్ వీల్స్ కిక్ స్టార్ట్ వేరియంట్ ఢిల్లీ  ఎక్స్-షోరూమ్ ధర రూ .52,832. 

Latest Videos

click me!