రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411: చెన్నైకి చెందిన బైక్ తయారీ సంస్థ భారతదేశంలో పాపులర్ హిమాలయన్ ఏడివి కొత్త బడ్జెట్ వెర్షన్‌ను బైక్ ని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ బైక్ హిమాలయన్ కంటే రోడ్-ఓరియెంటెడ్ మోడల్‌గా ఫిబ్రవరి 2022లో విడుదల కానుంది.
కేటిఎం ఆర్‌సి 390 (న్యూ-జెన్): బజాజ్ ఆటో కొత్త జనరేషన్ ఆర్‌సి 390 స్పోర్ట్ బైక్‌లను వచ్చే ఏడాది భారతదేశంలో విడుదల చేయనుంది. వీటి లాంచ్ 2022 మొదటి త్రైమాసికంలో జరగనుంది. కొత్త ఆర్‌సి 390 కూడా అవుట్‌గోయింగ్ మోడల్ కంటే కొంచెం ఖరీదైనదిగా వస్తుంది.
BSA Motorcycles
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350: స్క్రామ్ 411 తర్వాత చెన్నైకి చెందిన సంస్థ 2022 మధ్య నాటికి హంటర్ 350ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీనిని మీటిరియర్ 350 ఆధారంగా రూపొందించారు ఇంకా అదే ఇంజిన్, ప్లాట్‌ఫారమ్‌ను కూడా ఉపయోగిస్తుంది.
టివిఎస్ జెప్పెలిన్ క్రూయిజర్: దీనికి అధికారిక ధృవీకరణ లేనప్పటికీ హోసూర్ ఆధారిత వాహన తయారీ సంస్థ 2022 మధ్య నాటికి మొదటి క్రూయిజర్‌ను విడుదల చేయనుంది. దీనిని ఆటో ఎక్స్‌పో 2018లో ప్రదర్శించిన జెప్పెలిన్ క్రూయిజర్ ప్రొడక్షన్-స్పెక్ వెర్షన్ కావచ్చు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ (ఎస్‌జి 650): కంపెనీ గత నెల EICMAలో SG 650 ప్రోటోటైప్‌ను ప్రదర్శించింది. ఈ మోడల్ ప్రొడక్షన్-స్పెక్ వెర్షన్ 2022 పండుగ సీజన్ నాటికి భారతదేశంలో లాంచ్ కావొచ్చని ఆశిస్తున్నారు. అలాగే ప్రస్తుతం 650 ట్విన్స్ ఆర్‌ఈ ద్వారా ప్రస్తుతం ఉన్న అదే 650 cc ప్లాట్‌ఫారమ్ ఆధారంగా వస్తుంది.