జపాన్‌లో మేడ్ ఇన్ ఇండియా రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ లాంచ్.. స్పెషాలిటీ ఏంటంటే ?

First Published Dec 17, 2021, 2:07 PM IST

ఇండియన్ మల్టీ నేషనల్ మోటార్ సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (royal enfield)జపాన్ మార్కెట్లో  పాపులర్ హిమాలయన్ అడ్వెంచర్ బైక్(adventure bike) ని విడుదల చేసింది. ట్రిప్పర్ నావిగేషన్ పాడ్, స్విచ్ చేయగల ఏ‌బి‌ఎస్, మూడు కొత్త రంగులు వంటి ఫీచర్లతో పాటు లేటెస్ట్ యూరో 5 ఇటరేషన్ లో కొత్త హిమాలయన్(himalayan) పరిచయం చేసింది.
 

జపాన్‌లో ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను ప్రారంభించడంతో పాటు ఈ ఏడాది ప్రారంభంలో కార్యకలాపాలను ప్రారంభిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

అలాగే ఈ చర్య ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని మార్కెట్‌లో కంపెనీ ఉనికిని బలోపేతం చేయడానికి ఒక  కీలక అడుగుగా పరిగణించవచ్చు. హిమాలయన్ అలాగే 650 ట్విన్స్ (continental GT 650, interceptor INT 650) వంటి మోడల్‌లు జపనీస్ మార్కెట్లో  ఉనికిని పెంచుకోవడానికి కంపెనీకి సహాయపడతాయని భావిస్తున్నారు. 
 

కొత్త హిమాలయన్‌ను 2021లో మొదట భారత మార్కెట్‌లో విడుదల చేశారు. కొత్త ఏ‌డి‌వి చిన్న కాస్మెటిక్స్  మార్పులు అలాగే ఫీచర్ అప్‌డేట్‌లను అందించింది. దీనికి పైన్ గ్రీన్, మిరాజ్ సిల్వర్ అండ్ గ్రానైట్ బ్లాక్ రూపంలో మూడు కొత్త కలర్ ఆప్షన్‌లు కూడా ఇచ్చింది. 

2021కి సంబంధించిన కొన్ని కీలకమైన ట్వీక్‌లలో ట్రిప్పర్ నావిగేషన్ పాడ్, రియల్-టైం నావిగేషన్‌ను అందిస్తోంది అలాగే గూగుల్ మ్యాప్స్ ప్లాట్‌ఫారమ్‌తో రూపొందించారు.

బైక్ ముందు భాగంలో 411cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, సింగిల్ ఓవర్‌హెడ్ కామ్ (SOHC)ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 6,500 rpm వద్ద 24.3 bhp గరిష్ట శక్తిని, 4,000-4,500 rpm మధ్య 32 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేయగలదని  తెలిపింది. ఈ ఇంజిన్ ని 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు.

ఈ మోడల్‌లోని సస్పెన్షన్ కిట్‌లో 41 ఎం‌ఎం ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, ముందువైపు 200 ఎం‌ఎం ట్రావెల్‌తో పాటు వెనుకవైపు 180 ఎంఎం ట్రావెల్‌తో కూడిన మోనోషాక్ ఉంటాయి. బ్రేకింగ్ చూస్తే డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)తో ముందు/వెనుక చక్రంలో డిస్క్ బ్రేక్ ద్వారా పర్ఫర్మ్ చేస్తాయి.

click me!