పండుగ సీజన్‌లో కొత్త రంగులలో టి‌వి‌ఎస్ బెస్ట్ మైలేజ్ బైక్.. కొత్త ధర ఎంతంటే ?

First Published | Oct 25, 2021, 7:44 PM IST

 టీవీఎస్ మోటార్(tvs motor) కంపెనీ  ప్రముఖ కమ్యూటర్ బైక్ రేడియన్‌(radeon)ను రెండు కొత్త రంగుల్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కంపెనీ రెండు కొత్త డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్ ఆప్షన్స్ పరిచయం చేసింది. ఇప్పుడు ఎరుపు, నలుపు ఆప్షన్స్ తో పాటు నీలం, నలుపు ఆప్షన్ కూడా అందుబాటులోకి తెచ్చింది. కొత్త పెయింట్ స్కీమ్ మినహా ఈ కమ్యూటర్ బైక్ లో ఎలాంటి ఇతర మార్పులు చేయలేదు.

కొత్త లుక్ 
కొత్తగా ప్రవేశపెట్టిన పెయింట్ స్కీమ్‌లు రెండూ డ్యూయల్ టోన్ ఫ్యూయల్ ట్యాంక్, బాడీ కలర్ హెడ్‌ల్యాంప్ అసెంబ్లీని పొందుతాయి. అలాగే, సైడ్ బాడీ ప్యానెల్‌పై డ్యూయల్-టోన్ ఎఫెక్ట్ ఇచ్చారు, అలాగే 'రేడియన్' డెకాల్‌ని కూడా పొందుతుంది. ముందు మడ్‌గార్డ్ రెండు ఆప్షన్స్ లో  నలుపు రంగులో అందించచారు. అయితే ఇంజిన్ కవర్ గోల్డ్ రంగును పొందుతుంది. రెండు కలర్ ఆప్షన్‌లలో అల్లాయ్ వీల్స్ నలుపు రంగులో అందిస్తుంది. 

ఫీచర్లు
ఈ బైక్ రూపాన్ని మార్చడమే కాకుండా బైక్ ఇతర ఫీచర్స్ అలాగే ఉంటాయి. రేడియన్‌ కొన్ని ఫీచర్స్ గురించి మాట్లాడితే  ఎల్‌ఈ‌డి డి‌ఆర్‌ఎల్, యూ‌ఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్, డిస్క్ బ్రేక్ ఉన్నాయి. 

ఇంజిన్ అండ్ మైలేజ్
బి‌ఎస్-VI స్టాండర్డ్ టి‌వి‌ఎస్ రేడియన్‌ 109.7cc సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ పొందుతుంది. ఈ ఇంజన్ 7,350 rpm వద్ద 8.08 PS శక్తిని, 4,500 rpm వద్ద 8.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గేర్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ లో 4-స్పీడ్ గేర్‌బాక్స్  ఇచ్చింది. ఈ బైక్ 79.3 kmpl మైలేజ్ ఇస్తుంది. 


ఇప్పటి వరకు ధర సంబంధించినంత వరకు టీవీఎస్ రేడియన్‌ కొత్త డ్యూయల్ టోన్ వేరియంట్ స్టాండర్డ్ వేరియంట్ కన్నా కాస్త ఎక్కువ ధర ఉంటుంది. డ్రమ్ వేరియంట్ (DT) ధర రూ. 68,982. డిస్క్ (డిటి) కోసం మీరు రూ. 71,982 చెల్లించాల్సి ఉంటుంది. రెండు మోడల్‌లు రూ. 900 వరకు ఖరీదైనవిగా మారాయి.

టి‌వి‌ఎస్  రేడియన్‌ భారత మార్కెట్లో హోండా సి‌డి110 డ్రీమ్ డి‌ఎక్స్ (honda cd 110 dream dx), బజాజ్ ప్లాటినా ES 100 (bajaj platina ES 100), హీరో స్ప్లెండర్ ప్లస్ (hero splendor plus) వంటి బైక్స్ తో  పోటీపడుతుంది .

Latest Videos

click me!