పవర్ ప్యాకేడ్ మినీ ఎలక్ట్రిక్ కార్.. 7 సెకన్లలోనే టాప్ స్పీడ్.. త్వరలోనే ఇండియాలోకి..

First Published Oct 25, 2021, 12:30 PM IST

బ్రిటిష్ ఆటోమోటివ్ కంపెనీ మినీ(mini) ఇండియా కూపర్ ఎస్‌ఈ టీజర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేసింది, ఈ బ్రాండ్ మొట్టమొదటి ఫుల్ ఎలక్ట్రిక్ కారు (electric car)త్వరలో ఇండియాలో అడుగుపెట్టనుంది. ఈ మోడల్ మిని ఇండియా(mini india) వెబ్‌సైట్‌లో 'కమింగ్ సూన్' ట్యాగ్‌తో లిస్ట్ చేయబడింది. ఆల్-ఎలక్ట్రిక్ మినీ కూపర్ ఎస్‌ఈ(mini cooper se) మొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా 2019లో పరిచయం చేసింది.

టెక్నికల్ గా బి‌ఎం‌డబల్యూ ఇండియా గ్రూప్‌లో విక్రయించనున్న మొదటి ఫుల్ ఎలక్ట్రిక్ మోడల్. పేరు సూచించినట్లుగా కూపర్ ఎస్‌ఈ అనేది మినీ 3-డోర్‌పై ఆధారపడి ఉంటుంది కానీ ఎలక్ట్రిక్ మోటార్ అండ్ బ్యాటరీతో వస్తుంది. స్పష్టమైన మార్పులను మినహాయించి పెట్రోల్-పవర్డ్ వెర్షన్‌తో సమానంగా కనిపిస్తుంది. లాంచ్ తేదీ పై  ఇంకా ఎలాంటి  లేనప్పటికి కానీ కొన్ని వారాల్లో లగ్జరీ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కార్  రోబోతున్నట్లు తెలుస్తుంది.

మినీ కూపర్ ఎస్‌ఈలోని  లూక్స్ పరంగా ముఖ్యమైన తేడా ఏంటంటే క్రోమ్ సరౌండ్‌ ఉండే ఫ్రంట్ గ్రిల్ ఇంకా 'S' అక్షరాల స్థానంలో కొత్త 'E' బ్యాడ్జ్ ఉంటుంది. ఈ మోడల్ కొత్త అల్లాయ్ వీల్స్‌తో కూడా వస్తుంది. ట్రెడిషనల్ ఫ్యూయల్ క్యాప్ ఛార్జింగ్ సాకెట్‌ను కవర్ చేస్తుంది. ఎల్‌ఈ‌డి డి‌ఆర్‌ఎల్ తో కూడిన రౌండ్ హెడ్‌ల్యాంప్‌లు, యూనియన్ జాక్  థీమ్ ఎల్‌ఈ‌డి టైల్‌లైట్‌లు, రౌండ్ ఓ‌ఆర్‌వి‌ఎంలు, ఫెమిలియర్ సిల్హౌట్‌తో సహా అన్ని ట్రేడ్‌మార్క్ డిజైన్ అంశాలు అలాగే ఉంటాయి. స్టాండర్డ్ మోడల్‌పై ఎగ్జాస్ట్ టిప్స్ మీరు మిస్ అయితే. క్యాబిన్  వచ్చేసి స్టాండర్డ్ మినీ కూపర్ 3-డోర్ నుండి తీసుకుంది. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో కూడిన గుండ్రటి సెంటర్ కన్సోల్‌, అలాగే మినీ మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, డిజిటల్ కన్సోల్ కూడా ఆశించవచ్చు. 

పవర్ కి సంబంధించి ఈ మినీ కూపర్ ఎస్‌ఈ 181 bhp, 270 Nm గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేసే ఒక ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగిస్తుంది. మోటార్ ముందు చక్రాలకు శక్తినిస్తుంది ఇంకా 32.6 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ నుండి శక్తిని పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ 7.3 సెకన్లలో 0-100 కి.మీ., గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఎలక్ట్రానిక్ లిమిటెడ్ స్పీడ్ తో దూసుకెళ్తుంది. డ్రైవింగ్ రేంజ్ సంబంధించి కూపర్ ఎస్‌ఈ ఒకే ఛార్జ్‌లో 235-270 కి.మీ (WLTP సైకిల్) ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. పెట్రోల్ మోడల్‌తో పోలిస్తే ఎలక్ట్రిక్ వెర్షన్ 145 కిలోల బరువు ఎక్కువగా ఉంటుంది.

కూపర్ ఎస్‌ఈ 11 kW ఛార్జర్‌ని ఉపయోగించి రెండున్నర గంటల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేయగలదని సంస్థ చెబుతోంది, అయితే పూర్తి ఛార్జ్ కు మూడు గంటల సమయం పడుతుంది. ఫాస్ట్ 50 kW ఛార్జర్ ఛార్జింగ్ సమయాన్ని కేవలం 35 నిమిషాలకు తగ్గిస్తుంది. స్టాండర్డ్ మినీ 3-డోర్ ధర రూ.38 లక్షల నుండి  రాబోయే మినీ కూపర్ ఎస్‌ఈ దాదాపు  రూ.50 లక్షల ధర ఉండవచ్చు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్). ఈ మోడల్ కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (CBU) గా వస్తుంది. జాగ్వార్ I-పేస్, మెర్సిడెస్ బెంజ్ EQC, ఆడి ఇ-ట్రోన్ రేంజ్‌తో పోల్చితే అత్యంత బడ్జెట్ లగ్జరీ ఎలక్ట్రిక్ వాహనంగా వస్తుంది.

click me!