ఉక్కు, అల్యూమినియం ఇతర ఖరీదైనవిగా మరడంతో ధరలను పెంచవలసి వస్తుంది అని కంపెనీలు చెబుతున్నాయి. కొత్త ధరలు ఏప్రిల్ 1 నుండి అమలులోకి రానున్నాయి. మరోవైపు సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలోని కార్ల ధరలు అత్యధికంగా పెరగనున్నాయి. అంతేకాకుండా గత మూడేళ్లలో వాటి ధరలు 11% పెరిగాయి.
మారుతి సుజుకిరెండోసారి ధరల పెంపును ప్రకటించిన మొదటి సంస్థ మారుతి సుజుకి. ఏప్రిల్ నుంచి మారుతి కంపెనీ వాహన ధరలను పెంచబోతోంది. కార్ల ఎక్స్-షోరూమ్ ధరలు 1-6 శాతం పెరగవచ్చని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పెరుగుదల రూ .5 వేల నుండి 34 వేల వరకు ఉంటుంది. అయితే, మోడల్ ఇంకా వేరియంట్లను ధరల పెంపు ఆధారపడి ఉంటుంది.
నిస్సాన్జపాన్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ కూడా కార్ల ధరలను పెంచుతున్నట్లు నిర్ణయించింది. అయితే ఎంత శాతం పెరుగుదల చేయబోతోంది అనే దానిపై ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. ఈ పెరుగుదల వివిధ వేరియంట్లపై ఆధారపడి ఉంటుంది. నిస్సాన్ సబ్ కాంపాక్ట్ మాగ్నైట్, డెట్సన్ లైనప్‌ల ధరలను పెంచనుంది. అలాగే మాగ్నైట్ ధర పెరగడం ఇది మూడవసారి. గత సంవత్సరం మాగ్నైట్ లాంచ్ చేసినప్పటి నుండి దాని ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ .4.99 లక్షలు నుండి 5.49 లక్షలకు పెరిగింది. ఈ నెల ప్రారంభంలో సంస్థ టర్బో వేరియంట్ ధరను 30 వేల రూపాయలకు పెంచింది.
రేనాల్ట్నిస్సాన్ తో పాటు రెనో కూడా ఏప్రిల్ నుండి వాహనాల ధరలను పెంచబోతోంది. ఈ ధరల పెంపు ఇటీవల లాంచ్ చేసిన రెనో కైగర్ పై కూడా ప్రభావవం చూపనుంది. రెనో డీలర్ల ప్రకారం, కంపెనీ వాహనాల ధరలను 10 నుండి 15 వేల రూపాయలు పెంచవచ్చు. అయితే ఇది వేర్వేరు మోడల్స్, వేరియంట్లపై ఆధారపడి ఉంటుంది. అంతకుముందు అంటే ఈ ఏడాది జనవరిలోకూడా కొన్ని మోడళ్ల ధరలను రూ .28 వేలు పెంచింది.
టయోటాఇతర కంపెనీలలాగానే టయోటా కూడా తన వాహనాల ధరలను పెంచబోతోంది. నిర్మాణ వ్యయాల పెరుగుదల కారణంగా ధరలను పెంచుతున్నట్లు టయోటా పేర్కొంది. ప్రతి మోడల్, వేరియంట్ ప్రకారం ధరల పెరుగుదల మారుతుందని టయోటా తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి గ్లాంజా, అర్బన్ క్రూయిజర్, యారిస్, ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్, కేమ్రీ, వెల్‌ఫైర్ ధరలను కంపెనీ పెంచునుంది.
ఫోర్డ్ఫోర్డ్ ఇండియా కూడా వాహనాల ధరలను ఏప్రిల్ 1 నుండి మూడు శాతం పెంచాలని నిర్ణయించింది. ఇందులో ఫోర్డ్ ఫిగో, ఆస్పైర్, ఫ్రీస్టైల్, ఇండైవర్ వాహనాలు ఉన్నాయి. అంతేకాకుండా జాగ్వార్ ఐ-పేస్, రాబోయే ఆడి ఇ-ట్రోన్‌లతో పోటీ పడే ముస్తాంగ్ మాక్ ఇను కూడా కంపెనీ విడుదల చేయబోతోంది.
ద్విచక్ర వాహనాలుకార్లతో పాటు ద్విచక్ర వాహన తయారీదారులు కూడా బైక్‌లు, స్కూటర్ల ధరలను పెంచబోతున్నారు. హీరో మోటోకార్ప్ బైకులు, స్కూటర్ల ఎక్స్-షోరూమ్ ధరలను ఇప్పటికే పెంచాలని నిర్ణయించింది. ముడి పదార్థాల ధరలు పెరగడం వల్ల ధరలను పెంచాల్సి వస్తుందని అయితే వినియోగదారులపై తక్కువ ప్రభావం చూపడానికి ప్రయత్నిస్తామని కంపెనీ తెలిపింది.రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇటీవల ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జిటి 650 అప్ డేట్ వెర్షన్‌ను విడుదల చేసింది. దీంతో పాటు కంపెనీ ధరలను కూడా రెండు శాతం పెంచింది.
చిన్న ఎస్‌యూవీల ధరలలో అత్యధిక పెంపుఆటోమేటిక్ బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్రపంచ సప్లయి జాటో నివేదిక ప్రకారం సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలోని వాహనాల ధరలు 2018 మార్చి నుండి 2021 మార్చి వరకు 11 శాతం పెరిగాయి. ఆ తర్వాత హ్యాచ్‌బ్యాక్ కార్ల ధరలు 4 శాతం, ఎమ్‌పివి ధరలు 9 శాతం, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ధరలు 3.5 శాతం, ప్రీమియం సెడాన్ కార్లు 8 శాతం, పెద్ద ఎస్‌యూవీల ధరలు 9 శాతం పెరిగాయి.జాటో డేటా ప్రకారం అత్యధికంగా అమ్ముడవుతున్న కొత్త వేరియంట్ల ధరలు మార్చి 2020 నుండి అత్యధికంగా పెరిగాయి. రేంజ్ రోవర్ 45%, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 5 38%, న్యూ జనరేషన్ థార్ 35%, న్యూ జనరేషన్ హ్యుందాయ్ ఐ20 19%, ఫేస్‌లిఫ్ట్ స్కోడా సూపర్బ్, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 3 ఆడి ఎ 7 న్యూ వేరియంట్స్ 18.6 శాతం పెరిగాయి.