త్వరలో ఇండియాలోకి లాంచ్ కానున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే.. వాటి ధర, ఫీచర్స్ తెలుసుకోండి..

First Published Apr 12, 2021, 6:43 PM IST

ఎలక్ట్రిక్ వాహనాలు ఈ మధ్య కాలంలో భారత మార్కెట్లో  చాలా పాపులరిటీని పొందుతున్నాయి. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ కూడా పెరిగింది. పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యుల జేబుకి చిల్లు వేస్తుంది.

ఇలాంటి పరిస్థితిలో ఆటోమొబైల్ తయారీ సంస్థలు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే మీరు కొత్త మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటే త్వరలో లాంచ్ కానున్న వీటి గురించి తెలిసుకోండి. భారతీయ మార్కెట్లో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎప్పుడు ప్రారంభించవచ్చో చూడండి..
undefined
సుజుకి బర్గ్‌మన్ ఎలక్ట్రిక్ స్కూటర్సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా త్వరలో ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత ద్విచక్ర వాహన మార్కెట్లో విడుదల చేయబోతోంది. నివేదిక ప్రకారం, కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ ప్రస్తుతం అందుబాటులో ఉన్న సుజుకి బర్గ్‌మన్ కి ఎలక్ట్రిక్ వెర్షన్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 3 నుండి 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. అలాగే దీనికి 4 నుండి 6 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారు సెటప్ ఇవ్వవచ్చు. సుజుకి బెర్గ్‌మన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ఫుల్ ఛార్జింగ్‌తో 70 నుంచి 90 కిలోమీటర్ల పరిధి ప్రయాణించగలదు. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 80 కిమీ.
undefined
ప్రపంచంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటార్ కార్ప్ త్వరలో ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది. ఒక నివేదిక ప్రకారం ఈ స్కూటర్‌లో 3.5 కిలోవాట్ల బ్యాటరీని అందించవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ 4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 55 కిలోమీటర్లు. ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరను రూ .85,000 వద్ద ఉంచవచ్చు.
undefined
మొబైల్ యాప్ ఆధారిత టాక్సీ సర్వీస్ సంస్థ ఓలా త్వరలో బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసురబోతుంది. సంస్థ ఇటీవలే ఈ కొత్త స్కూటర్ టీజర్ ఫోటోను కూడా విడుదల చేసింది.ఓలా రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ ఎటర్గో యాప్‌ స్కూటర్ ఆధారంగా రూపొందించారు. ఓలా క్యాబ్స్ సంస్థ నెదర్లాండ్స్‌కు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ ఎటర్గోను మే 2020లో కొనుగోలు చేసింది. ఈ స్కూటర్‌కు అధిక శక్తి-సాంద్రత కలిగిన బ్యాటరీ లభిస్తుంది. కంపెనీ ప్రకారం ఈ స్కూటర్‌ పూర్తి ఛార్జింగ్‌తో 240 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.
undefined
ఎటర్గో యాప్‌ స్కూటర్ కేవలం 3.9 సెకన్లలో గంటకు 0 నుండి 45 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సీటు కింద 50 లీటర్ల స్టోరేజ్ సామర్థ్యాన్ని కూడా అందిస్తుంది.ఓలా సంస్థ 330 మిలియన్ డాలర్ల వ్యయంతో తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో 500 ఎకరాల భూమిలో మెగా ఫ్యాక్టరీని నిర్మిస్తోంది. ఈ ప్లాంట్‌లోనే కంపెనీకి చెందిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తయారు చేస్తుంది.
undefined
click me!