మొట్టమొదటిసారిగా అటానమస్ టెక్నాలజితో ఎం‌జి కొత్త ఎస్‌యూ‌వి.. హ్యుందాయ్, స్కోడా, కియాకి పోటీగా లాంచ్..

First Published | Sep 30, 2021, 11:26 AM IST

మోరిస్ గ్యారేజ్ (ఎం‌జి)మోటార్ ఇండియా  కొత్త మిడ్ సైజ్ ఎస్‌యూ‌వి ఆస్టర్ (aster)ని తాజాగా భారతదేశంలో పరిచయం చేసింది దీనిని త్వరలోనే లాంచ్ చేయబోతోంది. నివేదిక ప్రకారం, ఎం‌జి ఆస్టర్  ఎస్‌యూ‌వి అక్టోబర్ 7న భారతీయ మార్కెట్లో విడుదల చేయనున్నారు. 

కంపెనీ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించనప్పటికీ ప్రత్యేక విషయం ఏమిటంటే ఈ విభాగంలో మొదటిసారిగా అటానమస్ లెవల్ 2 ఏ‌డి‌ఏ‌ఎస్ (అడాప్టివ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్) టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  ఉన్న మొదటి కారు ఎం‌జి ఆస్టర్. 

త్వరలో రానున్న ఎం‌జి ఆస్టర్ దేశంలో ఎం‌జి అత్యంత బడ్జెట్ కారు. అంతేకాక భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజి కలిగిన చౌకైన కార్లలో ఒకటి. ఎం‌జి ఆస్టర్   మోరిస్ గ్యారేజ్ నాల్గవ కారు. ఈ ఎస్‌యూ‌వి ద్వారా కంపెనీ మార్కెట్‌లో పట్టు పెంచుకోవాలని భావిస్తోంది.  ఎం‌జి ఆస్టర్ పొడవు దాదాపు 4.3 మీటర్లు ఉంటుంది. ఎం‌జి ఆస్టర్ కాంపాక్ట్ ఎస్‌యూ‌వి సెగ్మెంట్‌లోకి ప్రవేశిస్తోంది, అంటే హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్, ఇటీవల లాంచ్ చేసిన వోక్స్వ్యాగన్ టైగన్ వంటి వాటితో పోటీగా  నిలుస్తుంది.

పర్సనల్ ఏ‌ఐ అసిస్టెంట్‌

ఎం‌జి మోటార్ ఇండియా ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మొదటిసారిగా పర్సనల్ ఏ‌ఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అసిస్టెంట్ ఫీచర్‌ను ఈ కారులో పరిచయం చేస్తోంది. ఈ వ్యవస్థను అమెరికన్ కంపెనీ స్టార్ డిజైన్ తయారు చేసింది. ఏ‌ఐ వ్యవస్థలో ఇంటరాక్టివ్ రోబోట్ ఉంటుంది, ఇది డ్రైవర్‌తో మాట్లాడగలదు. ఐ-స్మార్ట్ హబ్ ద్వారా ఆధారితమైనది, హ్యూమనాయిడ్ మనుషులులాగే శబ్దాలు, భావోద్వేగాలను అనుకరించగలదు. అలాగే హింగ్లీష్ భాష, భారతీయ యాసను బాగా అర్థం చేసుకుంటుంది. ఆస్టర్ ఎస్‌యూ‌వి ఐ‌సి‌ఈ (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) గా వస్తుంది. ఈ ఎస్‌యూ‌వి కంపెనీ ప్రముఖ ఎలక్ట్రిక్ కారు ఎం‌జి జెడ్‌ఎస్ ఈ‌వి పెట్రోల్ ఇంజిన్ మోడల్. 


ఇంజిన్ అండ్ పవర్

కంపెనీ కేవలం పెట్రోల్ ఇంజిన్‌తో ఎం‌జి ఆస్టర్ ఎస్‌యూవీని విడుదల చేయబోతోంది. అయితే  రెండు ఇంజిన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంటుంది. ఒకటి 1.3 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, మరొకటి  1.5 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్. దీని 1.3 లీటర్ ఇంజన్ 140 బిహెచ్‌పి పవర్, 210 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది, ఈ విభాగంలో అత్యంత శక్తివంతమైనది. 1.5 లీటర్ ఇంజన్ 110 బిహెచ్‌పి పవర్, 144 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 1.3 లీటర్ ఇంజిన్‌తో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, 1.5 లీటర్‌తో మాన్యువల్ అండ్ సివిటి గేర్‌బాక్స్ ఆప్షన్ ఉంటుంది. 
 

ఫీచర్స్

మ్యూజిక్ అండ్ వీడియోలను ప్లే చేయడానికి ఆస్టర్‌లోని  జియో సావన్ (JioSaavn) యాప్ కారు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసి ఉంటుంది. ఐ-స్మార్ట్ నెక్స్ట్ జెన్ 10.1 అంగుళాల డిస్‌ప్లే స్క్రీన్‌తో వస్తుంది, దీనిని మొబైల్‌కు కనెక్ట్ చేయవచ్చు. అంతేకాకుండా 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, హీటెడ్ ఓ‌ఆర్‌వి‌ఎం, పనోరమిక్ సన్‌రూఫ్, 6-వే అడ్జస్ట్ చేయగల డ్రైవర్ సీటు, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఎన్నో గొప్ప ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. 

లెవల్ 2 ఏ‌డి‌ఏ‌ఎస్ కాకుండా అస్టర్ అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఫార్వర్డ్ కొలిజన్ హెచ్చరిక, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ ప్రివెన్షన్, స్పీడ్ అసిస్ట్ వంటి ఫీచర్లను పొందుతుంది. ప్రస్తుతం, ఈ ఫీచర్లు ఎం‌జి గ్లోస్టర్ ఏ‌ఎన్‌డి మహీంద్రా ఎక్స్‌యూ‌వి700 లలో మాత్రమే వస్తున్నాయి. 
 

ధర ఎంత

 కంపెనీ రూ .9 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో ఆస్టర్  ఎంట్రీ లెవల్ వేరియంట్‌ను ఆఫర్ చేయవచ్చు. అలాగే టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ .15 లక్షల వరకు ఉంటుంది. 

Latest Videos

click me!