Top 5 Indian Cars : ఏళ్ళ తరబడి వాడినా కొన్న ధరకే కారు అమ్మొచ్చా..! బెస్ట్ రీసేల్ వ్యాల్యూ ఉన్న 5 కార్లు ఇవే

Published : Jun 19, 2026, 01:44 PM ISTUpdated : Jun 19, 2026, 02:00 PM IST

మనం ఓ కారు కొనేటప్పుడు దాని రీసేల్ వ్యాల్యూ గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. సరైన కారును ఎంచుకుంటే ఎన్నేళ్లు వాడినా కొన్న ధరలో 70-80% రాబట్టుకోవచ్చు. ఇలా మంచి రీసేల్ అవకాశాలుండే టాాప్ 5 కార్లు ఏవో తెలుసా?

PREV
18
మంచి రీసేల్ వ్యాల్యూ ఉన్న కార్లు ఇవే..

కొత్త కారు కొనేటప్పుడు చాలామంది ధర, మైలేజ్, ఫీచర్ల గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. కానీ కారు కొనే ముందే దాని రీసేల్ వ్యాల్యూ గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. తప్పుడు కారును ఎంచుకుంటే కొన్నేళ్లకే దాని విలువ సగానికి పడిపోతుంది… అదే సరైన కారును సెలెక్ట్ చేసుకుంటే 4-5 ఏళ్లు వాడాక కూడా 70% నుంచి 80% వరకు మంచి రేటుకు అమ్ముకోవచ్చు. ప్రస్తుత భారత కార్ మార్కెట్ డేటా ప్రకారం… అత్యధిక రీసేల్ వ్యాల్యూ ఉన్న టాప్ 5 కార్ల గురించి వివరంగా చూద్దాం.

28
Toyota Innova Crysta (టయోటా ఇన్నోవా క్రిస్టా)

భారత కార్ మార్కెట్లో రీసేల్ వ్యాల్యూలో మొదటి స్థానంలో ఉన్న కారు టయోటా ఇన్నోవా క్రిస్టా. కొత్త కారును 5 సంవత్సరాలు వాడి అమ్మకానికి పెట్టినా కొన్న ధరలో 75% నుంచి 80% వరకు తిరిగి వస్తుంది. అంటే పైసా వసూల్ కారు అన్నమాట. 

క్రిస్టా రీసేల్ వ్యాల్యూకు కారణాలివే

టయోటా ఇంజిన్ నమ్మకం, కుటుంబమంతా హాయిగా ప్రయాణించే సౌకర్యం, ట్యాక్సీ/కమర్షియల్ రంగంలో దీనికి ఉన్న తిరుగులేని డిమాండే క్రిస్టా రీసేల్ వ్యాల్యూ ఈ స్థాయిలో ఉండటానికి కారణం. క్రిస్టా పాత మోడల్స్ అయినా మార్కెట్లో వెంటనే అమ్ముడైపోతాయి.

38
Toyota Fortuner (టయోటా ఫార్చ్యూనర్)

ప్రీమియం ఎస్‌యూవీ (Premium SUV) సెగ్మెంట్‌లో టయోటా ఫార్చ్యూనర్ ఒక రారాజుగా పేర్కొనవచ్చు. దీని రీసేల్ వ్యాల్యూ 70% - 80% వరకు ఉంటుంది. 

ఫార్య్చూనర్ రీసేల్ వ్యాల్యూకు కారణాలివే

ఇది కేవలం కారు మాత్రమే కాదు ఒక 'స్టేటస్ సింబల్'. దీని గంభీరమైన లుక్, ఆఫ్-రోడ్ వేగం, ఎక్కువ కాలం మన్నడం వంటివి సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో దీని ధర తగ్గకుండా చూస్తున్నాయి. మెయింటెనెన్స్ ఖర్చు కాస్త ఎక్కువే అయినా, రీసేల్ వ్యాల్యూ దాన్ని కవర్ చేస్తుంది.

48
Mahindra Thar (మహింద్రా థార్)

అడ్వెంచర్, ఆఫ్-రోడ్ ప్రియులకు ప్రస్తుతం మహీంద్రా థార్ హాట్ ఫేవరెట్. దీని రీసేల్ వ్యాల్యూ 70% - 75% వరకు ఉంటుంది. 

