ఇండియన్ స్కూటర్ మార్కెట్లో దూసుకుపోతున్న హోండా యాక్టివాకు గట్టి పోటీ ఇచ్చేందుకు టీవీఎస్ సిద్దమయ్యింది. తక్కువ ధరలో మంచి లుక్ తో ఓ స్కూటర్ ని తీసుకువచ్చింది. దీని ధర, ఫీచర్లు, మైలేజ్ వంటి పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
భారతదేశ టూ-వీలర్ మార్కెట్లో స్కూటర్ల విభాగంలో ఎప్పుడూ తీవ్రమైన పోటీ ఉంటుంది. ఈ పోటీలో హోండా యాక్టివా తర్వాత అమ్మకాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది టీవీఎస్ జూపిటర్ 125… ఇప్పుడు ఇది కొత్త రంగులతో కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా స్కూటర్ లో మార్పులు చేసినా ధర పెంచకపోవడం కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది.
25
టీవీఎస్ జూపిటర్ 125 కొత్త రంగులు
టీవీఎస్ కంపెనీ జూపిటర్ 2026 మోడల్‌లో రెండు కొత్త రంగులను పరిచయం చేసింది. 'ఐవరీ మ్యాట్ కాపర్ బ్రాంజ్', 'ఐవరీ ఎలైట్ గ్రీన్' రంగులను ప్రస్తుతం డీటీ ఎస్.ఎక్స్.సి వేరియంట్‌లో మాత్రమే అందిస్తోంది. లుక్ పరంగా కొత్తదనం తీసుకొచ్చినా, స్కూటర్ ఇంజిన్ పనితీరులో, టెక్నికల్ ఫీచర్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.
35
టీవీఎస్ జూపిటర్ 125 ఫీచర్లు
ఈ కొత్త కలర్ ఆప్షన్స్‌ను డ్యూయల్-టోన్ అని చెబుతున్నా, వాస్తవానికి ఇది త్రీ-టోన్ కలర్ స్కీమ్‌లా కనిపిస్తుంది. ముదురు బ్రౌన్ కలర్ సీటు, ఫుట్‌బోర్డ్ చుట్టూ ఉన్న లేత బ్రౌన్ ప్యానెలింగ్ దీనికి మరింత స్టైలిష్ లుక్ ఇస్తున్నాయి. ఫ్రంట్ ఆప్రాన్, హెడ్‌ల్యాంప్ కౌల్, సైడ్ ప్యానెల్స్ ప్రధాన రంగులో ఉండగా, మిగతా బాడీ ఐవరీ రంగులో ఉంది.
జూపిటర్ 125 పలు వేరియంట్లలో అందుబాటులో ఉంది. బేస్ డ్రమ్-అల్లాయ్ వేరియంట్ ధర రూ.78,700 నుంచి మొదలవుతుంది. ఆ తర్వాత డిస్క్ వేరియంట్ ధర రూ.83,900గా ఉంది. కొత్త రంగులతో వచ్చిన డీటీ ఎస్.ఎక్స్.సి వేరియంట్ ప్రారంభ ధర రూ.86,750గా నిర్ణయించారు. ఇక కనెక్టివిటీ ఫీచర్లతో వచ్చే టాప్ వేరియంట్ ధర రూ.89,060గా ఉంది.
55
టీవీఎస్ జూపిటర్ 125 పోటీ స్కూటర్లు
పట్టణ ప్రయాణాలకు అనువైన సౌకర్యం, మంచి మైలేజ్, రోజువారీ వినియోగానికి సరిపోయే డిజైన్, ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లతో జూపిటర్ 125 ఇప్పటికే మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు ఈ కొత్త రంగుల చేరికతో, యాక్టివా 125, సుజుకి యాక్సెస్ 125, హీరో డెస్టినీ 125 వంటి పోటీ మోడళ్లకు వ్యతిరేకంగా టీవీఎస్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటోంది.