కారెక్కిన అభిమానం.. చివరికి అక్కడ ఆటొగ్రాఫ్.. మురిసిపోయిన ఆనంద్ మహీంద్రా..

First Published | Oct 23, 2021, 2:24 PM IST

బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్‌ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ మనందరికీ తెలిసిందే. కానీ కొంతమంది డై హార్డ్ ఫ్యాన్స్  అభిమానం మనస్సును కదిలిస్తుంది. లెజెండరీ హీరో అమితాబ్ బచ్చన్‌ తాజాగా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ లో ఒక ఫోటోని షేర్ చేశారు. 

ఇందులో  తన డై హార్డ్ ఫ్యాన్ సరికొత్త మహీంద్రా థార్‌ని  అమితాబ్ బచ్చన్‌ పాపులర్ సినిమాల్లోని డైలాగ్‌లతో పాయింట్ చేశాడు. విశేషం ఏంటంటే తన మహీంద్రా థార్‌ డ్యాష్‌బోర్డ్‌పై అమితాబ్ బచ్చన్‌ ఆటోగ్రాఫ్‌  చేసే వరకు  నడపలేదని అమితాబ్ బచ్చన్‌ తెలియజేశాడు. వాహనమే కాకుండా  అమితాబ్ బచ్చన్‌ అభిమాని తన చొక్కాని కూడా హీరో ఐకానిక్ డైలాగ్‌లతో పెయింట్ చేశాడు.

సోషల్ మీడియాలో ఈ ఫోటోని షేర్ చేసిన అమితాబ్ బచ్చన్ తన అభిమాని కోసం ఒక ప్రత్యేక నోట్ రాశారు. ఏంటంటే అతను తన కారుని మొత్తం నా సినిమాల డైలాగ్‌లతో పెయింట్ చేసాడు .. ఇంకా అతని చొక్కాపై నా సినిమాల పేర్లు ఉన్నాయి ... మీరు కారు డోర్ తెరిచినప్పుడు సౌండ్ సిస్టమ్ నా సినిమాల డైలాగ్‌లను ప్లే చేయడం ప్రారంభిస్తుంది. ఇది చాలా అద్భుతంగా ఉంది .. అతను ఈ కారును కొనుగోలు చేశాక నేను డాష్‌బోర్డ్‌లో ఆటోగ్రాఫ్ చేసే వరకు డ్రైవ్ చేయలేదు. ఈ విషయం తెలిసాక నేను ఆటోగ్రాఫ్  చేశాను." అంటూ పోస్ట్ చేశారు.


ఈ ఫ్యాన్ ముమెంట్ ని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా దృష్టిని కూడా ఆకర్షించింది. ట్విట్టర్‌లో  మాట్లాడుతూ, అమితాబ్ బచ్చన్‌తో తన ఫ్యాన్ ముమెంట్ కోసం మహీంద్రా థార్‌ని ఎంచుకోవడం ఈ డైలాగ్లని జ్ఞాపకం తెచ్చింది: ఆజ్ మేరే పాస్ గాడీ హై, బంగ్లా హై, పైసా హై, తుమ్హారే పాస్ క్యా హై?...  అనురాగ్: మేరే పాస్ మహీంద్ర థార్ పర్ బిగ్ బి కా ఆటోగ్రాఫ్ హై."
 

 79 ఏళ్ల హీరో  అమితాబ్ బచ్చన్ ఎంతో పాపులారిటి  పొందాడు ఇంకా ఎన్నో మూవీ ప్రాజెక్టులలో పాల్గొన్నాడు.  అమితాబ్ బచ్చన్ అయాన్ ముఖర్జీ  రాబోయే చిత్రం బ్రహ్మాస్త్రలో ఆలియా భట్, రణబీర్ కపూర్‌లతో కలిసి కనిపించనున్నాడు. ప్రస్తుతం  అమితాబ్ బచ్చన్ ప్రముఖ గేమ్ షో - కౌన్ బనేగా కరోడ్‌పతి 13లో చేస్తున్నాడు.
 

Latest Videos

click me!