థార్ రీసేల్ వ్యాల్యూకు కారణాలివే

ఇది ఒక లైఫ్‌స్టైల్ వాహనం కావడంతో యువతలో దీనికి విపరీతమైన క్రేజ్ ఉంది. మార్కెట్లో దీని సప్లై తక్కువగా ఉంది, డిమాండ్ ఏమో ఎక్కువగా ఉండటంతో సెకండ్ హ్యాండ్ మార్కెట్లో థార్ కార్లు చాలా మంచి ధరకు అమ్ముడవుతున్నాయి.

58
Hyundai Creta & Kia Seltos (హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్)

మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అమ్మకాల రికార్డులు సృష్టిస్తున్నాయి హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ కార్లు. కొత్త కార్లు తక్కువ ధరలో లభించడమే కాదు.. అమ్మినా కూడా 70% - 75% వరకు రీసేల్ వ్యాల్యూను అందిస్తున్నాయి. 

క్రెటా, సెల్టోస్ రిసేల్ వ్యాల్యూకు కారణాలివే

 ఆధునిక ఫీచర్లు, స్టైలిష్ లుక్, అద్భుతమైన డ్రైవింగ్ క్వాలిటీ. ముఖ్యంగా హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ డీజిల్ వేరియంట్లకు సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది.

68
Maruti Suzuki Swift - (మారుతి సుజుకి స్విప్ట్)

తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ రీసేల్ వ్యాల్యూ ఇచ్చే కారు ఏదైనా ఉందంటే అది మారుతి సుజుకి స్విఫ్ట్. దీని రీసేల్ వ్యాల్యూ 70% - 75% వరకు ఉంటుంది.

స్విస్ట్ రీసేల్ వ్యాల్యూకు కారణాలివే

మారుతికి ఉన్న విస్తృతమైన సర్వీస్ నెట్‌వర్క్, చాలా తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, మంచి మైలేజ్ రీసేల్ వ్యాల్యూకు ప్రధాన కారణాలు. ఇక మొదటిసారి కారు కొనేవాళ్లకు, యువతకు ఇది మంచి ఛాయిస్ కాబట్టి, దీనికి డిమాండ్ ఎప్పుడూ తగ్గదు. (దీని సోదర మోడల్స్ అయిన డిజైర్, వ్యాగన్ ఆర్ కార్లకు కూడా మంచి రీసేల్ వ్యాల్యూ ఉంది).

78
కారుకు మంచి రీసేల్ ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి..
  • సర్వీస్ హిస్టరీ :  కారును ఎప్పుడూ అథరైజ్డ్ సర్వీస్ సెంటర్‌లో మాత్రమే సర్వీస్ చేయించి, అందుకు సంబంధించిన రికార్డులను జాగ్రత్తగా ఉంచుకోవాలి.
  • ఒరిజినాలిటీ : కారులో అనవసరమైన ఆఫ్టర్-మార్కెట్ ఫిట్టింగులను పెట్టకపోవడం మంచిది. ఒరిజినల్ కారుకు ఉండే విలువే వేరు.
  • రంగులు : తెలుపు (White), సిల్వర్ (Silver), గ్రే (Grey) వంటి కామన్ రంగులకు మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది.
88
మొత్తంగా రీసేల్ వ్యాల్యూ ఎక్కువగా ఉన్నా కారు ఇదే...

మొత్తంగా మీరు కారును కేవలం ఒక వాహనంగానే కాకుండా, ఒక పెట్టుబడిగా కూడా చూస్తే టయోటా ఇన్నోవా క్రిస్టా లేదా ఫార్చ్యూనర్ బెస్ట్ ఛాయిస్. బడ్జెట్ సెగ్మెంట్‌లో స్విఫ్ట్ లేదా క్రెటా మంచి రాబడిని ఇస్తాయి. కారును కొనే ముందూ, అమ్మే ముందూ కార్స్24 (Cars24), ఓఎల్ఎక్స్ (OLX), స్పిన్నీ (Spinny) వంటి ప్లాట్‌ఫామ్‌లలో ప్రస్తుత మార్కెట్ ధరను చెక్ చేసుకోవడం తెలివైన పని. 

Read more Photos on
click me!

Recommended Stories