అమ్మకానికి విజయ్ మాల్యా ఫెవరెట్ కారు.. అదికూడా ఆన్‌లైన్‌లో తక్కువ ధరకే..

First Published | Jul 31, 2024, 6:41 PM IST

బ్యాంకుల నుండి వేల కోట్ల  రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు చెందిన భారతీయ ఆస్తులు చాలా వరకు జప్తు అయ్యాయి. అయితే వీటిలో కార్లు, ప్రైవేట్ జెట్‌లతో సహా ఎన్నో  విలాసవంతమైన వస్తువులు కూడా ఉన్నాయి. 

భారతదేశంలో అరుదైన కార్లను కలిగిన కొద్దిమంది వ్యక్తులలో విజయ్ మాల్యా ఒకరు. అయితే ఇప్పుడు మాల్యాకు చెందిన ఓ ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ ఆరిజిన్ మేబ్యాక్ కారు అమ్మకానికి వచ్చింది.  దీని కోసం ఆన్‌లైన్‌లో కూడా బుకింగ్ చేసుకోవచ్చు.

మేబ్యాక్ సిరీస్  మేబ్యాక్ 62 మోడల్ 2013లో నిలిపివేసారు. దీని తర్వాత Mercedes Benz మేబ్యాక్ GLS 600, S 580, S 680 సిరీస్ కార్లు మార్కెట్లోకి వచ్చాయి. కానీ మేబ్యాక్ 62 మేబ్యాక్ ఆరిజిన్ కార్లకు గర్వకారణం. భారతదేశంలో ఈ కార్లు ఉన్నవారు చాలా తక్కువ. అందులో విజయ్ మాల్యా ఒకరు. అయితే విజయ్ మాల్యా వద్ద ప్రస్తుతం ఈ కారు లేదు. కానీ అతను వాడిన ఈ కారు ఇప్పుడు అమ్మకానికి ఉంది. సెకండ్ హ్యాండ్ కార్ డీలర్ బిగ్ బాయ్ టాయ్స్ ఈ కారును అమ్మకానికి పేట్టింది.


2009 మోడల్ మేబ్యాక్ 62 కారు ప్రస్తుత ధర 2.49 కోట్లు. విజయ్ మాల్యా వాడిన కార్ నంబర్ కూడా అలాగే ఉంది. 9999 నంబర్ గల ఈ కారు పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం రిజిస్ట్రేషన్‌తో ఉంది. ఈ కారు నలుపు & గోల్డెన్ డ్యూయల్ టోన్ కలర్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. విజయ్ మాల్యా ప్రత్యేకంగా సూచించిన కలర్ ఇది.
 

ఈ కారు కేవలం 33,971 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించింది. దీనిలో 5.5 లీటర్ ట్విన్ టర్బో ఇంజిన్‌  అది కూడా   మంచి కండిషన్లో   ఉంది. ఈ కారు 2019 మెర్సిడెస్-బెంజ్ వింటేజ్ కార్ ర్యాలీలో కూడా పాల్గొంది అంతేకాకుండా  అందరినీ ఆకర్షించింది. విజయ్ మాల్యా కారు కొనాలనుకునే వారు కార్ డీలర్‌ను సంప్రదించవచ్చు.  

Latest Videos

click me!