హార్లే-డేవిడ్సన్ బడ్జెట్ ఎలక్ట్రిక్ బైక్.. 'యారో' ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఎంట్రీ..

First Published Dec 17, 2021, 1:03 PM IST

హార్లే-డేవిడ్సన్  (harley davidson)ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికిల్ బ్రాండ్ లైవ్ వైర్(live wire) క్రింద  ఎలక్ట్రిక్ బైక్‌లను తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం కంపెనీ రాబోయే కొద్ది సంవత్సరాలలో లైవ్‌వైర్ వన్ కింద 'ఎస్2 డెల్ మార్'(s2 del mar)ని పరిచయం చేయనుంది. 

హార్లే-డేవిడ్సన్ అత్యంత ఖరీదైన బైక్‌లను ఉత్పత్తి చేయడంలో ప్రసిద్ధి చెందిన సంగతి మీకు తెలిసిందే. ఈ ఖరీదైన బైక్‌లకు ఇండియాలోనూ మంచి డిమాండ్‌ ఉంది.   

కంపెనీ  కొత్త ప్రొప్రైటరీ స్కేలబుల్ మాడ్యులర్ 'యారో' ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ కొత్త ప్లాట్‌ఫారమ్ మిడిల్ వెయిట్ విభాగానికి జోడించింది. అంతేకాకుండా ఈ ప్లాట్‌ఫారమ్‌ని ఉపయోగించి భవిష్యత్తులో మరిన్ని మోడల్‌లు తీసుకురావాలని చూస్తోంది. దీంతో భారత్‌లో కంపెనీ వ్యాపారం కచ్చితంగా పెరుగుతుంది. ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు దేశంలో మంచి పాపులరిటీ ఏర్పడింది.  

మిడిల్ వెయిట్ లైవ్‌వైర్  ఎస్2 (system2) మోడల్‌ తర్వాత హార్లే-డేవిడ్సన్  ఈ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా మరిన్ని బైక్‌లను తీసుకురానుంది. లైవ్‌వైర్ ఎస్3 మోడల్‌లు అండ్ హెవీవెయిట్ లైవ్‌వైర్ ఎస్4 మోడల్‌ మరింత తేలికైన సిరీస్ గా ఉంటాయి. హెచ్‌డి లైవ్‌వైర్ వన్ బ్రాండ్  ప్రీమియం మోడల్‌గా కొనసాగుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కంపెనీ ఫ్లీట్‌లో గతంలో కంటే ఇప్పుడు మరిన్ని వేరియంట్‌లలో బైక్‌లు అందుబాటులోకి రానున్నాయి.

కొత్త యారో ప్లాట్‌ఫారమ్ ప్రస్తుత లైవ్‌వైర్ వన్  బ్యాటరీ-స్టోర్డ్-ఇన్-ఫ్రేమ్ ఫంక్షన్‌ను భర్తీ చేస్తుంది. ఇది కే‌టి‌ఎం సూపర్‌డ్యూక్ ఆర్, బి‌ఎం‌డబల్యూ మోటోరాడ్  R1100RS లేదా డుకాటి లైనప్‌లో కనిపించే దానితో సమానంగా ఉంటుంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో మోటారు, బ్యాటరీ, ఇన్వర్టర్ అండ్ ఆన్-బోర్డ్ ఛార్జర్ ఉంటాయి, వీటిని వివిధ కాన్ఫిగరేషన్‌లలో ఉపయోగించవచ్చు. 

 లెగసీ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ నుండి కొత్త బ్యాటరీ-ఆధారిత మోడల్‌లు అంతర్జాతీయ ప్రదర్శన తర్వాత ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వోచ్చు. 

click me!