ఉక్కు వంటి ముడి పదార్థాల ధరల పెరుగుదల వాహన ధరల పెంపుకు కారణమని ఆటోమొబైల్ కంపెనీలు పేర్కొన్నాయి. మీరు కొత్త బైక్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే మీ బడ్జెట్ తక్కువగా ఉంటే మీ కోసం ఉన్న కొన్ని బెస్ట్ ఆప్షన్ బైక్స్ ఇక్కడ ఉన్నాయి. వీటోలో మీరు కొనుగోలు చేయగల టాప్ 5 చౌకైన బైకుల గురించి తెలుసుకోండి..
మార్చి నెలలో లభించే చౌకైన బైక్స్ జాబితాలో బజాజ్ సిటి 100 మొదటి స్థానంలోఉంది. ఈ బైక్ కిక్ స్టార్ట్ (కెఎస్) ఇంకా ఎలక్ట్రిక్ స్టార్ట్ (ఇఎస్) అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఢీల్లీలో బజాజ్ సిటి 100 కిక్ స్టార్ట్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ .47,654. అలాగే ఢీల్లీలో బజాజ్ సిటి 100 ఎలక్ట్రిక్ స్టార్ట్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర 51,802 రూపాయలు. ఈ బైక్‌కు 102 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ లభిస్తుంది. ఈ ఇంజిన్ గరిష్ట శక్తిని 7.9 పిఎస్, పీక్ టార్క్ 8.34 ఎన్ఎమ్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ 4-స్పీడ్ గేర్‌బాక్స్ తో వస్తుంది.
హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్హీరో మోటోకార్ప్ లైనప్‌లోని చౌకైన బైక్ హెచ్‌ఎఫ్ డీలక్స్. ఇది చాలా వేరియంట్లలో లభిస్తుంది. వీటిలో స్పోక్ వీల్ విత్ కిక్ స్టార్ట్, కిక్ స్టార్ట్ (అల్లాయ్ వీల్స్), సెల్ఫ్ స్టార్ట్, ఐ3ఎస్ తో సెల్ఫ్ స్టార్ట్ ఉన్నాయి. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర ఢీల్లీలో 50,200 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్ 97.2 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ లభిస్తుంది. ఈ ఇంజన్ 8.02 పిఎస్ శక్తిని, 8.05 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
బజాజ్ ప్లాటినా 100బజాజ్ ప్లాటినా 100 స్టాండర్డ్ సిటి100కి కొంచెం ఖరీదైన వెర్షన్. ఈ బైక్‌లో స్టైలిష్ గ్రాఫిక్‌లతో పాటు, మరికొన్ని కొత్త ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ బైక్ ఫ్రంట్ డిస్క్‌తో కిక్ స్టార్ట్, ఎలక్ట్రిక్ స్టార్ట్ వేరియంట్‌లతో వస్తుంది. ఢీల్లీలో ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర 52,166 రూపాయల నుండి ప్రారంభమై 63,578 రూపాయల వరకు ఉంటుంది. బజాజ్ ప్లాటినా 100 బైక్‌కు 102 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ లభిస్తుంది. ఈ ఇంజన్ 7.9 పిఎస్ శక్తిని, 8.3 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ కూడా 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
టీవీఎస్ స్పోర్ట్టీవీఎస్ స్పోర్ట్ బైక్ కిక్ స్టార్ట్ ఇంకా ఎలక్ట్రిక్ స్టార్ట్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది.ఢీల్లీలో టీవీఎస్ స్పోర్ట్ కిక్ స్టార్ట్ ఎక్స్-షోరూమ్ ధర 56,100 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. ఢీల్లీలో టీవీఎస్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ స్టార్ట్ ఎక్స్-షోరూమ్ ధర 62,950 రూపాయలు. ఈ బైక్ 109.7 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ తో వస్తుంది. ఈ ఇంజిన్ 8.29 పిఎస్ శక్తిని, 8.7 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌కు 4-స్పీడ్ గేర్‌బాక్స్ అందించారు.
హోండా సిడి 110 డ్రీంహోండా చౌకైన బైక్ సిడి 110 డ్రీం స్టాండర్డ్ ఇంకా డీలక్స్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ రెండు బైకుల మధ్య ప్రధాన వ్యత్యాసం వాటి పెయింట్ ఆప్షన్. ఢీల్లీలో సిడి 110 డ్రీం ఎక్స్-షోరూమ్ ధర రూ .64,508 నుండి ప్రారంభమై రూ .65,508 వరకు ఉంటుంది. సిడి 110 డ్రీమ్ బైక్‌కు 109.51 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ లభిస్తుంది. ఈ ఇంజన్ 8.79 పిఎస్ శక్తిని, 9.30 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌కి 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అందించారు.