మీ కారు లేదా స్కూటర్‌ను ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఎలా శుభ్రం చేసుకోవాలో తెలుసా..? వాహనం అద్దాలు క్లీన్ చేయడానికి ఏం వాడాలి? సీట్లపై మరకలను ఎలా పోగొట్టాలి? ఇలాంటి ఈ సింపుల్ టిప్స్ మీకోసం.
మీ కారు లేదా బండిని క్లీన్ చేయడానికి ప్రతీసారి వాషింగ్ సెంటర్ కు తీసుకెళుతున్నారాా? అయితే ఇందుకోసం బాగానే ఖర్చు చేస్తున్నారన్నమాట. కానీ కేవలం 1 రూపాయి నుంచి 10 రూపాయల ఖర్చుతో మీ వాహనాన్ని ఇంట్లోనే శుభ్రం చేసుకోవచ్చు… అదీ ఇప్పుడే షోరూం నుండి తీసుకువచ్చినదానిలా. వాష్ సెంటర్‌కు బదులుగా ఇంట్లోనే చిన్నచిన్న చిట్కాలు పాటించి కడిగితే మీ కారు లేదా స్కూటర్‌ను కొత్తదానిలా మెరిసిపోతుంది.
25
వెనిగర్, నీటిని వాడండి
ఒక స్ప్రే బాటిల్‌లో సమాన పరిమాణంలో వెనిగర్, నీళ్లు కలపండి. ఈ మిశ్రమాన్ని మీ స్కూటర్ లేదా కారు అద్దాలపై స్ప్రే చేయండి. ఆ తర్వాత, ఒక మైక్రోఫైబర్ క్లాత్‌తో శుభ్రంగా తుడవండి. ఇది దుమ్మును తొలగించి, మీ అద్దాలను కొత్తవాటిలా మెరిసేలా చేస్తుంది.
35
బేకింగ్ సోడాతో మొండి మరకలను శుభ్రం
మీ వాహనం సీటు లేదా కార్పెట్‌పై మరకలు పడితే దానిపై కొద్దిగా బేకింగ్ సోడా (వంట సోడా) చల్లండి. కాసేపు అలాగే వదిలేయండి. ఆ తర్వాత బ్రష్ లేదా గుడ్డతో తుడిచేయండి. ఇది దుర్వాసనను తొలగించడమే కాకుండా మొండి మరకలను కూడా పోగొడుతుంది.
కారును శుభ్రం చేసేటప్పుడు ఎండలో పార్క్ చేయొద్దు… అలా చేస్తే ఆరిన తర్వాత నీటి మరకలు కనిపిస్తాయి. అందుకే నీడలో ఉంచి కారును కడగండి. కారును కడిగిన తర్వాత శఉభ్రమైన పొడి గుడ్డతో తుడిస్తే కారు ఎక్కువ కాలం మెరుస్తూ ఉంటుంది.
55
కారు సీట్లు క్లీనింగ్
కారు లోపల శుభ్రం చేయడం పెద్ద సవాల్ తో కూడుకున్నది. ముఖ్యంగా సీట్ల మధ్యలో ఇరుకైన ప్రదేశాలుంటాయి... వీటిలో చెత్త పేరుకుపోతుంది. ఇలాంటి ప్రాంతాల్లో టూత్ బ్రష్ తో శుభ్రం చేయవచ్చు. ఇక సీట్లను శుభ్రం చేయడానికి డిష్ వాషింగ్ లిక్విడ్, ఐసోప్రొఫైల్ ఆల్కహాల్ ను మిక్సింగ్ చేసి సీట్లపై స్ప్రే చేయండి. మరకలు ఉన్నచోట బట్టతో తుడవండి. దీంతో సీట్లు పరిశుభ్రం అవుతాయి.