బజాజ్ పల్సర్ 250
బజాజ్ ఆటో ఈ ఏడాది నవంబర్‌లో కొత్త పల్సర్ 250 బైక్ ని లాంచ్ చేయనుంది. ఈ బైక్ ఇండియాలో విడుదల చేయబోతున్న బజాజ్ లైనప్‌లో అతిపెద్ద పల్సర్ మోడల్. కంపెనీ కొత్త పల్సర్ 250 బైక్ ని ప్రస్తుతం పరీక్షిస్తోంది తాజాగా ఈ బైక్ టెస్టింగ్ సందర్భాల్లో కనిపించింది. వార్తల ప్రకారం, 250 సిసి ఆయిల్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఇందులో ఇవ్వవచ్చు. గేర్ ట్రాన్స్మిషన్ చూస్తే 6-స్పీడ్ కాస్టంట్ మెష్ ట్రాన్స్‌మిషన్ ఉండవచ్చు. ఈ ఇంజన్ 28 పిఎస్ పవర్, 20 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు.
న్యూ-జెన్ కేటిఎం ఆర్‌సి390
పల్సర్ బైక్‌ల కొత్త శ్రేణి కాకుండా బజాజ్ ఆటో కేటిఎం ఆర్‌సి శ్రేణి కొత్త జనరేషన్ భారతదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. నివేదికల ప్రకారం కొత్త-జనరేషన్ ఆర్‌సి390 ఈ సంవత్సరం నవంబర్‌లో విక్రయించబడే అవకాశం ఉంది.
టివిఎస్ జూపిటర్ 125
టివిఎస్ మోటార్ కంపెనీ ద్విచక్ర వాహన విభాగంలో కొత్త జూపిటర్ 125 స్కూటర్‌తో కంపెనీ ఉనికిని బలోపేతం చేసుకోవడానికి సన్నద్ధమవుతోంది. జూపిటర్ 125 అక్టోబర్ 7న భారతీయ మార్కెట్లో విడుదల కానుంది. భారతదేశంలో 125 సిసి స్కూటర్ విభాగంలో హీరో మాస్ట్రో ఎడ్జ్ 125, హోండా యాక్టివా 125తో సహా ఇతర స్కూటర్లకు టివిఎస్ జూపిటర్ 125 ప్రత్యక్ష పోటీని ఇస్తుంది.
బిఎండబల్యూ 400 జిటి
బిఎండబల్యూ మోటరోరాడ్ ఇండియా ఇప్పటికే కొత్త 400జిటి స్కూటర్ టీజర్‌లను విడుదల చేసింది. అయితే అధికారిక లాంచ్ తేదీ దగ్గరలో ఉందని సూచిస్తుంది. భారతదేశంలో ఎంపిక చేసిన బిఎండబల్యూ మోటరోరాడ్ డీలర్‌షిప్‌లలో కొత్త బిఎండబల్యూ ప్రీ-లాంచ్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఈ స్కూటర్ కొనాలనుకునే కస్టమర్‌లు రూ .1 లక్ష టోకెన్ మొత్తం చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
బిఎండబల్యూ 400జిటిని ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్నారు. దీనికి 350 సిసి సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో శక్తినిస్తుంది, 7,500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 33.5 బిహెచ్‌పి పవర్, 5,750 ఆర్‌పిఎమ్ వద్ద 35 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ సివిటి గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇంకా చాలా ప్రీమియం ప్రొడక్షన్ గా మారుతుంది, దీనికి భారతీయ మార్కెట్లో ప్రత్యక్ష పోటీ లేదు. లాంచ్ ధర దాదాపు రూ .4 లక్షలు ఉంటుందని అంచనా.