రాయల్ ఎన్‌ఫీల్డ్ వాహనదారులకు అలెర్ట్.. ఆ లోపం కారణంగా 2 లక్షలకు పైగా బైక్స్ రీకాల్..

First Published | May 22, 2021, 2:25 PM IST

దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్  తాజాగా దాని 2 లక్షలకు పైగా బైకులకు రీకాల్ జారీ చేసింది.  వీటిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్, బుల్లెట్ వంటి పాపులర్ బైక్‌లతో పాటు ఇటీవల లాంచ్ చేసినా మిటీరియర్ బైక్స్ కూడా ఉన్నాయి.
 

మొత్తం మీద ఈ రీకాల్ భారతదేశంతో పాటు ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియా వంటి ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించిన 2,36,966 యూనిట్ల బైకులను ప్రభావితం చేస్తుంది.
ఈ రీకాల్ డిఫెక్టివ్ ఇగ్నిషన్ కాయిల్ కారణంగా జారీచేయడం జరిగిందని రాయల్ ఎన్‌ఫీల్డ్ తెలిపింది. బైక్ లో ఈ లోపం కారణంగా మిస్‌ఫైర్‌లు, వాహనాల పనితీరు తగ్గడం, కొన్ని అరుదైన సందర్భాల్లో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్‌కు దారితీస్తుందని ఐషర్ మోటార్స్ యాజమాన్యంలోని బైక్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ పత్రికా ప్రకటనలో తెలిపింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ సాధారణ ఇంటర్నల్ టెస్టింగ్ నిర్వహిస్తున్నప్పుడు ఈ లోపం మొదట కనుగొనబడింది. 2020 డిసెంబర్ నుండి ఏప్రిల్ 2021 మధ్య ఎక్స్ టర్నల్ సప్లయర్ నుండి సేకరించిన పదార్థాన్ని ఉపయోగించి తయారు చేయబడిన నిర్దిష్ట బైక్స్ బ్యాచ్‌లను మాత్రమే ఈ లోపం ప్రభావితం చేస్తుందని చెన్నైకి చెందిన సంస్థ తెలిపింది.
"రీకాల్ యాక్షన్ వేగంగా అమలు చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము, కస్టమర్లను సంబంధిత స్థానిక డీలర్‌షిప్‌ల ద్వారా ముందుగానే సంప్రదిస్తాము" అని రాయల్ ఎన్‌ఫీల్డ్ తన అధికారిక పత్రికా ప్రకటనలో తెలిపింది.
ఈ రీకాల్ డిసెంబర్ 2020 నుండి ఏప్రిల్ 2021 మధ్య తయారైన మిటిరియర్ బైక్‌లపై ప్రభావం చూపుతుంది. అలాగే 2021 జనవరి నుండి ఏప్రిల్ మధ్య తయారు చేసి విక్రయించిన క్లాసిక్ అండ్ బుల్లెట్ బైక్స్ కి కూడా ఈ రీకాల్ వర్తిస్తుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ రీకాల్ చేసిన బైక్‌లను చెక్ చేసి, అవసరమైతే కంపెనీ డిఫెక్టివ్ భాగాన్ని భర్తీ చేస్తుందని చెప్పారు. బుల్లెట్ తయారీ అంచనా ప్రకారం, 10% బైక్‌లకు మాత్రమే రీప్లేస్మెంట్ సర్వీస్ లభిస్తుంది.ఈ లోపం కారణంగా ప్రభావితమయ్యే బైక్ కస్టమర్లను ఇప్పటికే సంప్రదిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కస్టమర్లు పైన తెలిపిన వ్యవధిలో బైక్‌ను కొనుగోలు చేస్తే మీ బైక్‌ కి రీకాల్ వర్తిస్తుందా లేదా అనేదాని కోసం మీ స్థానిక డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు అని సూచించింది.

Latest Videos

click me!