Published : Jun 24, 2026, 04:37 PM ISTUpdated : Jun 24, 2026, 04:57 PM IST
తక్కువ బడ్జెట్‌లో కారు కొనాలనుకునేవారికి సెకండ్ హ్యాండ్ బెస్ట్ ఆప్షన్. కానీ చిన్నచిన్న అజాగ్రత్త వల్ల సెకండ్ హ్యాండ్ కారు పెద్ద నష్టాన్ని కలిగించవచ్చు. అందుకే కారు కొనేముందు డాక్యుమెంట్లు సరిగ్గా చెక్ చేసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సామాన్య మధ్యతరగతి ప్రజలు కొత్త కారు కొనేకంటే తక్కువ ధరలో వచ్చే సెకండ్ హ్యాండ్ కారును కొనేందుకే ఇష్టపడతారు. తక్కువ బడ్జెట్ లోనే మంచిమంచి కార్లు మార్కెట్లో లభిస్తుంటాయి. ఇంజిన్ పనితీరు, కారు కండీషన్ ను టెస్ట్ డ్రైవ్ చేసి తెలుసుకోవచ్చు లేదంటే తెలిసిన మెకానిక్ తో చెక్ చేయించవచ్చు. ఇంకా పర్పెక్ట్ గా చెక్ చేసుకోవాలంటే కార్ 24, స్పిన్ని వంటి సంస్థలు ఇన్పెక్షన్ చేసిపెడతాయి. కానీ కారు డాక్యుమెంట్ సరిగ్గా ఉన్నాయో లేదో తెలుసుకునే బాధ్యత కొనేవారిపైనే ఉంటుంది.
25
లోన్ ఉన్న కారు కొన్నారో అంతే సంగతి..!
సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు డాక్యుమెంట్స్ సరిగ్గా చెక్ చేసుకోకుంటే చిక్కులు తప్పవు. అందుకే ఆ కారు లోన్ ఇంకా కట్టాల్సి ఉన్నా లేదా డాక్యుమెంట్స్ సరిగ్గా లేకున్నా అస్సలు కొనొద్దు. ఇలాంటి కారు కొంటే బ్యాంకు లేదా చట్టపరమైన సంస్థలు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో మొత్తం డబ్బులు చెల్లించి కూడా కొనుగోలు చేసినవారు తీవ్రంగా నష్టపోయే ఆస్కారం ఉంది.
35
బ్యాంకు NOC, ఫామ్ 35 అడగండి
వాహనం లోన్ మొత్తం తిరిగి చెల్లించేశానని అమ్మకందారుడు చెబితే కేవలం ఆ నోటిమాటలు నమ్మొద్దు. బ్యాంకు లేదా ఫైనాన్స్ సంస్థ జారీ చేసిన ఒరిజనల్ NOC, ఫామ్ 35 కాపీని కచ్చితంగా అడగాలి. ఈ పత్రాలు ఉంటేనే లోన్ చెల్లింపు పూర్తయినట్లు… బ్యాంక్ లేదా ఫైనాన్స్ సంస్థకు ఈ వాహనంపై ఎలాంటి హక్కులు లేవని అర్థం. ఇవి లేకుండా RC నుంచి బ్యాంకు పేరును తొలగించడం కుదరదు… అంటే ఈ వాహనంపై సర్వహక్కులు సదరు బ్యాంకు లేదా ఫైనాన్స్ సంస్థ కలిగివున్నట్లు.
కారు సర్వీస్ హిస్టరీ, ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు గమనించండి.
కారు ఓడో మీటర్‌ను పరిశీలించండి. ఇది ట్యాంపర్ చేశారేమో చెక్ చేయండి.
కనీసం 5-10 కిలోమీటర్ల దూరం కారుని టెస్ట్ డ్రైవ్ చేయండి.
మీకు తెలిసిన మెకానిక్‌తో వాహనాన్ని ఒకసారి చూపించండి.
55
సెకండ్ హ్యాడ్ కారు రిజిస్ట్రేషన్ కు ఈ పేపర్స్ ఉండాల్సిందే
వాహనాన్ని మీ పేరు మీదకు మార్చేటప్పుడు బ్యాంకు NOC, సంబంధిత పత్రాలను RTOకి సమర్పించారో లేదో నిర్ధారించుకోండి. ఇలా చేస్తేనే వాహన రికార్డుల నుంచి హైపోథికేషన్ పూర్తిగా తొలగిపోతుంది... అంటే లోన్ ఇచ్చిన సంస్థలకు ఆ వాహనంపై ఎలాంటి హక్కులు ఉండవు. దీంతో భవిష్యత్తులో ఎలాంటి చట్టపరమైన సమస్యలు రాకుండా ఉంటాయి.